సాక్షి, చెన్నై: ఆస్తి కోసం అమ్మానాన్నలను కన్న కొడుకే కిరాయి ముఠాలతో హత్య చేయించిన ఘటన కాంగేయం సమీపంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధంగా ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తిరుప్పూర్ జిల్లా కాంగేయమ్ సమీపంలో ఉన్న వీరానమ్‌పాలయమ్ నీలక్కాడు తోటకు చెందిన పళనిస్వామి (60) రైతు. ఇతని భార్య కన్నమ్మాల్ (55). వీరి కుమార్తె జ్యోతిలక్ష్మి (33), కుమారుడు పెరియస్వామి (31). వీరికి వివాహం జరిగింది. పెరియస్వామి కాంగేయమ్ నగర్‌లో తిరుప్పూర్ రోడ్డులో ఉన్న అన్నై సత్యానగర్‌లో తన భార్య పిల్లలతో ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు.
పళణి స్వామి కన్నమ్మాల్ వీరిద్దరు సూలక్కల్‌పుదూర్‌లో ఉన్న ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నారు. ఈ స్థితిలో పెరియస్వామి ఈ నెల 3వ తేది రాత్రి ఇద్దరిని హత్య చేసి, 40 వేల నగదు, కన్నమ్మాల్ మెడలో ఉన్న 8 సవర్ల నగలతో పరారైనట్లు తెలిసింది. దీనిపై కాంగేయమ్ పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేసి పలువేరు కోణాలలో విచారణ చేస్తూ వచ్చారు. ఇందులో కన్న కొడుకే తల్లిదండ్రులను కిరాయి ముఠా చేత హత్య చేసినట్లు తెలిసింది.
ఈ స్థితిలో శుక్రవారం ఈ కేసుకు సంబంధంగా పెరియస్వామి, ఇతని తోటలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న నాగరాజ్ (43), పళణిస్వామి తోపాటు పని చేస్తూ వచ్చిన యువరాజ్ (29) ముగ్గురు కాంగేయమ్ గ్రామ నిర్వాహక అధికారి పార్తిబన్ పర్యవేక్షనలో లొంగిపోయారు. అనంతరం పెరియస్వామి, నాగరాజ్, యువరాజ్, ఈ ముగ్గురి దగ్గర పోలీసులు విచారణ చేశారు. అప్పుడు పెరియస్వామి ఆస్తి కోసమే హత్య చేయించాను అని ఒప్పుకున్నాడు. అనంతరం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి కాంగేయమ్ కోర్టులో హాజరు పరచి, కోవై సెంట్రల్ జైల్లో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment