రేపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్
హైదరాబాద్: రేపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు రాష్ట్ర బాలల హక్కుల సంఘం పిలుపు ఇచ్చింది. నల్లగొండ జిల్లా పెద్దపూర మండలం తుంగతుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని ఏనేమీది తండాలో వీఆర్వో సంస్థ ఆశ్రమంలోని 12 మంది విద్యార్థినులపై అక్కడ పనిచేస్తున్న ట్యూటర్ హరీష్ అత్యాచారాలు చేసిన విషయం తెలిసిందే. ఈ అత్యాచారాలకు నిరసనగా బాలల హక్కుల సంఘం ఆందోళనకు దిగింది. రాష్ట్ర బంద్కు పిలుపు ఇచ్చింది.
ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ సంస్థ శనివారం మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి, ఈ నెల 21వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా ఎస్పీలను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.