బాలకార్మిక చట్టానికి సవరణలు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: బాలకార్మిక నిర్మూలన చట్టం–1986లో పలుమార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ)నిబంధనలకు అనుగుణంగా ఈ చట్టాన్ని మార్పు చేసి పార్లమెంటు ఆమో దించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లా డుతూ.. దేశంలో బాలకార్మిక వ్యవస్థనునిర్మూలించడమే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కొత్తచట్టం అమల్లోకి రానుందన్నారు.ఈపీఎఫ్ పెన్షనర్లకు వైద్య సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.హైదరాబాద్‌లో కొత్తగా ఈపీఎఫ్ఓ సబ్‌డివిజన్ కార్యాలయ ఏర్పాటుకు కూకట్‌పల్లిలో భవనాన్ని గుర్తించామని, సోమవారం ప్రారంభిస్తామన్నారు. అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామ ని, ఈ అంశంపై కేంద్రఆర్థిక మంత్రి అరున్జైట్లీతో చర్చిస్తానన్నారు.