Chimakurti granite
-
గెలాక్సీ గ్రానైట్‌లో ప్లాటినం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎంతో ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్‌లో అత్యంత విలువైన ప్లాటినం నిక్షిప్తమై ఉంది. విభిన్న రంగాలకు ఎంతో ఉపయుక్తమైన ఈ ఖనిజం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభ్యమవుతున్న గెలాక్సీ గ్రానైట్‌లో మిళితమై ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) లాంటి కేంద్ర సంస్థలు పరిశోధనలు నిర్వహించి ప్లాటినం లభ్యత ఏ స్థాయిలో ఉందనేది నిర్ధారిస్తే ప్రభుత్వానికి ఖనిజాదాయం పెరుగుతుంది. చీమకుర్తి మండలం రామతీర్థం పరిసరాల్లో 500 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో గెలాక్సీ గ్రానైట్ నిక్షిప్తమై ఉన్న సంగతి తెలిసిందే. గ్రానైట్ వెలికితీతకు ప్రభుత్వాలు 136 లీజులను మంజూరు చేయగా 32 మందికి పైగా లీజుదారులు 139 క్వారీలను నడుపుతూ గ్రానైట్ బ్లాక్‌లను తీస్తున్నారు. విభిన్న కారణాలరీత్యా పలు క్వారీల నుంచి బ్లాక్‌లు ఆశించిన స్థాయిలో రావడంలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ క్వారీలకు సంబంధించిన డంప్‌లు సుమారు 200 హెక్టార్లకు విస్తరించాయి. ఈ డంప్‌ల్లో 200 కోట్ల టన్నులకు పైగా గ్రానైట్ వేస్ట్ ఉంటుందనేది అంచనా. దక్షిణాఫ్రికాలో 80 శాతం వరకు... ప్రపంచంలో అత్యధికంగా దక్షిణాఫ్రికాలోని సుర్బురి బేసిన్లో 80 శాతం వరకు ప్లాటినం నిల్వలు ఉండగా, రష్యాలోని యురల్ పర్వత శ్రేణులు, అమెరికా, జింబాబ్వే, ఆస్ట్రేలియాలోనూ ఇది లభిస్తోంది. మన దేశంలో కర్ణాటకలోని హుట్టి బంగారు గనుల దిగువన, ఒడిశాలోని బౌలా–నౌషాహిలలో, తమిళనాడులోని సీతంపూడి గనులు, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోనూ ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ లభ్యతను నిర్ధారిస్తూ పదేళ్ల కిందటే జీఎస్ఐతో సహా ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ పరిశోధనల ఫలితాలను వెల్లడించాయి. ఎన్నెన్నో ప్రయోజనాలు.. నిజానికి.. ప్లాటినం, పల్లాడియం, ఇరిడియం, రోడియం, రుథేనియం, ఓస్మియం ఖనిజాల మిళితాన్ని ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ అంటారు. ఈ ఆరు ఖనిజాలు భౌతిక, రసాయనిక గుణాల సారూప్యతను కలిగి ఉంటాయి. ఈ ఖనిజాల సమ్మిళితాన్ని ఇరిడియం, ప్లాటినం సబ్ గ్రూపులుగా విభజిస్తారు. ప్లాటినం, పల్లాడియం, రోడియం ఖనిజాలు శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య రంగాలకు ఎంతగానో ఉపయుక్తమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే.. పెట్రోలియం రిఫైనరీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ (యాంటీ పొల్యూషన్ డివైజస్), ఫార్మాసూ్యటికల్స్, గ్లాస్, ఫెర్టిలైజర్స్, ఎక్స్పో్లజివ్స్, లాబ్స్ పరికరాల తయారీలో ప్లాటినం ఎంతగానో ఉపయోగపడుతుంది. జ్యువెలరీ రంగంలో ప్లాటినానిది ప్రత్యేక స్థానం. బంగారం, వెండి, రాగి లోహాలతో కూడిన అలంకరణ వస్తువుల తయారీలోనూ వినియోగిస్తారు. వైద్య రంగానికి సంబం«ధించి క్యాన్సర్ చికిత్సలో ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ కీమోథెరపీకి ప్రాథమికంగా ఉపయోగపడతాయి. పేస్‌మేకర్ తయారీకి, (డెంటిస్టరీ.. దంతసంబంధ వైద్యం) ఎగుడు దిగుడు దంతాలు, ఎత్తు దంతాలను సరిచేసి వాటిని ఒకేరీతిన అమర్చి అందాన్ని ఇనుమడింపజేయడంలోనూ ప్లాటినానిది ప్రధానపాత్ర. ఇక ప్లాటినం– ఇరిడియంలను బయోమెడికల్ పరికరాల తయారీకి విరివిగా వినియోగిస్తారు. ప్లాటినం–రోడియం కలిసిన ఖనిజాలు ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్, కంప్యూటర్ మోనిటర్, హార్డ్‌డిస్క్‌లు, సెల్ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, డిస్ప్లే ప్యానల్స్, ఆటోమొబైల్ డిస్ప్లేల తయారీకి ఉపయోగపడతాయి. వంద గ్రాములు రూ.2.37 లక్షలు.. ప్లాటినం ధర కూడా ఎక్కువే. పలు సందర్భాలలో బంగారం ధరతో పోటీపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక గ్రాము ప్లాటినం ధర రూ.2,374లు. వంద గ్రాములు రూ.2.37 లక్షలకు పైగా పలుకుతోంది. ఆభరణాల తయారీ, అలంకరణలకు ప్లాటినం పెట్టింది పేరు. గ్రానైట్ డంప్‌ల నుంచి.. చీమకుర్తి గ్రానైట్‌లో ప్లాటినం ఉందనేది నిర్ధారితమైనందున ఇందులో ప్లాటినం సమ్మిళితాలు ఎంతశాతం.. ఎంతమేరకు లాభదాయకమనే స్పష్టత కోసం తదుపరి పరిశోధనలు నిర్వహించాలని గనుల శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరగకముందు వరకు జీఎస్ఐ, ఓఎన్జీసీ, ఎన్జిఆర్ఐ, ఎన్ఎండీసీ, ఎంఇఎల్ఎల్ (మినరల్ ఎక్స్ల్పిరేషన్ కంపెనీ లిమిటెడ్), ఏఎండీ (అటావిుక్ మినరల్ డివిజన్), ఐబీఎం (ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్) తదితర కేంద్ర సంస్థలతో పాటు రాష్ట్ర పరిధిలోని అటవీ, జలవనరులు తదితర శాఖలతో సంయుక్తంగా స్టేట్ జియలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు సమావేశాలు జరిగేవి. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో తమకు కావాల్సిన సర్వేలు చేయాలని మైనింగ్ విభాగాలు కోరడంతో పాటు కేంద్ర సంస్థలు నిర్వహించిన ఖనిజాన్వేషణ నివేదికలను పొందేవి. తద్వారా మైనింగ్ రంగంలో ఏ రీతిన పురోగతి సాధించాలి, ఆదాయ సముపార్జన మార్గాల ప్రణాళిక సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే చీమకుర్తిలోని డంప్‌ల్లోని దాదాపు 200 కోట్ల టన్నుల గ్రానైట్ వేస్ట్‌ను ప్రాసెస్ చేయడానికి సాధ్యాసాధ్యాలపై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
నేలను తవ్వి కొండను చేశారు
సాక్షి, చీమకుర్తి(ప్రకాశం) : ‘రోడ్లన్ని ధ్వంసమయ్యాయి. కార్మికుల ప్రాణాలకు రక్షణ లేదు. కార్మికులకు వైద్యం అందించేందుకు కనీసం ఆస్పత్రిని ఏర్పాటు చేయలేకపోయారు. తిరిగేందుకు వీధిౖలైట్లు లేవు, తాగేందుకు మంచినీళ్లు కూడా లేవు. మైనింగ్ రూల్స్‌ను అతిక్రమించి నేలను తవ్వి కొండలను తయారు చేశారు. రామతీర్థం, చీమకుర్తి పరిధిలో ఎటు చూసినా గ్రానైట్ వ్యర్థాలతో కూడిన డంపింగ్ యార్డులే’ అంటూ స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రామతీర్థంలో గ్రానైట్ ఫ్యాక్టరీలు, కంకర మిల్లుల యజమానులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుందని, గ్రానైట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంతో ప్రతి విషయం ప్రభుత్వానికి రికార్డుల ప్రకారం తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత ఐదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన ప్రభుత్వాన్ని మీరే పోషించారు. మంత్రులుగా కూడా చెలాయించారు. కానీ స్థానిక కార్మికులకు కనీసం ఆస్పత్రి పెట్టాలనే స్ప్రహా కూడా రాలేదు. మంచినీటి సదుపాయాన్ని కల్పించలేదు. కాలుష్య నియంత్రణకు పచ్చని చెట్లు నాటలేదు. వీధిలైట్లు వేయించలేదు. ఇండస్ట్రీలో జరుగుతున్న మరణాలపై బాధ్యతలేదు. మళ్లీ సమాజంలో పెద్ద నాయకులుగా చెలామణి అయ్యారని గత ప్రభుత్వంలో పెత్తనం చేసిన స్థానిక గ్రానైట్ నేతలను ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఏకిపడేశారు. మృతుల ఆధారాలే ఉండవు గ్రానైట్ ఇండస్ట్రీలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు ప్రభుత్వం సాయం చేద్దామని చూస్తే కనీసం మరణించిన వారి ఊరు పేరు వివరాలు ఉండవు. రేషన్‌కార్డు ఉండదు. తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఎవరు మరణించారో తెలియదు. ఏ రాష్ట్రం వారో తెలియదు. ఇలాంటప్పుడు ఎలా సహాయం చేయాలంటూ ప్రశ్నించారు. కార్మికుల పట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది అన్యాయం, అక్రమమంటూ ఫ్యాక్టరీలు, క్వారీల యజమానులు వైఖరిపై ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. గ్రానైట్ ఇండస్ట్రీలో ఖనిజ సంపదను కొంతమంది చెప్పుచేతుల్లో పెట్టుకొని పరిశ్రమ మొత్తాన్ని శాసిస్తున్నారు తప్ప కార్మికులకు, స్థానిక ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై దృష్టి సారించటం లేదనే ఆవేదనను వ్యక్తం చేశారు. ఎవరైనా మాట్లాడగలిగే వారుంటే ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు వారిని బలవంతంగా నోరుమూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయల్టీ ధనం ఏమైంది? స్థానిక ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందకు క్వారీలు, ఫ్యాక్టరీల నుంచి వసూలు చేసిన రాయల్టీ ధనం ఆనాటి కలెక్టర్ వద్దకు వెళ్లిన తర్వాత ఏమైనట్లు అంటూ ప్రశ్నించారు. రాయల్టీ ధనం నెలకు రూ.3.30 కోట్లు వసూలు చేశారు. ఏడాదికి అది దాదాపు రూ.36 కోట్లుకు పైగా ఉంది. ఆ ధనం మొత్తం స్థానిక ఇండస్ట్రీ అభివృద్ధికే చెందాల్సి ఉంటే ఏమైందో ఇప్పటికీ అంతుబట్టటం లేదని ఎమ్మెల్యే ఘాటైన స్వరంతో మండిపడ్డారు. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు, అధికారులు మైనింగ్ రూల్స్‌ను అతిక్రమించి పనిచేశారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు. తప్పనిసరిగా శిక్షించబడతారని ఎమ్మెల్యే టీజేఆర్ హెచ్చరించారు. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా గ్రానైట్ యజమానులు, ఫ్యాక్టరీల యజమానులతో గతంలో ఎప్పుడూ సమావేశాలు నిర్వహించలేదని, ఇప్పుడు తాను ఎందుకు నిర్వహిస్తున్నానంటే సీఎం జగన్మోహన్రెడ్డి తెచ్చిన మార్పు ఇదే...అంటూ ప్రభుత్వ విధానాన్ని తెలియజెప్పారు. ఇప్పటికైనా యజమానులు తమ వద్ద పనిచేసే కార్మికుల వివరాలను రికార్డుల ద్వారా పూర్తిగా సమాచారం నమోదు చేయడమే కాకుండా ప్రభుత్వానికి అందజేయాలని తెలిపారు. యజమానులకు ఏమైనా అనుమానాలు ఉంటే నేరుగా తనతోనే మాట్లాడవచ్చని, తనకు పీఏలు ఎవరూ లేరని, ఏ సమయంలోనైనా, ఎవరితోనైనా నేరుగా మాట్లాడతానని, తన వద్ద పనులు చేసి పెడతామని చెప్పి ప్రలోభాలకు గురిచేసేవారి మాటలు నమ్మవద్దని, నేరుగా తనకే ఫోన్ చేయాలంటూ తన ఫోన్ నంబర్ 9866075828 అంటూ ఫ్యాక్టరీల యజమానులు, కంకరమిల్లుల యజమానులకు తెలియజేశారు. తొలుత గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు తమ సమస్యలైన ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, డంపింగ్ యార్డును కల్పించాలని, ఫ్యాక్టరీలకు నీటి వసతి కల్పించాలని, రాకపోకలకు వీలుగా రోడ్లు నిర్మాణం చేపట్టాలనే డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు అందించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమణయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, ఫ్యాక్టరీల యజమానులు మల్లినేని వెంకటేశ్వర్లు, మస్తాన్‌రెడ్డి, మేడగం రామకృష్ణారెడ్డి, ప్రసాదరెడ్డి ఫ్యాక్టరీల యజమానులు పాల్గొన్నారు. -
టెండూల్కర్‌ను చూసైనా మారరా?
తన ప్రతిభాపాటవాలతో భారత రత్నగా కీర్తి ఆర్జించిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉన్నత లక్ష్యంతో ముందుకెళుతున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని పుట్టంజారు కండ్రిగ అనే గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు. ఈనెల 16న ఆ గ్రామాన్ని సచిన్ సందర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సచిన్ ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ దానిని తన కుంటుంబానికే పరిమితం చేసుకోకుండా తన ప్రాంతం కాని మరో చోట ఉన్న గ్రామాన్ని దత్తత తీసుకోవడం అభినందనీయం. మరి చీమకుర్తి గ్రానైట్‌ను తరలించుకుపోతున్న వ్యాపారులు ఆ గ్రామం వైపు కనీసం కన్నెత్తి ఎందుకు చూడరో ఆలోచించాలి. ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు తమ కర్మాగారాల్లోని కార్మికులతో పాటు పరిసర గ్రామాలను అభివద్ధి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నారుు. కానీ ఇక్కడ మాత్రం విరుద్ధం.