chiken
-
ఘుమఘుమలాడే బెంగాలీ రొయ్యల ఇగురు, క్యాబేజీ చికెన్.. ఎలా వండాలంటే..
మన దగ్గర చాలా మంది క్యాబేజీ తినడానికి పెద్దగా ఆసక్తి కనబరచరు. కానీ ఇతర దేశాల్లో ప్రతి సలాడ్లోనూ క్యాబేజీ ఉండాల్సిందే. దీనిలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. నారింజ పండులోకంటే క్యాబేజీలోనే విటమిన్ సీ అధికంగా ఉంటుంది. పీచుకూడా ఎక్కువే. ఇవేగాక సల్ఫర్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, విటమిన్ కే, అయోడిన్, పొటాషియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఇది మంచి ఆహారం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న క్యాబేజీని రుచికరంగా ఎలా వండుకోవచ్చో చూద్దాం... కావల్సిన పదార్థాలు: రొయ్యలు – పావు కేజీ, ఆవ నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు, బంగాళ దుంప – ఒకటి (ముక్కలుగా తరగాలి), బిర్యానీ ఆకు – ఒకటి, జీలకర్ర – టీస్పూను, ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను, పసుపు – టీస్పూను, కారం – రుచికి సరిపడా, టొమాటో – ఒకటి( సన్నగా తరగాలి), ఉప్పు – రుచికి సరిపడా, పంచదార – అర టీస్పూను, క్యాబేజీ తరుగు – నాలుగు కప్పులు ( ఉప్పునీళ్లల్లో అరగంటపాటు నానబెట్టుకోవాలి), గరం మసాలా పొడి – అరటీస్పూను. తయారీ విధారం: ►ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి పసుపు, కొద్దిగా ఉప్ప వేసి కలిపి పదినిమిషాలపాటు నానబెట్టాలి. ►స్టవ్ మీద బాణలి పెట్టి అవనూనె వేసి వేడెక్కిన తరువాత నానబెట్టిన రొయ్యలు వేసి ఒక నిమిషంపాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. ►బంగాళ దుంప ముక్కలు వేసి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ►ఇదే పాన్‌లో జీలకర్ర, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►ఉల్లిపాయ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నీళ్లు పోసి పచి్చవాసన పోయేంత వరకు వేయించాలి. ►ఇప్పుడు పసుపు, జీలకర్ర పొడి, కారం, టొమాటో తరుగు, కొద్దిగా నీళ్లు పోసి ఐదు నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ►ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళ దుంప ముక్కలు, రొయ్యలు, నానబెట్టిన క్యాబేజీ, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూతపెట్టి సన్నని మంటమీద ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించి, తరువాత గరం మసాలా పొడి చల్లితే బెంగాలీ రొయ్యల ఇగురు రెడీ. క్యాబేజీ చికెన్ ఎలా వండాలో తెలుసా! కావల్సిన పదార్థాలు: చికెన్ బ్రెస్ట్ ముక్కలు – అరకేజీ, ఉల్లిపాయ – ఒకటి (ముక్కలుగా తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – మూడు (సన్నగా తురుముకోవాలి), ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు, క్యాబేజీ తరుగు – ఐదు కప్పులు, ఎర్ర రంగు క్యాప్సికమ్ – ఒకటి( ముక్కలు చేయాలి), కొబ్బరి సాస్ – పావు కప్పు, తరిగిన అల్లం – అర టేబుల్ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, మిరియాల పొడి – రెండు టీస్పూన్లు, స్రింగ్ ఆనియన్ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ►ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడిక్కిన తరువాత వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►తరువాత చికెన్ ముక్కలు వేసి గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించాలి. ►చికెన్ వేగాక క్యాబేజీ తరుగు, క్యాప్సికమ్ ముక్కలు, కొబ్బరి సాస్, అల్లం, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు మగ్గనిస్తే క్యాబేజీ చికెన్ రెడీ. -
చికెన్- పాలకూర ఫ్రిట్టర్స్ ఎలా తయారు చేయాలో తెలుసా?
చికెన్–పాలకూర ఫ్రిట్టర్స్ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ – పావు కేజీ (మెత్తగా ఉడికించుకుని తురుములా చేసుకోవాలి), మొక్కజొన్న పిండి, చిక్కటి పాలు – అరకప్పు చొప్పున, బియ్యప్పిండి – పావు కప్పు, పాలకూర తురుము – 1 కప్పు, పచ్చిమిర్చి – 2 (చిన్న ముక్కలుగా తరగాలి), కొత్తిమీర తురుము – కొద్దిగా, టొమాటో గుజ్జు – 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – కొద్దిగా, గుడ్డు – 1 (అర టేబుల్ స్పూన్ పాలలో కలిపి పెట్టుకోవాలి.. అభిరుచిని బట్టి). తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, ఉడికించిన చికెన్ తురుము వేసుకుని, పాలు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో గుజ్జు, తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము, పాలకూర తురుము వేసుకుని బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా చేసుకుని ఓవెన్లో ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత అభిరుచిని బట్టి.. గుడ్డు – పాల మిశ్రమంలో ముంచి, పాన్ మీద ఇరువైపులా కొద్దిగా నూనె వేసుకుని దోరగా వేయించుకోవాలి. లేదంటే ఓవెన్లో ఉడికించినవి టొమాటో సాస్‌లో తింటే భలే రుచిగా ఉంటాయి. వాల్నట్ లడ్డూస్ కావలసినవి: శనగపిండి – 2 కప్పులు, వాల్నట్స్ – ముప్పావు కప్పు (నేతిలో దొరగా వేయించి, మిక్సీ పట్టుకోవాలి), పంచదార పొడి –1 కప్పు, నెయ్యి – 1 కప్పు, యాలకుల పొడి – 1 టీ స్పూన్, నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: స్టవ్ ఆన్ చేసుకుని పాన్‌లో నెయ్యి వేసుకుని అందులో శనగపిండి వేసుకుని తిప్పుతూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత నీళ్లు పోసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. వాల్నట్స్ పౌడర్, పంచదార పొడి, యాలకుల పొడి వేసుకుని తిప్పుతూ ఉండాలి. పొడిపొడిగా మారి, దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. ఆ మిశ్రమం చల్లారనివ్వాలి. అనంతరం లడ్డూల్లా చేసుకోవాలి. అభిరుచిని బట్టి డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. కోకోనట్–రైస్ ఇడ్లీ కావలసినవి: కొబ్బరి కోరు, అన్నం – అర కప్పు చొప్పున, బెల్లం కోరు – పావు కప్పు (అభిరుచిని బట్టి), అరటిపండ్లు – 2, నెయ్యి – (ఇడ్లీ ప్లేట్స్కి అప్లై చేసుకునేందుకు సరిపడా) తయారీ: ముందుగా మిక్సీ బౌల్లో అన్నం, కొబ్బరికోరు, బెల్లం కోరు (అభిరుచిని బట్టి) అరటిపండు ముక్కలు వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ రేకులకు నెయ్యి రాసుకుని, అందులో అన్నం–కొబ్బరికోరు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకుని పది లేదా పన్నెండు నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. బెల్లం కోరు వెయ్యకుంటే చేసుకున్న ఇడ్లీలైతే.. సాంబార్లో భలే రుచిగా ఉంటాయి. -
జర భద్రం..కోడిమాంసానికి రంగుల పూత
నల్లగొండ టూటౌన్ : మాంసం వ్యాపారులు స్వలాభం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మేకపోతు అంటూ.. మేకల మాంసం, కోడి మాంసానికి రంగులు వేసి అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా రంగులు వేయని కోడి మాంసం దొరికే పరిస్థితి లేదంటే అతిశయోక్తికాదు. దాదాపు వ్యాపారులందరు కోడి మాంసానికి రంగులు వేసి మసి పూసి మారేడుకాయ చేసి నాలుగు పైసలు వెనకేసుకోవడానికే ఆశపడుతున్నారు. ఈ రంగుల వలన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారనే ధ్యాస కూడా లేకుండా ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాలు మిర్యాలగూడ, నకిరేకల్, హాలియా, దేవరకొండతో అన్ని మండలాల్లో కోడి మాంసానికి రంగులు పూసి విక్రయిస్తున్నారు. ఒక్క కోడి మాంసమే కాదు మనం నిత్యం బయటి హోటలల్లో తినే (మటన్ ఇతరత్ర) ఆహార పదార్థాలు అన్నీ కల్తీ మయం చేస్తున్నట్లు అనేక ఫిర్యాదులు ఉన్నాయి. మటన్లోనూ మాయ... మార్కెట్లో మటన్ అంటే యమ క్రేజ్ ఉంటుంది. ప్రతి ఆదివారం మటన్ షాపుల వద్ద వినియోదారులు బారులుదీరుతుంటారు. మటన్ మీద వినియోదారులు చూపిçస్తున్న క్రేజ్‌ను వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. మేకలను కోసి మేకపోతు మాంసం అని విక్రయిస్తున్నారు. అదే విధంగా కొంతమంది వ్యాపారులు అనారోగ్యం బారిన పడిన మేకలను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ వినియోగదారులకు అంటగడుతున్న ట్లు తెలిసింది. రెస్టారెంట్లలో మటన్‌కు సైతం రం గులు వేసి బిర్యానీలు తయారీ చేస్తుండడం గమనార్హం. అనేక చోట్ల మటన్లోనూ వినియోగదారులను మాయ చేçస్తుండడం విస్మయం కలిగిస్తోంది. సర్వం కల్తీమయం బజ్జీబండి నుంచి రెస్టారెంట్ల వరకు ఎక్కడ చూసినా కల్తీ చేసిన ఆహార పదార్థాలనే తయారు చేసి వడ్డించేస్తున్నారు. విశేషమంటే బయటి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఏ హోటల్‌కు వెళ్లినా జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఈ కల్తీ ఆహార పదార్థాలే వడ్డిస్తుండడం వారిని విస్మయానికి గురిచేస్తోంది. ప్రతి వ్యాపారి కల్తీ మయం చేస్తున్నట్లు గతంలో ఓ సారి నల్లగొండ మున్సిపల్ అధికారులు తనిఖీలు చేసినప్పుడు బయటపడిన విషయం తెలిసిందే. ఇక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అయితే అంతులేని రంగులు వాడుతున్నట్లు అధికారులే చెబుతున్నారు. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ దర్శనమిచ్చే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బండీలపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టడంలేదనే ప్రశ్నలకు సమాధానాల్లేవు. హోటల్ నిర్వాహకులు ఇష్టానుసారంగా మాంసంతో తయారు చేసిన ఆహార పదార్థాలు వడ్డించేస్తున్నారు. మిగిలిన ఆహార పదార్థాలను సైతం మరుసటి రోజు వినియోగదారులకు వడ్డించటం పరిపాటిగా మారిందనే విమర్శలు లేకపోలేదు. అరకొర తనిఖీలు ... జిల్లా యంత్రాంగం నిర్లిప్తత, తనిఖీ అధికారుల జాడలేకపోవడంతో కల్తీ రాజ్యం నడుస్తుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వాటిపై తనిఖీలు చేయాల్సిన అధికారులు ఎక్కడ ఆ పని సీరియస్‌గా తీసుకుంటున్న దాఖలాలు లేవనే విమర్శలు లేకపోలేదు. జిల్లా ఉన్నతాధికారులు తనిఖీలకు ఆదేశించినప్పుడు మాత్రమే అరకొరగా దాడులు చేసి హడావుడి చేస్తారనే అపవాదు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల్లో ప్రతి రోజు కొన్ని వందల షాపుల్లో కల్తీలు జరుగుతున్న సంబంధిత శాఖల అధికారులు మత్తు నిద్ర వదలడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికారుల కళ్లేదుట రంగులు వాడిన పదార్థాలు కనిపించినా సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించింది ఒక్క శాతం కూడా లేదనే చెప్పాలి. ఇప్పటికైనా సంబంధిత అధికారుల నామమాత్రంగా కాకుండా చిన్న వ్యాపారులతో పాటు రెస్టారెంట్లు, పెద్ద, పెద్ద హోటళ్లపై ఆకస్మిఖ దాడులు చేస్తేనే కల్తీమయానికి కొంతైనా అడ్డకట్ట వేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మటన్, చికెన్ షాపుల్లో తనిఖీలు జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ల బృందం ఆదివారం నల్లగొండ పట్టణంలోని పలు మటన్ షాపులు, చికెన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించింది. ఉదయం 8 గంటల ప్రాంతంలోని పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు, రామగిరి ప్రాంతంలో మటన్ షాపులు, చికెన్ షాపుల్లో తనిఖీలు చేసి పలు చోట్ల అక్రమాలను గుర్తించారు. ఎక్కువ షాపుల్లో తప్పుడు తూకాలు వేసి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు జిల్లా మెట్రాలజీ ఇన్‌స్పెపెక్టర్ శ్రీనివాస్ గుర్తించారు. అదే విధంగా కొంత వ్యాపారులు తమ కాంటాలకు ముద్ర వేయించుకోకుండా ప్రభుత్వ నిబంధనలకు ఉల్లగించారు. హైదరాబాద్ రోడ్డులో మేకపోతు అని చెబుతూ మేక మాంసం విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కోడి మాంసానికి రంగులు పూసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తప్పుడు తూకాలు, ముద్ర వేయించకపోవడంతో వ్యాపారులపై జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఐదు కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కలీల్, శానిటరీ ఇన్స్పెక్టర్ సురిగి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కల్తీ చేస్తే కఠిన చర్యలు ఆహార పదార్థాలు, మట న్, చికెన్లను కల్తీ చేసి విక్రయిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాము. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తాం. వినియోదారులు కూడా కల్తీ పట్ల అప్రమత్తంగా ఉండాలి. – ఖలీల్, జిల్లా గెజిటెడ్ ఇన్స్పెక్టర్ -
రిటైల్ మార్కెట్లో భారీగా పెరగనున్నచిక్న్
-
టేబుల్ నంబర్ 9.. చికెన్ కుర్కురే
న్యూఢిల్లీ : ‘పరమ శివునికి మహా భక్తున్ని అని చెప్పుకుంటూ.. పవిత్ర మానససరోవర యాత్ర చేస్తున్న మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీశారు’ అంటూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై విరుచుకు పడుతున్నారు బీజేపీ కార్యకర్తలు. విషయమేంటంటే ప్రస్తుతం మానససరోవర యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ఆగస్టు 31న నేపాల్ రాజధాని ఖాట్మండు చేరుకున్నారు. ఆ సమయంలో భోజనం చేయడం కోసం ‘వూటూ’ రెస్టారెంట్‌కి వెళ్లారు. ఈ విషయం గురించి సదరు రెస్టారెంట్ ప్రస్తావిస్తూ ‘రాహుల్ గాంధీ ఓ సాధారణ వ్యక్తి లాగానే రెస్టారెంట్‌కి వచ్చారంటూ’ తన వెబ్సైట్లో ఓ పోస్టు కూడా పెట్టింది. రాహుల్ గాంధీ వూటూ రెస్టారెంట్‌ని సందర్శించిన విషయం తెలుసుకున్న స్థానిక మీడియా రాహుల్ గాంధీ భోజన విషయాలను తెలుసుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శించింది. ఈ క్రమంలో ఆ రెస్టారెంట్లో పని చేస్తున్న ఓ వెయిటర్ ద్వారా రాహుల్ ఎక్కడ కూర్చున్నారు.. ఏం ఆర్డర్ చేశారు వంటి విషయాల గురించి కూపీ లాగింది. సదరు వెయిటర్ రాహుల్ రెస్టారెంట్‌లోని 9వ నంబర్ టేబుల్లో కూర్చున్నారని, భోజనంలో భాగంగా చికెన్ కుర్కురే ఆర్డర్ చేశారని తెలిపాడు. ఇంకేముంది మీడియా వారికి మంచి వార్త దొరికింది. ఈ విషయాలను పలు టీవీ చానల్స్ గంటల కొద్ది ప్రసారం చేయడంతో రాహుల్‌గాంధీ మీద బీజేపీ నాయకులు, కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. ‘ నచ్చిన ఆహారం తినే స్వేచ్ఛ మీకు ఉంది. కానీ మీరు శివభక్తున్ని అని చెప్పుకుంటూ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మానససరోవర యాత్రలో ఉండి ఇలా మాంసాహారం తినడం సమంజసమేనా..? మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీశారం’టూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ భోజనం విషయం తీవ్రం కావడంతో సదరు రెస్టారెంట్ దిద్దుబాటు చర్యలకు దిగింది. రాహుల్ తమ రెస్టారెంట్లో శాఖాహార భోజనాన్నే ఆర్డర్ చేశారని.. తమ వెయిటర్ ఏ మీడియా సంస్థకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. తమ రెస్టారెంట్లో దొరికే శాఖాహార వంటల వివరాలను తెలుపుతూ ఓ లేఖ విడుదల చేసింది. కానీ ఈలోపే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ ప్రారంభమైంది. రాహుల్ గాంధీ చేసిన పని సమంజసంగా లేదంటూ నెటిజన్లు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. గతేడాది కర్ణాటక ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ప్రయాణం చేస్తున్న విమానానికి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కానీ అదృష్టవశాతు రాహుల్ గాంధీ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. దాంతో పరమేశ్వరుని మహిమ వల్లే తను సురక్షితంగా బయటపడ్డానని అందుకే ఈ ఏడాది మానససరోవర యాత్ర చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ ఈ యాత్ర తలపెట్టారు. -
తేనె స్వచ్ఛత తెలియాలంటే
►కీర దోస, బీర కాయలు కొన్ని చేదుగా ఉంటాయి. చెక్కు తీసే ముందే వాటిని మధ్యలోకి విరిస్తే చేదుబారవు. ►తేనె స్వచ్ఛత తెలియాలంటే, ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ తేనె వేయాలి. నీటిలో కరగకుండా అడుగుకు చేరితే అది మంచి తేనె. ►వేడి నీటిలో ఉప్పు కలిపి వాడాల్సి వస్తే, నీళ్లు మరిగిన తర్వాత మాత్రమే ఉప్పు కలపాలి. ముందే ఉప్పు వేస్తే మరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ►చికెన్ కాని, మటన్ కాని ప్రెషర్ కుకర్‌లో ఉడికించినట్లయితే గ్యాస్‌తో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. అందులోని పోషకాలు నశించకుండా ఉంటాయి. ►వెల్లుల్లి పొట్టు త్వరగా రావాలంటే అరగంట సేపు నీటిలో నానబెట్టాలి. ►నూనె ఎక్కువగా వేసి చేసే డీప్ ఫ్రైలను తగ్గించి వంటకాలను బేక్ చేసి తినడం అలవాటు చేసుకుంటే శరీరంలోకి చేరే కొవ్వు శాతం తగ్గుతుంది. ►కాపర్ బాటమ్ పాత్రలు తళతళ మెరవాలంటే మామూలుగా వాడుతున్న క్లీనింగ్ పౌడర్ కాని సబ్బు కాని వేసి మెటల్ స్క్రబ్బర్‌తో శుభ్రం చేయాలి. -
కోడికూర వేయలేదని కన్నవారినే...!
సూర్యాపేట: వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా ఒక్కటే అనే నానుడి మనకు తెలిసిందే. కానీ సొంత ఇంట్లోనే రెండు ముక్కలు తక్కువయ్యాయని కన్నవారనే కనికరం లేకుండా గోడ్డలితో దాడి చేశాడు ఓ యువకుడు. తనకు తగినంత కోడికూర వేయలేదనే ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఆ సంఘటన సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డి గూడెంలో చేసుకుంది. వివరాలు బానోతు తార్యా, సోమిలికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. పెద్ద కుమారుడు బానోతు శీనుకు 2012లో వివాహమయ్యింది. ఇతని ప్రవర్తన నచ్చకపోవడంతో పెళ్లైన ఆరు నెలలకే భార్య విడాకులు తీసుకుని వెళ్లపోయింది. అప్పటి నుంచి శీను ఏ పని చేయకుండా జులాయిలా తిరుగుతున్నాడు. ఏదో ఒక పని చేయాలని తల్లిదండ్రులు తరచూ మందలించే వారు. గత రాత్రి ఇంట్లో కోడి కూర వండారు. శీనుకి ముక్కలు తక్కువగా వేశారని తల్లదండ్రును తిట్టాడు. తరువాత తమ్ముడు, మరదలు ఇంట్లో పడుకున్నారు. ఇంటి ముందర తల్లిదండ్రులతో పాటు శీను పడుకున్నాడు. అందరూ నిద్రపోయాక శీను గొడ్డలితో తారయ్యను నరికాడు. దీంతో ఆయన గట్టిగా అరవగా సోమిలిలేచి అడ్డు రావడంతో ఆమె తలపై నరికి పరారయ్యాడు. క్షతగాత్రులను 108 ద్వారా సూర్యాపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సోమిలి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. శీనుని అరెస్ట్‌చేసి రిమాండ్‌కి తరలించినట్లు అర్వపల్లి ఎస్పై మోహన్‌రెడ్డి తెలిపారు. -
ఎండ దెబ్బకు కోడికూర కొక్కొరోకో..
-
కోడికూర కొక్కొరోకో..
► కిలో చికెన్ రూ. 250 ► రికార్డు స్థాయికి చేరిన ధర ► గతేడాది రూ.200లోపే.. ► ఎండ దెబ్బకు నెల రోజుల్లోనే 25 లక్షల కోళ్లు మృతి ► ఫారాల యజమానులకు రూ.50 కోట్ల నష్టం ► మరో పది రోజులు ఇవే ధరలు సాక్షి, హైదరాబాద్: కోడి ధర కొండెక్కింది.. ఎండ దెబ్బకు చికెన్ రేటు మండిపోతోంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో చికెన్ ధర రూ.250కి ఎగబాకింది! దీంతో సామాన్యులు చికెన్ కొనాలంటే వెనకాముందు ఆలోచిస్తున్నారు. కోడిని వదిలేసి గుడ్డుతో సరిపెట్టుకుంటున్నారు. హోటళ్లలోనూ వినియోగదారులకు చికెన్ పరిమాణాన్ని తగ్గించి పెడుతున్నారు. కొన్నిచోట్ల ధరలు కూడా పెంచేశారు. కోళ్ల ధరలు పెరగడంతో చికెన్ వ్యాపారం తగ్గిపోయిందని దుకాణదారులు చెబుతున్నారు. మరో 10 రోజులు ధరలు ఇదే స్థాయిలో ఉంటాయని పౌల్ట్రీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఆదివారం 70 లక్షల కిలోలు తెలంగాణలో నెలకు 4 కోట్ల కిలోల చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. సాధారణ రోజుల్లో రోజూ 4 లక్షల కిలోల విక్రయాలు జరుగుతుంటే.. ఆదివారాల్లో మాత్రం 70 లక్షల కిలోల దాకా చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయి. బ్రాయిలర్ ఫారాల నుంచి వ్యాపారులకు కోళ్లను కిలోకు రూ.100 వరకు విక్రయిస్తుంటారు. డిమాండ్ తక్కువైతే ఒక్కోసారి రూ.75కు కూడా విక్రయిస్తుంటారు. గతేడాది ఇదే సీజన్లో రూ.100కు మించి ధర పలకలేదు. అలాంటిది ప్రస్తుతం కోళ్ల ఫారాల యజమానులు కిలో రూ.125కు విక్రయిస్తున్నారు. దీంతో చికెన్ దుకాణాల్లో ధరలు పెరిగిపోయాయి. లైవ్ చికెన్ కిలో రూ.145, స్కిన్‌తో రూ.210, స్కిన్లెస్ రూ.250 పెరిగిపోయింది. ఇంత భారీగా చికెన్ ధర ఎన్నడూ లేదని దుకాణదారులు అంటున్నారు. గతేడాది స్కిన్లెస్ చికెన్ ధర రూ.200 మించి పలకలేదు. కోడికి ఎండదెబ్బ.. తెలంగాణలో 20 వేల కోళ్లఫారాలున్నాయి. వాటిల్లో 5.50 కోట్ల కోళ్లున్నాయి. అందులో 3.50 కోట్ల లేయర్ కోళ్లు, 2 కోట్ల బాయిలర్ కోళ్లున్నాయి. ఇవిగాక మరో 60 లక్షల హేచరీ కోళ్లున్నాయి. ఈసారి రాష్ట్రంలో ప్రచండ భానుడి ప్రతాపానికి కోళ్లు భారీగా మృతి చెందాయి. సాధారణంగా 37–38 డిగ్రీల వరకు మాత్రమే కోళ్లు ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. అంతకుమించి నమోదైతే చనిపోతాయి. 35–38 డిగ్రీలకు మించి ఉంటే కోళ్లకు వడదెబ్బ తగలకుండా ఫారాల యజమానులు నీళ్లు చల్లడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే 42 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కోళ్లు తట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పైగా బయట ఉష్ణోగ్రతల కన్నా కోళ్ల ఫారాల్లో రేకుల షెడ్డుల కారణంగా మరో రెండు డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలుంటాయి. ఇంత వేడి కారణంగా నెల రోజుల్లో 25 లక్షల కోళ్లు మృతి చెందాయి. తీవ్రమైన ఎండకు తోడు భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లల్లో నీటి సమస్య తలెత్తింది. అనేకచోట్ల కోళ్ల ఫారాల కర్టెన్లను తడపడానికి కూడా నీళ్లు చల్లే అవకాశం లేకుండా పోయింది. సాధారణంగా కోడి పిల్ల ధర రూ.30 లోపే ఉంటుంది. కానీ ప్రస్తుతం రూ.43 దాకా పెరిగింది. ఏకంగా 25 లక్షల కోళ్లు మృతి చెందడం కూడా చికెన్ రేటు పెరగడానికి కారణమైంది. కోళ్ల మరణాలతో హైదరాబాద్‌లో చికెన్ ఉత్పత్తి 25 శాతం తగ్గిపోయింది. రూ.50 కోట్ల నష్టం.. ఎండతో కోళ్లు భారీగా చనిపోవడంతో ఫారాల వ్యాపారులకు రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రంజిత్‌రెడ్డి చెప్పారు. బీమా సౌకర్యం లేకపోవడంతో ఆ నష్టాన్ని వ్యాపారులే భరించాల్సి వస్తుందన్నారు. ‘‘ఎండలు తీవ్రంగా ఉండటంతో కోళ్లు లక్షల్లో చనిపోయాయి. భూగర్భ జలాలు పడిపోవడం, నీటి వసతి లేకపోవడంతో కోళ్లను కాపాడుకోలేకపోయాం. దీంతో మార్కెట్లో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. వర్షాలు కురిశాక తిరిగి సాధారణ స్థితికి ధరలు చేరుకుంటాయి’’అని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఏటా సగటున ఒక్కో వ్యక్తి 3.8 కిలోల మేర చికెన్ వినియోగిస్తుండగా.. తెలంగాణలో 7 కిలోల మేర వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కిలో రూ.250కు కొన్నా: ఫృథ్వి, వినియోగదారుడు, హైదరాబాద్ ఆదివారం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.250 పెట్టి కొన్నా. ఎన్నడూ ఇంత ధర పెట్టి కొనలేదు. ఎందుకు ఇంత ధర పెరిగిందో అంతుబట్టడంలేదు. చికెన్ వ్యాపారులు ధరలు తగ్గించాలి. ఇంత ధర ఎన్నడూ లేదు: సుధాకర్, చికెన్ దుకాణదారుడు, హైదరాబాద్ చికెన్ రూ.250 ఉండటం నేను ఎన్నడూ చూడలేదు. వారం రోజులుగా ఈ స్థాయిలో ధరలున్నాయి. గతేడాది ఎంత ఎండలు ఉన్నా ధర రూ.200 వరకే పెరిగింది. ఇప్పుడు రేటు ఎక్కువుండడంతో చాలామంది కోడి గుడ్లు తీసుకుపోతున్నారు.