ఆస్తి వివాదంలో గొడవ.. ఆపై తుపాకీతో | son murdered his father and grandmother in tamil nadu | Sakshi
Sakshi News home page

ఆస్తి వివాదంలో గొడవ.. ఆపై తుపాకీతో

Published Thu, Jun 29 2017 5:49 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

ఆస్తి వివాదంలో గొడవ.. ఆపై తుపాకీతో - Sakshi

ఆస్తి వివాదంలో గొడవ.. ఆపై తుపాకీతో

ఈరోడ్: ఆస్తి వివాదం నేపథ్యంలో ఓ యువకుడు తండ్రిని, నాయనమ్మను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చిటోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వసువపట్టీ గ్రామానికి చెందిన పళనిస్వామి(56)కి అతని కుమారుడు సంతోష్(25)కు ఆస్తి విషయమై గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. గురువారం ఉదయం సంతోష్ కారులో తండ్రి వద్దకు వచ్చాడు. తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని తండ్రిని డిమాండ్ చేశాడు.

వారిద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దిగారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న కుమారుడు వెంట తెచ్చుకున్న తుపాకీతో తండ్రిని కాల్చేశాడు. తనను అడ్డుకోబోయిన నానమ్మ పవాయిని కూడా కాల్చి వేశాడు. వారిద్దరూ రక్త మడుగులో పడి అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంతోష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement