చైనాలో స్వల్ప భూకంపం
చైనాలోని ఆగ్నేయ ప్రాంతమైన యున్నన్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైంది. ఈ విషయాన్ని చైనా భూకంప నెట్వర్కుల కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం భూమికి 11 కిలోమీటర్ల లోతులో ఉంది.
అయితే, ఈ భూకంపం కారణంగా ఇంతవరకు ఎవరూ మరణించినట్లు మాత్రం తెలియలేదని ప్రభుత్వ వార్తాసంస్థ సిన్హువా తెలిపింది. యున్నన్ రాష్ట్రంలో తరచు భూకంపాలు వస్తూనే ఉంటాయి. యున్నన్కు ఈశాన్యంగా ఉన్న లుడియాన్ ప్రాంతంలో ఆగస్టు 3వ తేదీన 6.5 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా 600 మంది మరణించారు.