Child labor system
-
ప్లాస్టిక్ భూతం.. అంతానికి పంతం
నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్ భూతం అగ్రస్థానంలో ఉంది. మనిషి తన సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఈ పదార్థం అతనికే కాకుండా ప్రాణికోటికే ముప్పుగా పరిణవిుంచింది. ఇటీవలికాలంలో కడలి ఒడ్డుకు కొట్టుకొచి్చన మృత తిమింగలం ఉదరంలో దొరికిన కిలోల కొద్దీ ప్లాస్టిక్ వస్తువులు మనిషి నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేశాయి. నేలనే కాదు సముద్రాన్నీ, నింగినీ కాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్నామనే కఠోర వాస్తవాలను ఇటువంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అనర్థాలపై పౌరసమాజం స్పందిస్తోంది. ఇదిలా ఉద్యమరూపం సంతరించుకుంటే ఉపద్రవం తొలగుతుందన్న భరోసా కలుగుతోంది. రీ సైక్లింగ్‌కు కష్టతరమైనవి.. ప్లాస్టిక్ ఫోమ్ కప్పులు, కోడిగుడ్డు, మాంసం ట్రేలు, ప్యాకింగ్ పీనట్స్, కోట్ హ్యాంగర్స్, యోగర్ట్ కంటైనర్స్, ఇన్సులేషన్, ఆటబొమ్మలు. రీసైక్లింగ్ మేనేజ్ చేయగలిగినవి ప్యాకేజింగ్ ఫిలిం, షాపింగ్ బ్యాగ్స్, బబుల్ ర్యాప్, ఫ్లెక్సిబుల్ బాటిల్స్, వైర్ అండ్ కేబుల్ ఇన్సులేషన్, బాటిల్ టాప్స్, డ్రింకింగ్ స్ట్రాస్, లంచ్ బాక్సులు, ఇన్సులేటెడ్ కూలర్లు, ఫ్య్రాబ్రిక్ అండ్ కార్పెట్ టారప్స్, డైపర్స్. తెనాలి (గుంటూరు జిల్లా): ప్లాస్టిక్‌తో నేడు ప్రపంచంలోని ప్రతి ప్రదేశమూ ముప్పును ఎదుర్కొంటోంది. ఒక్కో మనిషి ఏడాదిలో 11 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్టు అధికారిక అంచనా. వీటిలో సగం ఒకసారి ‘యూజ్ అండ్ త్రో’ ప్లాస్టిక్ వస్తువులే. 2022 నాటికి దేశాన్ని ప్లాస్టిక్ రహితంగా రూపొందించాలని గాంధీజీ 150వ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రభుత్వాలే కాదు, ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన కలుగుతోంది. ప్లాస్టిక్ వస్తువులకు కూరగాయలు... గుంటూరు జిల్లాలో ఏకైక స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటి తెనాలిలో రోజుకు అర టన్ను చొప్పున నెలకు 15 టన్నులు ప్లాస్టిక్ చెత్త వస్తోంది. రీసైక్లింగ్‌కు వీలుకాని 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన క్యారీ బ్యాగులను మున్సిపాలిటీ నిషేధించింది. ఆకస్మిక తనిఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. తడిచెత్త, పొడిచెత్త పేరుతో వేర్వేరుగా చెత్తను సేకరించటమే కాకుండా ప్లాస్టిక్ చెత్తను కూడా సేకరిస్తున్నారు. ప్రజలనూ భాగస్వాముల్ని చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు ప్రయత్నాలు ఆరంభించారు. తొలుత ఇక్కడి గాంధీనగర్ రైతుబజారులో ‘ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చి వెళ్లండి...కూరగాయలు తీసుకెళ్లండి’ అనే వినూత్న కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా చేపట్టారు. స్వచ్ఛందంగా ముందు కొచ్చిన రైతులు షేక్ అబ్దుల్ రషీద్, రావిపూడి శ్రీనివాసరావు స్టాల్స్‌లో అమలు చేస్తున్నారు. ‘ప్లాస్టిక్‌కు బదులుగా కూరగాయలు’ ప్రారంభంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ ఆరోగ్యాధికారి డాక్టర్ బీవీ రమణ తదితరులు ఉచితంగా క్లాత్ బ్యాగులు.. ప్రతిరోజూ 10 కిలోలకు పైగా వస్తువులను ఇచ్చి కూరగాయలు తీసుకెళుతున్నట్టు రైతుబజారు ఏస్టేట్ అధికారి గుంటూరు రమేష్ చెప్పారు. ప్లాస్టిక్‌ను శానిటేషను సిబ్బంది తీసుకెళుతున్నారు. స్పందించిన శారదా సర్వీస్ సొసైటీ నిర్వహించిన వైద్యశిబిరంలో, గుడ్డతో చేసిన చేతిసంచులను ప్రజలకు పంపిణీ చేయటం విశేషం. ఇదేరీతిలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి మొవ్వా సత్యనారాయణ సంస్థ పేరుతో 500 చేతిసంచులను రూపొందించి, సభ్యులకు, స్థానికులకు పంపిణి చేయనున్నట్లు ప్రకటించారు. ప్లాస్టిక్ వస్తువులకు నోటుపుస్తకాలు... నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు సహకారంతో కృష్ణా బాలకార్మిక విద్యాలయ పథకం ఇదే తరహాలో ప్లాస్టిక్ సేకరణకు ఉపక్రమించారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలోని పాఠశాలలో విద్యార్థులను కలిశారు. ఎవరైతే ప్లాస్టిక్ సీసాలు, వ్యర్థాలను సేకరించి తీసుకొస్తారో వారికి నోటు పుస్తకాలను అందజేస్తామని ప్రకటించారు. దీంతో పాఠశాల్లోని 120 మంది విద్యార్థులు కాలనీలో తిరిగి, వ్యర్థాలను సేకరించారు. ప్రాజెక్టు డైరెక్టర్ ఆంజనేయరెడ్డికి అందజేశారు. తొలిరోజునే ఆ విధంగా 50 కిలోల ప్లాస్టిక్ చెత్త వచ్చింది. కిలోకు లాంగ్ సైజ్ నోటుబుక్ చొప్పున విద్యార్థులకు అందజేశారు. ఈ విధానాన్ని కొనసాగిసూ్తనే కృష్ణాజిల్లాలోని 16 బాల కార్మిక పాఠశాలల్లో అమలు చేస్తామని ఆంజనేయరెడ్డి ప్రకటించారు. సేకరించిన ప్లాస్టిక్ చెత్తను విజయవాడ నగర పాలక సంస్థకు అప్పగిస్తున్నారు. ఎక్స్పైరీ తేదీ లేని ప్లాస్టిక్... ఏ వస్తువుకైనా ఎక్స్పైరీ తేదీ ఉంటుంది...ప్లాస్టిక్ మినహా అని చెప్పాలి. వీటిలో ఒక్కసారి వాడి పారేసే కప్పులు, క్యారీబ్యాగులు, నీళ్ల సీసాలు, బాటిల్ మూతలు, స్ట్రాలు, స్పూన్లు, ఆహారంపై ర్యాపర్లు, పాలప్యాకెట్లు, షాంపూ సాచెట్లు, నూనెలు, మసాలాల సాచెట్లు, చాక్లెట్లు, చిప్స్ కవర్లు వంటివి రీసైక్లింగ్‌కు వీలుపడదు. ప్లాస్టిక్ బ్యాగ్స్ డీకంపోజింగ్‌కు వేల సంవత్సరాలు పడుతుంది. ఇవి నెమ్మదిగా చిన్నచిన్న ముక్కలుగా ‘మైక్రో ప్లాస్టిక్స్’గా మారతాయి. నీరు, మట్టిని కలుషితం చేస్తాయి. రోడ్లు, డ్రెయిన్లను బ్లాక్ చేసి సమస్యలను సృష్టిస్తాయి. ప్లాస్టిక్ తయారీలో వాడే హానికర రసాయనాలు జంతువుల కణజాలంలోకి చేరతాయి. చివరకు మనిషి ఆహార చట్రంలోకి ప్రవేశిస్తాయని ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’ నివేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో 83 శాతం కుళాయి నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని వెల్లడెంది. రీసైక్లింగ్ చేయదగిన వస్తువులు... బేవరేజ్ బాటిల్స్, ఫుడ్ జార్స్, క్లాతింగ్ అండ్ కార్పెట్ ఫైబర్, కొన్ని షాంపూలు, మౌత్‌వాష్ బాటిల్స్.డిటర్జంట్, బ్లీచ్ బాటిల్స్, స్నాక్ బాక్సులు, మిల్కా జగ్గులు, బొమ్మలు, బకెట్లు, క్రేట్స్, కుండీలు, గార్డెన్ ఫర్నిచర్, చెత్త కుండీలు రీసైక్లింగ్ అతికష్టం క్రెడిట్ కార్డులు, కిటికీ, తలుపు ఫ్రేములు, గట్టర్స్, పైపులు, ఫిటింగ్స్, వైర్, కేబుల్, సింథటిక్ లెదర్, నైలాన్ ఫాబ్రిక్స్, బేబీ బాటిల్స్, కాంపాక్ట్ డిసు్కలు, మెడికల్ స్టోరేజి కంటైనర్స్, కార్ పార్ట్స్, వాటర్ కూలర్ బాటిల్స్. ఉడతా భక్తి సాయం... ఆరేళ్లుగా రైతుబజారులో ఉంటున్నా...ఇక్కడ ప్లాస్టిక్‌ను నిషేధించారు. ఆ చెత్త సేకరణకు నేనూ, మరో రైతు ఉడతాభక్తిలా సహకరించాలని ప్లాస్టిక్‌ను తీసుకుని కూరగాయలు ఇస్తున్నాం. కనీసం ఒక నెలరోజులు ఇస్తాం. – షేక్ అబ్దుల్ రషీద్, రైతు రాష్ట్రంలోనే తొలిసారి... రైతుబజారులో ప్లాస్టిక్ వస్తువులు తీసుకుని కూరగాయలు ఉచితంగా ఇవ్వడం ఇదే తొలిసారి. సామాజిక బాధ్యతగా ప్రజలను చైతన్యం చేయాలనేది మా ఉద్దేశం. – గుంటూరు రమేష్, ఏస్టేట్ అధికారి, రైతుబజారు -
2,119 మంది చిన్నారుల రెస్క్యూ
సాక్షి, హైదరాబాద్: బాల కార్మికులుగా, బెగ్గింగ్ మాఫియాలో బలిపశువులుగా బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారులను రెస్క్యూ చేసేందుకు ప్రారంభించిన ఐదో దఫా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. జనవరి 1న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 2,119 మంది చిన్నారులను బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ పోలీస్‌తోపాటు మహిళా శిశుసంక్షేమ శాఖ, ఆరోగ్యశాఖ, కార్మిక శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా ఆ చిన్నారులను ఫేస్ రికగ్నైజేషన్ టూల్ దర్పన్ ఉపయోగించి తల్లిదండ్రుల చెంతకు చేర్చినట్లు తెలిపారు. వీరిలో బాలురు 1,653 మంది, బాలికలు 466 మంది ఉన్నారని పేర్కొన్నారు. 1,303 మంది చిన్నారులను తల్లిదండ్రులు, సంరక్షకులకు అప్పగించగా, 816 మందిని రెస్క్యూ హోంకు తరలించామని వెల్లడించారు. గుర్తించిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 763 మంది ఉన్నారని తెలిపారు. చిన్నారులతో వెట్టిచాకిరి చేయిస్తున్న వారిపై 58 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భేష్
వాషింగ్టన్: బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడంలో భారత్ గతేడాది గణనీయమైన పురోగతి సాధించిందని అమెరికా అధికార నివేదిక ఒకటి వెల్లడించింది. 2017లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో పురోగతి సాధించిన 14 దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అమెరికా కార్మిక శాఖ శనివారం విడుదల చేసిన ‘చైల్డ్ లేబర్ అండ్ ఫోర్స్డ్ లేబర్’వార్షిక నివేదికలో ఈ వివరాలున్నాయి. బాల కార్మికవ్యవస్థ నిర్మూలనకు ప్రపంచంలోని 132 దేశాలు తీసుకుంటున్న చర్యలను కచ్చితంగా అధ్యయనం చేసేందుకు ఈ ఏడాది మరింత కఠిన ప్రమాణాలను వాడినట్లు నివేదిక పేర్కొంది. దీని ప్రకారం కొలంబియా, పరాగ్వే, భారత్‌సహా 14 దేశాలే ఈ ప్రమాణాలను అందుకున్నట్లు తెలిపింది. భారత ప్రభుత్వం బాల కార్మిక చట్టంలో చేసిన సవరణలతోపాటు చట్టాన్ని సరిగ్గా అమలు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని పేర్కొంది. -
ఆపరేషన్ ముస్కాన్
తప్పిపోయిన, బాల కార్మికులను గుర్తించేందుకు జిల్లాలో రెండో విడత ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి విడతలో 64 మంది బాల కార్మికులను గుర్తించిన అధికారులు.. ఈసారి పకడ్బందీగా ఆపరేషన్ చేపడుతున్నారు. పోలీసులు, కార్మిక, స్త్రీ, శిశు సంక్షేమ తదితర శాఖలు ఇందులో భాగస్వాములవుతున్నాయి. భువనగిరి : జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ రెండవ విడత ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభమైంది. మొదటి విడత జనవరిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకార్మికులను గుర్తిస్తారు. తప్పిపోయిన పిల్లలను చేరదీసి వారి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తారు. ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఏటా రెండు విడతల్లో చేపడతారు. ఆపరేషన్ ముస్కాన్ ప్రస్తుతం జిల్లాలో అమలు అవుతుంది. మొదటి విడతలో సుమారు 64 మంది వెట్టి చాకిరీ చేస్తున్న, తప్పిపోయి దిక్కు తోచని స్థితిలో రోడ్లపై తిరుగుతున్న పిల్లలను గుర్తించారు. వీరిలో కొందరిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లాలో ఇలా.. ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుండడంతో దీనిని మరింత సమర్ధవంతంగా అమలుచేసేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తుంది. ఆపరేషన్ ముస్కాన్ అమలుకు సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాలను భాగస్వాములు చేస్తున్నారు. ప్రధాన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కీలక భూమిక పోషిస్తుంది. పోలీసులు, కార్మిక శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ ప్రభుత్వ రైల్వే పోలీసు శాఖలతో పాటు బాలల హక్కుల సంస్థలు వీటిలో ఉన్నాయి. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో గుర్తించిన పిల్లల్లో చాలా మంది బాల కార్మికులే. వీరితోపాటు వలస కార్మికుల పిల్లలు కూడా ఉన్నారు. ఒరిస్సా, బీహార్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీల వెంట తీసుకువచ్చిన తమ పిల్లలను కూడా పనులలో చేరుస్తున్నారు. ఇటుక బట్టీలు, సున్నపు బట్టీలు, బోర్లు వేసే పనులు, బీడీ ఖర్కానాల పనులలో పెడుతున్నారు. బాలల హక్కుల చట్టాలు పిల్లలను కాపాడి వారికి తగిన పునరావాసం కల్పించేందుకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థల సమన్వయంగా ఆపరేషన్ ముస్కాన్ పేరుతో కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. ఈ నేపధ్యంలో చట్టాల్లో మార్పులు చేశారు. వీటిపై ప్రతి ఒక్కరికీ అవగా హన కల్పించడం కూడా ఇందులో ఒక భాగమే. 2016 ది చైల్డ్ లేబర్ అమెండ్మెంట్ యాక్ట్‌తో పా టు మరో చట్టం ప్రకారం బాల్యానికి భరోసా, భద్రతను కల్పిస్తున్నారు. యాక్ట్ ప్రకారం నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలని నిర్లక్ష్యానికి గురైన పిల్లలు, ఆపదలో ఉన్న పిల్లలను గుర్తించి సీడబ్ల్యూఈసీ నుంచి హాజరుపర్చి పునరావాసం కల్పిస్తుంటారు. 2015లో ప్రారంభం.. భువనగిరి : ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం 2015లో ప్రారంభించారు. జిల్లాల పునర్విభజన కాకముందు భువనగిరి డివిజన్ పరిధిలో 2015–16 సంవత్సరానికి గాను 118 మంది పిల్లలను గుర్తించారు. జిల్లాల పునర్విభజన అనంతరం 2017 జనవరి, జూలై నెలల్లో ని ర్వహించిన ముస్కాన్ కార్యక్రమం ద్వారా జి ల్లా వ్యాప్తంగా 554 మంది పిల్లలను గుర్తిం చగా, 2018 జనవరిలో నిర్వహించిన కార్యక్ర మం ద్వారా 64 మంది పిల్లలను గుర్తించారు. ఒరి స్సా రాష్ట్రం నుంచి వచ్చిన పిల్లల కోసం ప్రత్యేకంగా గత సంవత్సరం చౌటుప్పల్ మం డలం లోని పెద్ద కొండూరు, బొమ్మలరామా రం మం డలంలోని చీకటి మామిడిలో ప్రత్యేక ట్యూట ర్లను ఏర్పాటు చేసి చదువును అందించారు. -
బడి బయటే బాల్యం
కామారెడ్డి రూరల్: జిల్లాలో 6 ఏళ్లనుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలు 1,46,111 మంది ఉన్నారు. ఇందులో 1,45,443 మంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. 668 మంది పిల్లలు బడి బయటే గడుపుతున్నారు. 2016–17 సంవత్సరంలో సర్వే చేసిన అధికారు లు జిల్లావ్యాప్తంగా 447 మంది పిల్లలు బడిబయ ట ఉన్నట్లుగా గుర్తించారు. వారిని నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు కేంద్రాల్లో చేర్పించారు. అయినప్పటికీ వారిలోంచి చాలా మంది తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. వారు బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. కాగా 2017–18 విద్యాసంవత్సరం కోసం బాలకార్మికులను గుర్తించేందుకు పట్టణ ప్రాంతా ల్లో మెప్మా ఆధ్వర్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ఆధ్వర్యంలో సర్వే చేశారు. ఈ ఏడాది 668 మంది చిన్నారులు బడిబయట ఉన్నట్లుగా గుర్తించారు. గతేడాదితో పోలిస్తే బడి బయట ఉన్న పిల్లల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పథకాలెన్ని ప్రవేశపెట్టినా... బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. పథకాల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం వల్లే ఆశించిన ఫలితాలు రావడం లేదన్న ఆరోపణలున్నాయి. తూతూమంత్రంగా బడిబాట నిర్వహించడంతో చాలా మంది పిల్లలు బడిబయటే ఉండి, చెత్త ఏరుకునేవారిగా, పశువుల కాపరులుగా, కార్ఖానాలు, హోటళ్లు, ఇటుకబట్టీల వద్ద కార్మికులుగా మారుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం బడి బయట పిల్లలు లేకుండా చూడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఏటా బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు కేంద్రాల్లో చేర్పిస్తున్నాం. జిల్లాలో ఇలాంటి కేంద్రాలు ఏడు చోట్ల ఉన్నాయి. బడిఈడు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – గంగకిషన్, సెక్టోరియల్ అధికారి, కామారెడ్డి -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేద్దాం
జూబ్లీహిల్స్: రాష్ట్రంలో బాలకార్మిక వ్వసస్థను సంపూర్ణంగా నిర్మూలించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, వచ్చే 2021 సంవత్సరంలోపు అది పూర్తవుతుందని రాష్ట్ర హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వం స్వచ్ఛద సంస్థలు, ప్రజలు, ప్రజా ప్రతిని«ధులతో కలిసి పనిచేస్తుందన్నారు. ప్రపంచ బాలకార్మిక నిర్మూలన రోజును పురస్కరించుకొని మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ, ప్లాన్ ఇండియా, మహిత స్వచ్ఛద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బేగంపేట సెస్ ఆడిటోరియంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. బాలకార్మిక వ్వవస్థకు ప్రధానంగా పేదరికమే కారణమని, గ్రామాల్లో పేదరికం నిర్మూలిస్తే చాలా వరకు సమస్య పరిష్కారమవుతుందన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు చొరవ తీసుకొని పిల్లలను బడికి పంపేలా చూడాలన్నారు. నగరంలోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛద సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బాలకార్మిక నిర్మూలనకు చేపట్టిన చర్యలు వివరిస్తూ ‘ఏ జర్నీ టు క్రియేట్ చైల్డ్ లేబర్ ఫ్రీ తెలంగాణ విత్ ఎన్జీఓ పార్టిసిపేషన్’ పేరుతో రూపొందించిన టేబుల్ బుక్‌ను, బాల కార్మిక వ్యతిరేక ప్రచారంతో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్లాన్ ఇండియా ప్రాజెక్ట్ మేనేజర్ అనితాకుమార్, మహిత డైరెక్టర్ రమేష్‌శేఖర్‌రెడ్డి, కార్మికశాఖ ఎస్ఆర్సీ స్టేట్ కో-ఆర్డినేటర్ వర్షాభార్గవ, పలు జిల్లాలకు చెందిన సర్పంచ్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రోజురోజుకూ పెరుగుతున్న బాలకార్మికుల సంఖ్య
పరిగి: బాల్యం పిల్లల హక్కు.. పిల్లలుండాల్సిన చోటు పాఠశాలలే.. బడికెళ్లని పిల్లలందరూ బాలకార్మికులే.. పెద్దలు పనికి, పిల్లలు బడికి.. ఇవి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న సూత్రాలు... గోడలపై రాసుకున్న రాతలు. అయితే వీటితో ప్రభుత్వం రాజీపడుతోంది. ఈ నినాదాలు సమావేశాలు, సదస్సులు దాటి కార్యాచరణకు నోచుకోవడం లేదు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి తెచ్చిన విద్యాహక్కు చట్టం వచ్చాక బాలకార్మికుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం మరో విశేషం. తూతూమంత్రంగా కార్యక్రమాలు.... ఎన్రోల్మెంట్డ్రైవ్, చదువుల పండగ, బడిబాట, విద్యా వారోత్సవాలు, విద్యా పక్షోత్సవాలు, విద్యా సంబురాలు ఇలా పది సంవత్సరాలుగా బాలకార్మికులను బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు. అయితే వీటిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయకపోవడంతో బాలకార్మికుల సంఖ్య పెరగడమేగాని తగ్గడం లేదు. విద్యాహక్కుచట్టం(2009) అమల్లోకి వచ్చి ఆరు సంవత్సరాలు కావస్తున్నా.. ఇప్పటికీ సంచారంలో, ఇటుక బట్టీల్లో, హోటళ్లలో, దాబాల్లో, దుకాణాల్లో , వెట్టిచాకిరీలో చిన్నారులు మగ్గుతూనే ఉన్నారు. పరిగిదే మొదటి స్థానం బాలకార్మికుల సంఖ్యలోనూ, నిరక్షరాస్యతలోనూ జిల్లాలో పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల, గండేడ్, దోమ మండలాలే ముందుస్థానంలో ఉన్నాయి. పరిగి, పూడూరు మండలాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. పలు స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం కుల్కచర్లలో 600 మంది, గండేడ్‌లో 500 పై చిలుకు బాలకార్మికులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఒక్క పరిగి పట్టణవలోనే 300 వరకు బాలకార్మికులు ఉన్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. వేల సంఖ్య లో బాలకార్మికులు బడిబయట ఆయా పనుల్లో కొనసాగుతున్నా వారిని బడిలో చేర్పించేందుకు ప్రత్యేకమైన వింగ్ లేకపోవడం దురదృష్టకరం. కళ్ల ఎదుటే బాలకార్మికులు కనిపిస్తున్నా ఇటు విద్యాశాఖ, అటు లేబర్ ఆఫీసర్లకుగాని పట్టడంలేదు. పొంతన లేని లెక్కలు..... బడిబయటి పిల్లల్ల గుర్తింపుకోసం నిర్వహిస్తున్న సర్వేలు ఒకదానితో ఒకదానికి పొంతన లేకుండా ఉన్నాయి. బడిబయట ఉన్న పిల్లల పేర్లు బడిలోకి వస్తున్నాయే తప్పా పిల్లలు మాత్రం బడులకు దూరంగానే ఉంటున్నారు. జిల్లాలో 2 వేల మంది బాలకార్మికులు ఉన్నట్లు విద్యా శాఖ అధికారులు చెబుతుండగా ఆరువేల మంది ఉన్నారని గతేడాది సాక్షరభారత్ కార్యకర్తలు నిర్వహించిన సర్వేలో బయటపడింది. అదే సమయంలో ఎంవీ ఫౌండేషన్‌లాంటి స్వచ్ఛంద సంస్థలు చెబుతున్న లెక్కల ప్రకారం రూరల్, అర్బన్ ఏరియాల్లో కలిపి దాదాపు 10 వేల మంది పిల్లలు బడికు దూరంగా ఉంటూ పనులు చేసుకుంటున్నారని సమాచారం. నెలరోజులు రెగ్యులర్‌గా ఓ విద్యార్థి బడికి రాకుంటే బాలకార్మికునిగా గుర్తించి బడికి రప్పించే చర్యలు చేపట్టాలని సర్వశిక్ష అభియాన్ చెబుతుండగా వాస్తవంలో ఆరు నెలలకు పైగా బడిబయట ఉన్న పిల్లలను కూడా బాలకార్మికులుగా గుర్తించటంలేదు. దీనికితోడు సంచార జాతుల్లో దాదాపు పిల్లలందరూ బాల కార్మికులుగానే కొనసాగుతున్నారు. విద్యాశాఖ అధికారుల లెక్కల్లో కనీసం వీరు పరిగణలోకి కూడా రావడం లేదు. అయితే ఐదేళ్లు నిండిన పిల్లలందరూ బడుల్లోనే ఉండాలనే సామాజిక నియమం వస్తే తప్పా బాలకార్మిక వ్యవస్థను రూపుమాపలేమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బడిబయటి పిల్లలందర్ని బడిలో చేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయినప్పటికీ స్వచ్ఛంద సంస్థలు, యువజన సవఘాలు, మహిళా సంఘాలు, సామాజికవేత్తలు, ప్రజాప్రతినిధులు తదితర వర్గాలు కూడా పిల్లలందర్నీ బడిలో చేర్పించేలా ప్రజలను చైతన్య పరిస్తే తప్పా బాల కార్మిక వ్యవస్థ నుంచి మన సమాజం బయట పడదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.