డబ్బు వసూలు చేసుకొస్తుండగా కారం చల్లి.. | Criminals throw chili powder, flee with Rs 2 lakh, 30 cellphones | Sakshi
Sakshi News home page

డబ్బు వసూలు చేసుకొస్తుండగా కారం చల్లి..

Published Sat, Mar 4 2017 3:43 PM | Last Updated on Sat, Aug 11 2018 8:54 PM

డబ్బు వసూలు చేసుకొస్తుండగా కారం చల్లి.. - Sakshi

డబ్బు వసూలు చేసుకొస్తుండగా కారం చల్లి..

బిహార్‌: బిహార్‌లో దొంగలు రెచ్చిపోయారు. కళ్లల్లో కారం చల్లి పంకజ్‌ కుమార్‌ అనే మొబైల్స్‌ డీలర్‌ నుంచి రూ.రెండు లక్షల నగదు, 30 మొబైల్‌ ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రోహతాస్‌ జిల్లాలోని ససారామ్‌ పట్టణంలోని తాకియా ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు సరిగ్గా శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో అనూహ్యంగా పంకజ్‌పై పెద్ద మొత్తంలో కారం కుమ్మరించారు.

అనంతరం క్యాష్‌ కౌంటర్‌ నుంచి రూ.2లక్షల నగదు, 30 ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగిన సమయంలో సదరు వ్యాపారి రిటెయిలర్స్‌ వద్దకు వెళ్లి డబ్బు వసూలు చేసుకొని వస్తున్నాడు. ససరామ్‌లో కారం జల్లి దాడి చేయడం ఇది మొదటి కేసు అని పోలీసులు చెబుతున్నారు. దాడికి పాల్పడిన దొంగల వివరాలు తెలియడం లేదని, శాస్త్రీయ విధానాలతో వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. బాధితుడు దాదాపు అందుడైన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement