ఫర్ సేల్
సాక్షి ప్రతినిధి, చెన్నై: దంపతుల్లో సంతానలేమి సమస్య లేమి సమస్య చిన్నారుల అమ్మకాలు పెరిగి పోవడవానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సంతానం కోసం తపించిపోతున్న దంపతులను కిడ్నాపర్లు ముందుగా గుర్తిస్తారు. వారిని మాయమాటలతో బుట్టలో వేసుకుంటారు. ఎంత డబ్బైనా ఫరవాలేదు బిడ్డ కావాలి అనే దంపతులతో ముందుగానే ఒక ఒప్పందం కుదుర్చుకుని తగిన చిన్నారుల కోసం అన్వేషిస్తారు. చిన్నారులను అంగడి సరుకుగా మార్చే వారికి అన్నీ అనుకూలిస్తే కొనుగోలు చేయడం, లేకుంటే ఎత్తుకెళ్లడం... ఈ రెండు మార్గాలు. మరో దారుణమైన విషయం ఏమిటంటే సంతానం కావాలనే దంపతులకే కాదు, భిక్షమెత్తేందుకు, బాల కార్మికులుగా మార్చేందుకు, వ్యభిచార గృహాలకు అమ్మివేసేందుకు, ఆసుపత్రులకు అప్పగించి అవయవాలను కాజేసేందుకు కూడా చిన్నారుల కిడ్నాప్‌లు సాగుతున్నాయిం.
గగుర్పొడిచే విషయం మరొకటి ఏమిటంటే మూఢ నమ్మకాలతో గుప్త నిధుల కోసం అన్వేషించే వారు నరబలులు ఇవ్వాలని భావిస్తే ఇలాంటి రాక్షసులకు సైతం చిన్నారుల సరఫరా సాగిపోతోంది. చిన్నారులను అమ్మకానికి పెట్టే ముఠా సభ్యులు ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని డబ్బు వల విసురుతారు. రోడ్డువారగా నిద్రించి కుటుంబాలపై గురిపెట్టి రాత్రివేళ తల్లిపక్కన హాయింగా నిద్రపోతున్న పిల్లలను గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళతారు. మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబమంతా తరలివచ్చి ఆలయాల్లో నిద్రించే భక్తుల వద్ద నుంచి చిన్నారులను తస్కరిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు, బస్, రైల్వేస్టేషన్లలో తల్లిదండ్రుల పక్కన పడుకుని కునుకు తీస్తున్న చిన్నారులు కూడా కిడ్నాపర్ల బారిన పడుతున్నారు.
తిరునెల్వేలి జిల్లా కీళప్పావురైకి చెందిన అరుణాచలం రూ.2.5 లక్షలకు ఒక మగ బిడ్డ, ఇద్దరు మహిళలు సహా ఏడుగురుని మార్తాండంకు చెందిన విల్సన్ అనే వ్యక్తికి అమ్మారు. అనుమానంతో సదరు విల్సన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయింది. కొన్ని నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ కేసులో మొత్తం 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వీరిచ్చిన సమాచారంతో ఇద్దరు చిన్నారులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ బాలల శరణాలయంలో చేర్చారు. గత ఏడాది తిరునెల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి తదితర జిల్లాలకు పరిమితమైన చిన్నారుల కిడ్నాప్, అమ్మకాల భూతం రాష్ట్రమంతా వ్యాపించి విశ్వరూపం దాల్చింది. ఈరోడ్, తిరుప్పూరు, కోయంబత్తూరు జిల్లాలకు చెందిన కొందరు వ్యక్తులు సైతం చిన్నారుల కిడ్నాప్, అమ్మకాలనే వృత్తిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
నిరోధానికి హైకోర్టు సూచనలు
ప్రజలను భయంకపితులను చేసేలా పెరిగిపోతున్న కిడ్నాప్‌లను నిరోధించడం ఎలా అనే అంశంపై మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. జిల్లాల వారీగా ప్రత్యేక పోలీసు బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఈ ఏడాది మేలో ఆదేశించింది. అపహరించిన చిన్నారులు రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్లిపోతున్నందున రాష్ట్ర స్థారుులో ప్రత్యేక విచారణ కమిటీని నియమించాలని బాలల హక్కుల సంరక్షణ సమితుల వారు సూచిస్తున్నారు. చైల్డ్‌లైన్ పథకాన్ని అమలు చేస్తున్న శరణాలయం డెరైక్టర్ జయబాలన్ మాట్లాడుతూ గత 11 నెలల్లో బాలల హక్కులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదుల్లో 600 మందికి అవసరమైన సహాయాన్ని అందించినట్లు తెలిపారు. అలాగే వీటిల్లో 35 ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని, ఇద్దరు చిన్నారులను రక్షించగలిగామని చెప్పారు. శిశు, మహిళ కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు వచ్చేనెలలో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకాగాంధీ చెబుతున్నారు.
అత్యవసర ఫోన్: 1098
చిన్నారులు, మహిళలు కిడ్నాప్‌లకు గురైనపుడు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే చైల్డ్‌లైన్ ఇండియా ఫౌండేషన్ 1098 టోల్‌ఫ్రీ ఫోన్‌కు సమాచారం ఇవ్వవచ్చు. తమిళనాడులో శివగంగై, వేలూరు తదితర 30 జిల్లాల్లో చైల్డ్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నారుు.
భయపెడుతున్న సర్వే
జాతీయ స్థారుులో జరిగిన ఒక సర్వే ప్రకారం 2014లో తమిళనాడులో 441 మంది చిన్నారులు కిడ్నాప్‌కు గురయ్యారు. 2015లో ఈ సంఖ్య 526కు పెరిగింది. ఇక ఈ ఏడాదిలో నవంబరు వరకు 400 మందికి పైగా అపహరణకు గురయ్యారు. భారత దేశంలో చిన్నారులకు సంబంధించిన నేరాలు గతంలో కంటే 24 శాతం పెరిగిపోరుునట్లు ఆ సర్వే చెబుతోంది. చిన్నారుల కిడ్నాప్ 43 శాతం, లైంగిక వేధింపులు 30 శాతానికి పెరిగిపోయింంది. గడిచిన ఏడాదిలో చిన్నారులపై అకృత్యాలకు సంబంధించి 6,406 కేసులు నమోదయ్యాయిం. వీటిల్లో తమిళనాడులో 16.6 శాతం, మధ్యప్రదేశ్‌లో 13.2 శాతం, ఢిల్లీలో 12.8 శాతం, బిహార్‌లో 6.7 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 6.7 శాతం లెక్కన బాధిత బాలబాలికల ఫిర్యాదులతో నేరాలు నమోదయ్యాయిం. చిన్నారుల హత్యల్లో దేశస్థాయింలో తమిళనాడు మూడోస్థానంలో ఉంది. రాష్ట్రంలో సగటున రోజుకు ఇద్దరు పిల్లలు కిడ్నాపర్ల బారిన పడుతున్నారు.