ప్రతీకాత్మక చిత్రం
తప్పిపోయిన, బాల కార్మికులను గుర్తించేందుకు జిల్లాలో రెండో విడత ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి విడతలో 64 మంది బాల కార్మికులను గుర్తించిన అధికారులు.. ఈసారి పకడ్బందీగా ఆపరేషన్ చేపడుతున్నారు. పోలీసులు, కార్మిక, స్త్రీ, శిశు సంక్షేమ తదితర శాఖలు ఇందులో భాగస్వాములవుతున్నాయి.
భువనగిరి : జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ రెండవ విడత ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభమైంది. మొదటి విడత జనవరిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకార్మికులను గుర్తిస్తారు. తప్పిపోయిన పిల్లలను చేరదీసి వారి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తారు. ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఏటా రెండు విడతల్లో చేపడతారు. ఆపరేషన్ ముస్కాన్ ప్రస్తుతం జిల్లాలో అమలు అవుతుంది. మొదటి విడతలో సుమారు 64 మంది వెట్టి చాకిరీ చేస్తున్న, తప్పిపోయి దిక్కు తోచని స్థితిలో రోడ్లపై తిరుగుతున్న పిల్లలను గుర్తించారు. వీరిలో కొందరిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
జిల్లాలో ఇలా..
ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుండడంతో దీనిని మరింత సమర్ధవంతంగా అమలుచేసేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తుంది. ఆపరేషన్ ముస్కాన్ అమలుకు సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాలను భాగస్వాములు చేస్తున్నారు. ప్రధాన చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీ కీలక భూమిక పోషిస్తుంది. పోలీసులు, కార్మిక శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ ప్రభుత్వ రైల్వే పోలీసు శాఖలతో పాటు బాలల హక్కుల సంస్థలు వీటిలో ఉన్నాయి.
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో గుర్తించిన పిల్లల్లో చాలా మంది బాల కార్మికులే. వీరితోపాటు వలస కార్మికుల పిల్లలు కూడా ఉన్నారు. ఒరిస్సా, బీహార్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీల వెంట తీసుకువచ్చిన తమ పిల్లలను కూడా పనులలో చేరుస్తున్నారు. ఇటుక బట్టీలు, సున్నపు బట్టీలు, బోర్లు వేసే పనులు, బీడీ ఖర్కానాల పనులలో పెడుతున్నారు.
బాలల హక్కుల చట్టాలు
పిల్లలను కాపాడి వారికి తగిన పునరావాసం కల్పించేందుకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థల సమన్వయంగా ఆపరేషన్ ముస్కాన్ పేరుతో కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. ఈ నేపధ్యంలో చట్టాల్లో మార్పులు చేశారు. వీటిపై ప్రతి ఒక్కరికీ అవగా హన కల్పించడం కూడా ఇందులో ఒక భాగమే.
2016 ది చైల్డ్ లేబర్ అమెండ్‌మెంట్ యాక్ట్‌తో పా టు మరో చట్టం ప్రకారం బాల్యానికి భరోసా, భద్రతను కల్పిస్తున్నారు. యాక్ట్ ప్రకారం నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలని నిర్లక్ష్యానికి గురైన పిల్లలు, ఆపదలో ఉన్న పిల్లలను గుర్తించి సీడబ్ల్యూఈసీ నుంచి హాజరుపర్చి పునరావాసం కల్పిస్తుంటారు.
2015లో ప్రారంభం..
భువనగిరి : ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం 2015లో ప్రారంభించారు. జిల్లాల పునర్విభజన కాకముందు భువనగిరి డివిజన్ పరిధిలో 2015–16 సంవత్సరానికి గాను 118 మంది పిల్లలను గుర్తించారు. జిల్లాల పునర్విభజన అనంతరం 2017 జనవరి, జూలై నెలల్లో ని ర్వహించిన ముస్కాన్ కార్యక్రమం ద్వారా జి ల్లా వ్యాప్తంగా 554 మంది పిల్లలను గుర్తిం చగా, 2018 జనవరిలో నిర్వహించిన కార్యక్ర మం ద్వారా 64 మంది పిల్లలను గుర్తించారు.
ఒరి స్సా రాష్ట్రం నుంచి వచ్చిన పిల్లల కోసం ప్రత్యేకంగా గత సంవత్సరం చౌటుప్పల్ మం డలం లోని పెద్ద కొండూరు, బొమ్మలరామా రం మం డలంలోని చీకటి మామిడిలో ప్రత్యేక ట్యూట ర్లను ఏర్పాటు చేసి చదువును అందించారు.
Comments
Please login to add a commentAdd a comment