కోడికూర వేయలేదని కన్నవారినే...!
వివరాలు బానోతు తార్యా, సోమిలికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. పెద్ద కుమారుడు బానోతు శీనుకు 2012లో వివాహమయ్యింది. ఇతని ప్రవర్తన నచ్చకపోవడంతో పెళ్లైన ఆరు నెలలకే భార్య విడాకులు తీసుకుని వెళ్లపోయింది. అప్పటి నుంచి శీను ఏ పని చేయకుండా జులాయిలా తిరుగుతున్నాడు. ఏదో ఒక పని చేయాలని తల్లిదండ్రులు తరచూ మందలించే వారు.
గత రాత్రి ఇంట్లో కోడి కూర వండారు. శీనుకి ముక్కలు తక్కువగా వేశారని తల్లదండ్రును తిట్టాడు. తరువాత తమ్ముడు, మరదలు ఇంట్లో పడుకున్నారు. ఇంటి ముందర తల్లిదండ్రులతో పాటు శీను పడుకున్నాడు. అందరూ నిద్రపోయాక శీను గొడ్డలితో తారయ్యను నరికాడు. దీంతో ఆయన గట్టిగా అరవగా సోమిలిలేచి అడ్డు రావడంతో ఆమె తలపై నరికి పరారయ్యాడు. క్షతగాత్రులను 108 ద్వారా సూర్యాపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సోమిలి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. శీనుని అరెస్ట్‌చేసి రిమాండ్‌కి తరలించినట్లు అర్వపల్లి ఎస్పై మోహన్‌రెడ్డి తెలిపారు.