Yunnan province
-
ప్రాణాలు కాపాడిన.. అధికారుల ముందుచూపు
బీజింగ్ : చైనా పోలీసుల ముందుచూపుతో ఇద్దరు వ్యక్తులు మరణం అంచు నుంచి తప్పించుకోగలిగారు. దక్షిణ చైనాలోని యువాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్-మోహన్ రహదారి ఎత్తైన కొండల గుండా వెళుతుంది. ఎత్తైన కొండ నుంచి కింది వైపుకి ఉన్న కున్‌మో ఎక్స్‌ప్రెస్ హైవేలో దాదాపు 27 కిలో మీటర్ల దూరం అత్యంత ప్రమాదకరమైంది. దీనికి స్లోప్ ఆఫ్ డెత్ గా పేరు కూడా ఉంది. తరుచూ ప్రమాదాలు జరిగే కొన్ని ప్రాంతాలను గుర్తించి, ఒక వేళ ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని, ఇంజినీర్ల సహాయంతో 2015లో స్థానిక పోలీసులు కొన్ని నిర్మాణాలను చేపట్టారు. వాహనాలు లోయలో పడిపోకుండా ఏటవాలుగా కొద్దిదూరం రోడ్డును నిర్మించి కంకరతో నింపారు. అంతేకాకుండా కొండపైన రోడ్డు అంచునుంచి కిందకి పడిపోకుండా భారీ వలను కూడా ఏర్పాటు చేశారు. అయితే సోమవారం ఓ భారీ లారీ కున్‌మో ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న మూలమలుపు వద్ద అదుపుతప్పింది. భారీ వాహనం కావడం, అది కూడా అతివేగంగా వెళ్లడంతో కంకరను సైతం దాటుకొని రోడ్డు అంచున ఆగిపోయింది. లారీ వెనక భాగం రోడ్డుపైనే నిలిచిపోగా.. క్యాబిన్ రోడ్డు అంచును దాటుకొని ముందుకు వాలిపోయింది. దీంతో లారీ అద్దాల్లో నుంచి డ్రైవర్, క్లీనర్‌లో బయటివైపు పడిపోయారు. అయితే అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్మించిన వల ఉండటంతో అందులో పడి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాదాల నివారణ కోసం స్థానిక పోలీసులు 2015లో మూల మలుపు వద్ద చేపట్టిన నిర్మాణాకి అంచున వలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆ నిర్మాణం వల్ల ఐదుగురు వ్యక్తులు ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఆ భారీ వల లేకపోతే దాదాపు330 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయి, ఈ పాటికి చనిపోయి ఉండేవాళ్లమని, అధికారులకు డ్రైవర్ కృతజ్ఞతలు తెలిపాడు. -
ప్రాణాలు కాపాడిన.. అధికారుల ముందుచూపు
-
చైనాలో ఘాతుకం
బీజింగ్: చైనా వర్తమాన చరిత్రలో తీవ్ర ఘాతుకంగా పరిగణిస్తోన్న సంఘటన ఆ దేశ నైరుతి రాష్ట్రమైన యునాన్లో చోటుచేసుకుంది. చెడు అలవాట్లకు బానిస అయిన ఓ కొడుకు అప్పులు తీర్చడానికి నిరాకరించిన తల్లిదండ్రుల్ని దారుణంగా హతమార్చాడు. అంతటితో ఆగకుండా ఎక్కడ నేరం బయటపెతారోనని చుట్టుపక్కల ఇళ్లలోని 17 మందిని కూడా కిరాతకంగా చంపేశాడు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ దురాగతంపై యునాన్ పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. యునాన్ ఫ్రావిన్స్ రాజధాని కున్ మింగ్ లో చిన్నపాటి ఉద్యోగం చేస్తోన్న యాంగ్ జింగ్ పె(27) అనే యువకుడు చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. దీంతో దొరికిన చోటల్లా ఎడాపెడా అప్పులుచేశాడు. అవి తీర్చలేని స్థితిలో.. డబ్బు కోసం బుధవారం సొంత ఊరికి వెళ్లాడు. అప్పులు తీర్చమని తల్లిదండ్రులను ఒత్తిడి చేశాడు. వాళ్లు ఎంతకీ అంగీకరించకపోవడంతో కోపోద్రిక్తుడై అమ్మానాన్నలి దారుణంగా చంపేశాడు. పక్కింటివాళ్లెవరైనా తన వివరాలు చెబుతారేమోననే సందేహంలో వాళ్లను కూడా ఒక్కొక్కరిగా చంపేశాడు. అలా యాంగ్ జింగ్ పె మొత్తం 19 మందిని కిరాతకంగా చంపాడు. వారిలో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. హత్యలు చేసి ఏమీ తెలియనివాడిలా కున్మింగ్కు వెళ్లిపోయాడు. ఇప్పటికే చైనాలో పలు సామూహిక హత్యోదంతాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ మారణకాండకు సంబంధించిన వార్తలు కూడా దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. రంగంలోకి దిగిన పోలీసులు యాంగ్ జింగ్పెను అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా నిజాలు వెల్లడయ్యాయి. తల్లిదండ్రులు సహా మొత్తం 19 హత్యలు తానే చేసినట్లు యాంగ్ ఒప్పుకున్నాడు. ప్రజా భద్రత శాఖ దర్యాప్తు చేస్తోన్న ఈ కేసు అతి త్వరలోనే కోర్టుకు చేరుతుంది. నిందితుడికి ఎక్కువలో ఎక్కువ మరణశిక్ష విధించే అవకాశాలున్నాయి. -
బస్సు బోల్తా : ఏడుగురు మృతి
బీజింగ్: బస్సు బోల్తా పడి ఏడుగురు మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. ఈ సంఘటన చైనాలోని యునాన్ ప్రావెన్స్లో సోమవారం చోటు చేసుకుంది. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు... గార్డ్రైలును ఢీ కొని బోల్తా పడింది. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మరణించారని పోలీసులు చెప్పారు. -
చైనాలో స్వల్ప భూకంపం
చైనాలోని ఆగ్నేయ ప్రాంతమైన యున్నన్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైంది. ఈ విషయాన్ని చైనా భూకంప నెట్వర్కుల కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం భూమికి 11 కిలోమీటర్ల లోతులో ఉంది. అయితే, ఈ భూకంపం కారణంగా ఇంతవరకు ఎవరూ మరణించినట్లు మాత్రం తెలియలేదని ప్రభుత్వ వార్తాసంస్థ సిన్హువా తెలిపింది. యున్నన్ రాష్ట్రంలో తరచు భూకంపాలు వస్తూనే ఉంటాయి. యున్నన్‌కు ఈశాన్యంగా ఉన్న లుడియాన్ ప్రాంతంలో ఆగస్టు 3వ తేదీన 6.5 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా 600 మంది మరణించారు. -
410కి చేరిన చైనా భూకంప మృతుల సంఖ్య
బీజీంగ్: చైనాలో సంభవించిన భూకంప ప్రమాదంలో మృతుల సంఖ్య 410కి చేరుకుందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆదివారం చైనాలోని యున్నన్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంప తీవ్రత 6.5 గా నమోదైంది. గత 14 ఏళ్లలో పెద్ద మొత్తంలో ప్రకంపనలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ ప్రకంపనల్లో సుమారు 80 వేల ఇల్లు నేలమట్టం కాగా, 2 లక్షల 30 వేల మంది నిరాశ్రయులయ్యారు. భూకంప బాధితులకు సహాయం అందించడానికి వేల సంఖ్యలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సైన్యాన్ని ప్రభుత్వం నియమించింది. -
కాలువలో పడిన బస్సు: 12 మంది మృతి
వేగంగా వెళ్తున్న మినీ బస్సు కాలువలో పడిన దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఆ దుర్ఘటన చైనాలోని యున్నన్ ప్రావెన్స్లో ఆ రోజు ఉదయం చోటు చేసుకుంది. ఆ బస్సులో ప్రయాణికులంతా మరణించారని స్థానిక మీడియా వివరించింది. గ్రామీణ ప్రాంత రోడ్డుపై నుంచి జాతీయ రహదారిపైకి వచ్చే క్రమంలో ఏ మాత్రం వేగం తగ్గించకపోవడంతో ఆ సంఘటన జరిగిందని పేర్కొంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న లోతు ఎక్కువగా ఉన్న కాలువలో పడటంతో అందరు మరణించారని వెల్లడించింది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు హుటాహుటన సంఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టినట్లు మీడియా వివరించింది.