chili powder
-
'పచ్చి మిరపకారా'నికి గారం చేయండి.. ఎందుకో తెలుసా?
ప్రతిరోజూ మనం వండే వంటల్లో కారం రుచి కోసం పచ్చిమిరపకాయలు వాడతాం. అయితే ఇవి రుచిని అందించడంతో పాటు ప్రమాదకర వ్యాధుల నుండి కాపాడడమే కాకుండా, చర్మ సమస్యలు రాకుండా రక్షణ కవచంలా ఉంటాయని మీకు తెలుసా? ఇలా ఒక్క చర్మ సమస్యలే కాదు,.. రక్తప్రసరణ, గుండె జబ్బులు, అల్సర్లు, వివిధ అనేక సమస్యల నుంచి కాపాడటంలో దివ్య ఔషధంగా పని చేస్తుంది. మరి వాటి గురించి తెలుసుకుందాం. పచ్చిమిరపలో ఎ,సి బి6 విటమిన్లతో పాటు ఇనుము, రాగి, పొటాషియం తక్కువ మొత్తంలో ప్రోటీన్, కార్పోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. పచ్చిమిరపలోని క్యాప్సైసిన్ అనే పదార్థం శ్లేష్మ పొరలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో అది సులువుగా బయటకు వచ్చేస్తుంది. సైనస్, జలుబుకి పచ్చిమిరప మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది. పచ్చిమిరప రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చిమిరపలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల కోతలు, గాయాలు వంటి వాటిని త్వరగా నయం చేస్తుంది. గుండె జబ్బులు, అల్సర్లు కూడా పచ్చిమిరప తీసుకోవడం వల్ల నయమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో సమర్థంగా పనిచేస్తుంది. డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు పచ్చి మిర్చితో చేసిన ఫుడ్ తీసుకోవడం మేలు చేస్తుంది. పచ్చిమిరపలో ఉండే విటమిన్ సి, ఇ శరీరంలో రక్తప్రసరణ పెంచడంలో సహాయపడతాయి. మొటిమల సమస్యలను కూడా నయం చేస్తుంది. ఇందులో అసలు క్యాలరీలు ఉండవు కాబట్టి బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చాలామందిలో మూడ్ స్వింగ్స్ సమస్య ఉంటుంది. పచ్చిమిరప మెదడులోని ఎండార్ఫిన్లను బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది. దీని కారణంగా మూడ్ స్వింగ్స్ నుండి బయటపడి సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చలికాలంలో పచ్చిమిరపకాయలు తినడం వల్ల యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఎముకలు దంతాలు, కళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు నివారించడంలో పచ్చి మిరపకాయలు ఎంతగానో సహాయపడతాయి. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న పచ్చి మిరపకాయలను మీరు తినే ఆహారంలో ఎక్కువగా చేర్చుకోండి. ఇవి కూడా చదవండి: మడమల నొప్పితో నడవలేకున్నారా.. అయితే ఇలా చేయండి! -
డబ్బు వసూలు చేసుకొస్తుండగా కారం చల్లి..
బిహార్: బిహార్‌లో దొంగలు రెచ్చిపోయారు. కళ్లల్లో కారం చల్లి పంకజ్ కుమార్ అనే మొబైల్స్ డీలర్ నుంచి రూ.రెండు లక్షల నగదు, 30 మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రోహతాస్ జిల్లాలోని ససారామ్ పట్టణంలోని తాకియా ఓవర్ బ్రిడ్జి సమీపంలో చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు సరిగ్గా శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో అనూహ్యంగా పంకజ్‌పై పెద్ద మొత్తంలో కారం కుమ్మరించారు. అనంతరం క్యాష్ కౌంటర్ నుంచి రూ.2లక్షల నగదు, 30 ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగిన సమయంలో సదరు వ్యాపారి రిటెయిలర్స్ వద్దకు వెళ్లి డబ్బు వసూలు చేసుకొని వస్తున్నాడు. ససరామ్‌లో కారం జల్లి దాడి చేయడం ఇది మొదటి కేసు అని పోలీసులు చెబుతున్నారు. దాడికి పాల్పడిన దొంగల వివరాలు తెలియడం లేదని, శాస్త్రీయ విధానాలతో వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. బాధితుడు దాదాపు అందుడైన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. -
రూ.70 లక్షల కల్తీ కారం స్వాధీనం
-
పోలీసుల కళ్లల్లో కారం కొట్టి పరార్
చిలమత్తూరు (అనంతపురం జిల్లా) : మద్యం దుకాణంలో చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్కడికి వెళ్లిన పోలీసుల కళ్లల్లో కారం కొట్టి దొంగలు పారిపోయారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా చితమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ గ్రామసమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. కొడికొండ చెక్‌పోస్ట్ సమీపంలో ఉన్న బాలాజీ వైన్స్‌లో దొంగతనం చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చిన గస్తీ పోలీసులు ఈ విషయాన్ని గమనించారు. దీంతో దుండగులు పోలీసుల కళ్లల్లో కారం కొట్టి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. -
తుపాను బాధితులకు మరింత మిరప పొడి
గుంటూరు ఈస్ట్: హుదూద్ తుపాను బాధితులకు మరో 235 టన్నుల మిరప పొడిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పటివరకు 415 టన్నుల మిరప పొడిని విశాఖపట్నానికి తరలించామని చెప్పారు. సోమవారం మూడు ట్రక్కుల్లో కూర గాయలు పంపామని చెప్పారు. మంగళవారం సాయంత్రానికి మరో నాలుగు ట్రక్కుల్లో కూరగాయలు పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు అందిన వెంటనే సరఫరా చేసేందుకు కందిపప్పును సిద్ధం చేయూలని సూచించారు. పంపిన సరుకులు విశాఖలోని సంబంధిత శాఖలకు అందాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు. తుపాను బాధితుల కోసం సహాయ సామగ్రిని పంపుతున్న సంస్థలు, సంఘాలు, వ్యక్తులను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ సీహెచ్.శ్రీధర్, డీఆర్వో నాగబాబు, ఆర్డీవోలు, జిల్లా స్థారుు అధికారులు పాల్గొన్నారు. -
కళ్లలో కారం చల్లి రూ.6 లక్షలు దోపిడీ
రాజవరం(గంపలగూడెం) : మండలంలోని రాజవరం-పెనుగొలను గ్రామాల మధ్య తిరువూరు-మధిర ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై గురువారం భారీ దారిదోపిడీ ఘటన జరిగింది. మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తుల కళ్లలో దుండగులు కారం చల్లి రూ. 6 లక్షల నగదు దోచుకున్నారు. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై మహాలక్ష్మి ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివ రాల ప్రకారం.. నందిగామకు చెందిన విశ్రాంత అధ్యాపకుడు బాణావత్ భగవత్, తన తమ్ముడి చిన్నల్లుడు అజ్మీరా పాపారావు(ఎ.కొండూరు మండలం కేశ్యతండా వాసి)తో కలిసి మోటార్‌సైకిల్‌పై మండలంలోని పెనుగొండకు బయలుదేరారు. భూమి కొనుగోలు కోసం రూ.6 లక్షల నగదు గల బ్యాగ్ వారి వద్ద ఉంది. మండలంలోని రాజవరం దాటిన తరువాత ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తూ వారికి ఎదురుపడ్డారు. భగవత్, పాపారావు కళ్లలో వారు కారం చల్లి నగదు ఉన్న బ్యాగ్‌ను లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితులు వెంటనే స్థానిక పోలీస్‌స్టేష న్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దారిదోపిడీకి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నగదు అపహరించుకుపోయినవారు ఎ.కొండూరు మండలానికి చెందిన వ్యక్తులుగా భావిస్తున్నామన్నారు. ఈ ఘటన ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో జరగలేదని వారు పేర్కొంటున్నారు. పక్కా పథకం ప్రకారమే దుండగులు దారిదోపిడీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. 15 సంవత్సరాల క్రితం పెనుగొలను ఆంధ్రాబ్యాంక్‌కు చెందిన సిబ్బంది నగదుతో మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా తిరువూరు మండలం చింతలపాడు శివారులో దోపిడీకి జరిగింది. ఆ తరువాత ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదలు. -
‘అమ్మ హస్తానికి’ ఫ్రాక్చర్
మూడు నెలలుగా అరకొరగా సరకుల పంపిణీ రెండు నెలలుగా అందని చింతపండు, పసుపు, కారం నెల రోజులుగా వంట నూనె నిలిపివేత ఈ నెల కూడా పంపిణీ అనుమానమే నర్సీపట్నం, న్యూస్‌లైన్: గత ప్రభుత్వం ప్రచారాస్త్రంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం అటకెక్కినట్టే కనిపిస్తోంది. గత ఏడాది ఉగాది రోజున ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ఏడాదైనా ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంది. ప్రచారం కోసమే పథకం అప్పటి ముఖ్యమంత్రి కిరణ్, ఇతర మంత్రుల ఫొటోలను విరివిగా వాడుకున్న ఈ పథకాన్ని కేవలం ప్రచార అస్త్రంగానే వాడుకున్నారు తప్ప సక్రమంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. మూడు నెలలుగా వినియోగదారులకు ప్రభుత్వం అరకొరగా సరుకులు పంపిణీ చేస్తూ నెట్టుకొస్తోంది. మూడు నెలల క్రితం నుంచిసరుకుల కొరత ఏర్పడింది. ప్రారంభంలో ఉప్పు, గోధుమ పిండి సరఫరాను నిలిపివేసి, తరువాత పునరుద్ధరించారు. రెండు నెలలుగా చింతపండు, పసుపు, కారం పం పిణీ నిలిపివేశారు. గత నెల నుంచి వంట నూనె కూడా పంపిణీకి నోచుకోలేదు. నూనె కొరత ఈ నెల కూడా కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పంచదారపై ఇచ్చే రాయితీని కేంద్రం మూడు నెలల క్రితమే నిలిపివేసింది. ఎన్నికల ముందు పంచదార పంపిణీ నిలిపివేయడం మంచిది కాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భారాన్ని భరి స్తూ ఈ మూడు నెలలూ నెట్టుకొచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చాక దీనిపై ఒక నిర్ణయం తీసుకోకుంటే పంచదార పంపిణీ సైతం నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సాక్షాత్తూ అధికారులే అంటున్నారు. జిల్లాలో సుమారు 12 లక్షల కుటుంబాలు ఈ సరుకులపై ఆధారపడి కుటుంబాలను నెట్టుకొస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా అమలు చేయాల్సిన ప్రభుత్వాలు పథకాన్ని నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నేడు ఉగాది పర్వదినం షడ్రుచుల సమ్మేళనం
ప్రాముఖ్యం చైత్ర శుద్ధపాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారం ధరించిన విష్ణుమూర్తి సోమకున్ని సంహరించి వేదాలను బ్రహ్మాకు అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. పూజ అన్ని పండుగల మాదిరిగానే ఉగాది రోజున ఉదయం 9గంటల లోపు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఏదో ఒక దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అనంతరం ఏమీ తినక ముందే ఉగాది పచ్చడిని తింటారు. పచ్చడి ‘ఉగాది పచ్చడి’ ఈ పండుగకు మాత్రమే తినే ప్రత్యేక పదార్థం. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటారు. ఏడాదిపాటు ఎదురయ్యే మంచిచెడులు, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. పచ్చడి తయారీకి మామిడి కాయలు, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం, వేపపువ్వు వాడుతారు. బె ల్లం-ఆనందానికి, ఉప్పు-ఉత్సాహం, వేపపువ్వు-బాధ కలిగించే అనుభవాలు, పులుపు-నేర్పుగా వ్యవహారించాల్సిన పరిస్థితులు, మామిడి-కొత్త సవాళ్లు, కారం-సహనం బావానికి ప్రతీక. పంచాంగ శ్రవణం కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహ శాంతి వంటివి జరిపించుకుని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి, వ్యవసాయం ఎలా ఉంటుంది, అనే విషయాలను తెలుసుకోడానికి పంచాంగ శ్రవణం చేసేవారని చెబుతారు.