వేగంగా వెళ్తున్న మినీ బస్సు కాలువలో పడిన దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఆ దుర్ఘటన చైనాలోని యున్నన్ ప్రావెన్స్లో ఆ రోజు ఉదయం చోటు చేసుకుంది. ఆ బస్సులో ప్రయాణికులంతా మరణించారని స్థానిక మీడియా వివరించింది. గ్రామీణ ప్రాంత రోడ్డుపై నుంచి జాతీయ రహదారిపైకి వచ్చే క్రమంలో ఏ మాత్రం వేగం తగ్గించకపోవడంతో ఆ సంఘటన జరిగిందని పేర్కొంది.
జాతీయ రహదారి పక్కనే ఉన్న లోతు ఎక్కువగా ఉన్న కాలువలో పడటంతో అందరు మరణించారని వెల్లడించింది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు హుటాహుటన సంఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టినట్లు మీడియా వివరించింది.