టెండూల్కర్‌ను చూసైనా మారరా?
తన ప్రతిభాపాటవాలతో భారత రత్నగా కీర్తి ఆర్జించిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉన్నత లక్ష్యంతో ముందుకెళుతున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని పుట్టంజారు కండ్రిగ అనే గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు. ఈనెల 16న ఆ గ్రామాన్ని సచిన్ సందర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
సచిన్ ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ దానిని తన కుంటుంబానికే పరిమితం చేసుకోకుండా తన ప్రాంతం కాని మరో చోట ఉన్న గ్రామాన్ని దత్తత తీసుకోవడం అభినందనీయం. మరి చీమకుర్తి గ్రానైట్‌ను తరలించుకుపోతున్న వ్యాపారులు ఆ గ్రామం వైపు కనీసం కన్నెత్తి ఎందుకు చూడరో ఆలోచించాలి. ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు తమ కర్మాగారాల్లోని కార్మికులతో పాటు పరిసర గ్రామాలను అభివద్ధి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నారుు. కానీ ఇక్కడ మాత్రం విరుద్ధం.