Chief Secretary of the state
-
కేరళ చీఫ్ సెక్రటరీగా భర్త తర్వాత భార్య
తిరువనంతపురం: దక్షిణ భారతదేశంలో నెల వ్యవధిలోనే అరుదైన రికార్డు పునరావృతమైంది. కేరళ నూతన ప్రధాన కార్యదర్శిగా శారదా మురళీధరన్ బుధవారం నియమితులయ్యారు. ఆమె తన భర్త, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి వి.వేణు నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. వేణు ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు. ప్రణాళిక విభాగంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న 1990 బ్యాచ్ ఐఏఎస్ శారదను తదుపరి సీఎస్‌గా ఎంపిక చేస్తూ కేరళ కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కర్నాటకలోనూ ఆగస్టు 1న శాలినీ రజనీష్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. భర్త రజనీష్ గోయెల్ రిటైరయ్యాక ఆయన స్థానంలో శాలినీ సీఎస్ అయ్యారు. -
నిష్ణాతులైన వారే నియామకం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సలహాదారుల నియామకంలో ఎలాంటి నిబంధనలు లేవని, ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని, పరిపాలన వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న వారిని సలహాదారులుగా నియమించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. సలహాదారులు నిర్వర్తించాల్సిన విధులను వారి నియామక జీవోల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటుందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కోర్టుకు వివరించారు. వారి నియామకం తాత్కాలికమైనదని తెలిపారు. ఆ నియామకాలపై ఏ చట్టంలోనూ నిషేధం లేదని, ప్రభుత్వ అవసరాలను బట్టి వారి నియామకం ఉంటుందన్నారు. వీరి నియామకాన్ని ప్రజాధనం వృథా అనే కోణంలో చూడటానికి వీల్లేదని తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ స్పందిస్తూ.. సలహాదారులను నియమించే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నారా? వారు మీడియాతో మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. గతంలో ఎవరూ మీడియాతో మాట్లాడలేదన్నారు. ఏజీ వాదనలు వినిపిస్తూ.. గతంలో సలహాదారులు మీడియాతో మాట్లాడారని తెలిపారు. సాహ్ని నియామకం సరైనదే.. పాలనా వ్యవహారాల్లో విశేష అనుభవం ఉండటం వల్ల ఐఏఎస్ అధికారులుగా పనిచేసిన వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నియమించడం సంప్రదాయంగా వస్తోందని శ్రీరామ్ కోర్టుకు వివరించారు. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం విషయంలో గవర్నర్‌కు ముఖ్యమంత్రి ఏ రకమైన సలహాలు ఇవ్వలేదని, సిఫారసు చేయలేదని తెలిపారు. ఒకవేళ సలహా ఇచ్చినా, సిఫారసు చేసినా దానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. పరిపాలనలో సమర్థత కలిగిన వారి పేర్లను ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని, అంతిమంగా గవర్నర్ తన విచక్షణాధికారం మేరకే నీలం సాహ్నిని నియమించారని వివరించారు. ముఖ్యమంత్రి సలహాదారు పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఆమె ఎస్ఈసీగా నియమితులయ్యారని చెప్పారు. ఆమె నియామకం విషయంలో నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో వారెంటో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున న్యాయవాది బి.శశిభూషణ్‌రావు శుక్రవారం వాదనలు వినిపిస్తూ.. నీలం సాహ్ని ముఖ్యమంత్రి సలహాదారుగా వ్యవహరించారని, ఆమె పేరును గవర్నర్‌కు సీఎం సిఫారసు చేశారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ఎస్ఈసీగా ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులే నియమితులు కావాలని నిబంధనలు చెబుతున్నప్పుడు, వారికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఎస్ఈసీ నియామకం, పిటిషనర్ విచారణార్హత తదితరాలపై గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. -
పార్టీని బలోపేతం చేయడమే కర్తవ్యం
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అనంతపురం అర్బన్ : జిల్లాలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేయడమే ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలని ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన జిల్లా నాయకులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లాలో ఆశించిన స్థానాలు దక్కకపోవడం వెనుక ఉన్న పరిణామాలు పరిశీలించామని, పార్టీలో ఉన్నవారందరికీ సముచిత న్యాయం చేస్తామని అన్నారు. రాబోవు మంచి రోజుల కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. పార్టీ బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. పార్టీ కార్యవర్గాలతో పాటు 14 అనుబంధ సంఘాల ఏర్పాటును త్వరలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మహిళలకు పెద్ద పీట వేయనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన 200 వాగ్ధానాలను అమలు చేయాలని ఒత్తిడి చేస్తూ ఈనెల 5న చేపట్టిన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేరే వరకూ ప్రజలకు బాసటగా నిలవాలని అన్నారు. అనంతరం ఈ నెల 5న అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టబోయే నిరసన కార్యక్రమాల్లో భాగంగా కార్యాచరణ రూపొందించేందుకు వీకే భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకర్‌నారాయణ, జిల్లా మహిళ అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, పార్టీ రాష్ర్ట రాజకీయ వ్యవహారాల సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భూమన కరుణాకర్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి, న్యాయ విభాగం అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మీనుము నాగార్జున, రైతు సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి, సీజీసీ సభ్యులు గురునాథ్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ర్ట అధ్యక్షుడు సాలాం బాబా, ఐటి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై. మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్ బాషా, ఏడీసీసీ ఛైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి, ధర్మవరం, గుంతకల్లు, పుట్టపర్తి, శింగనమల నియోజకవర్గ నాయకులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వై. వెంకటరామిరెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గం తిప్పేస్వామి, మడకశిర నియోజకవర్గ తిప్పేస్వామి, మాజీ మంత్రి నర్సేగౌడ, కుప్పం నియోజకవర్గ నాయకులు చంద్రమౌళి, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, కార్పొరేటర్ జానకి, జిల్లా నాయకులు బి. ఎర్రిస్వామిరెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, యోగీశ్వర్‌రెడ్డి, ధనుంజయ యాదవ్, ఆదినారాయణ, మీసాల రంగన్న, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, వీరాంజినేయులు, రిలాక్స్ నాగరాజు, కొర్రపాడు హుస్సేన్ పీరా, మిద్దె భాస్కర్‌రెడ్డి, ఆలూమూరు శ్రీనివాస్‌రెడ్డి, చింతకుంట మధు, మారుతి నాయుడు, పెన్నోబిలేసు, బండి పరుశురాం, సోమశేఖర్‌రెడ్డి, శ్రీదేవి, కృష్ణవేణి, ప్రమీల, ఆజీరా బేగం, దేవి, లక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
6న బక్రీద్!
- సెలవు ప్రకటించిన ప్రభుత్వం - ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా ఐదు రోజుల సెలవు సాక్షి, చెన్నై : త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ఈనెల ఆరో తేదీ జరుపుకోనున్నారు. ఆ రోజును సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా ఐదు రోజు లు సెలవు దొరికినట్టు అయింది. భక్తి భావాన్ని చాటే రంజాన్ పండుగ అనంతరం ముస్లింలకు మరో ముఖ్య పండుగ బక్రీద్. త్యాగ నిరతిని చాటే ఈ పండుగను ఈదుల్ జుహా, ఈదుజ్జుహా అని కూడా పిలుస్తుంటారు. ఈ పండుగ వెనుక త్యాగాన్ని చాటే కథ ఉంది. దుల్హాజ్ మాసంలో పదో తేదీని బక్రీద్ పర్వదినంగా జరుపుకుంటారు. ఈ ఏడాది బక్రీద్ పర్వదినం అక్టోబరు ఐదో తేదీగా క్యాలెండర్లలో ప్రకటించారు. ఆ రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటన విడుదలయ్యింది. ఎటూ ఐదో తేదీ ఆదివారం కావడంతో సెలవు ఇచ్చినా ఒకటే.. ఇవ్వకున్నా ఒక్కటే. నెల వంక కనిపించగానే, దుల్హజ్ మాసం ఆరంభమైనట్టుగా ముస్లింలు భావిస్తారు. ఆ మేరకు ఈ నెల 25న ఆకాశంలో నెల వంక కన్పించిన దాఖలాలు లేవు. దీంతో క్యాలెండర్లలో పేర్కొన్న తేదీలో మార్పు అనివార్యం అయింది. ఆ రోజున కాకుండా మరుసటి రోజున కనిపించడంతో పండుగను సోమవారం జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనిపించని నెలవంక ఆకాశంలో నెలవంక కన్పించని దృష్ట్యా, పండుగను ఆరో తేదీ జరుపుకునే విధంగా ప్రధాన హాజీ ప్రకటించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. ప్రభుత్వ సెలవు దినాన్ని సోమవారానికి మార్చాలని సూచించారు. దీనిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ సుంకత్ ఆరోతేదీని సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం బక్రీద్ పర్వదినంగా ప్రకటన విడుదల చేస్తూ, ఆ రోజును రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినంగా పేర్కొన్నారు. సోమవారం సెలవు దినం ప్రకటించడంతో వరుసగా ఐదు రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు విరామం లభించినట్టు అయింది. గురువారం ఆయుధ పూజ, శుక్రవారం విజయ దశమి సెలవు దినాలు కాగా, శని, ఆదివారాలు ఎలాగో సెలవు రోజులు కావడం విశేషం.