
పాలకవీడు: పెంచిన చేతులే తుంచేశాయి. అల్లారుముద్దుగా పెంచి న కొడుకు మానసిక వికలాంగుడు అని కూడా చూడకుండా ఓ తండ్రి మద్యం మత్తులో గొంతు నులిమి చంపేశాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం బెట్టె తండాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మాలోతు బాలు వ్యవసా యం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి కుమారుడు పవన్ (10)తో పాటు ఆరేళ్ల పాప ఉంది. పవన్ పుట్టుకతోనే మానసిక వికలాం గుడే కాక కాళ్లు చేతులు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యాడు. కుమారుడి పరిస్థితిని చూడలేక గొంతు నులిమి చంపేశాడు. ఆ సమయంలో తల్లి పొలం పనులకు వెళ్లింది. తండ్రి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment