China accident
-
చైనాలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తాపడి 27మంది దుర్మరణం
బీజింగ్: చైనాలో ఆదివారం ఉదయం ఘోరో ప్రమాదం జరిగింది. గిజావ్ రాష్ట్రం సాండు కౌంటీలో హైవేపై బస్సు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన 20 మందిని హుటాహూటిన ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగినట్లు సమాచారం అందిన వంటేనే సహాయక బృందాలు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతం ఎత్తైన పర్వతాల మధ్య ఉంది. ఇక్కడ సంప్రదాయ తెగలవారు జీవిస్తుంటారు. అయితే బస్సులో ఉన్నవారంతా కొవిడ్ బాధితులు అయి ఉంటారని ప్రచారం జరుగుతోంది. గిజావ్ ప్రభుత్వ అధికారులు కూడా వీరందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తుండగానే ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరించారు. ప్రమాద సమయంలో బస్సులోని ప్రయాణికులంతా కోవిడ్ సూట్లు ధరించి ఉన్నట్లు సమాచారం. కానీ వీరు కోవిడ్ బాధితులా? లేకా అనుమానితులా? అనే విషయంపై స్పషత లేదు. గిజావ్ రాష్ట్రంలో గత రెండు రోజుల్లో 900కుపైగా కొత్త కేసులు వెలుగుచేశాయి. సెప్టెంబర్ మొదట్లోనే ఇక్కడ లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. కోవిడ్ బాధితులను, వారిని కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తోంది. చదవండి: కింగ్ చార్లెస్ కారుని ఢీ కొట్టబోయాడు..! వీడియో వైరల్ -
మూడు ట్రక్కులు డీ: తొమ్మిది మంది మృతి
బీజింగ్: చైనా షాంగ్జి ప్రావిన్స్‌లోని యజ్హో నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని జాతీయ రహదారిపై బుధవారం మూడు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎనిమిది మంది రహదారిపై పనులు చేస్తున్న పనివారని చెప్పారు. మరోకరు ట్రక్కులోని వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
లిక్కర్ వ్యాన్ ఢీ: 38 మంది మృతి
చైనా హ్యూనన్ ఫ్రావెన్స్లోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో దాదాపు 38 మంది మరణించగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వస్తున్న వాహనాన్ని ఎదురుగా అల్కహాల్ లోడ్‌తో వస్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. దాంతో ప్రయాణికుల వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక శకటాలతో సహా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నించారు. దాదాపు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించి ఆ మంటలార్పారు. ఆ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 3.00 గంటలకు ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. -
కాలువలో పడిన బస్సు: 12 మంది మృతి
వేగంగా వెళ్తున్న మినీ బస్సు కాలువలో పడిన దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఆ దుర్ఘటన చైనాలోని యున్నన్ ప్రావెన్స్లో ఆ రోజు ఉదయం చోటు చేసుకుంది. ఆ బస్సులో ప్రయాణికులంతా మరణించారని స్థానిక మీడియా వివరించింది. గ్రామీణ ప్రాంత రోడ్డుపై నుంచి జాతీయ రహదారిపైకి వచ్చే క్రమంలో ఏ మాత్రం వేగం తగ్గించకపోవడంతో ఆ సంఘటన జరిగిందని పేర్కొంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న లోతు ఎక్కువగా ఉన్న కాలువలో పడటంతో అందరు మరణించారని వెల్లడించింది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు హుటాహుటన సంఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టినట్లు మీడియా వివరించింది.