Photo courtesy IANS.
బీజింగ్: చైనాలో ఆదివారం ఉదయం ఘోరో ప్రమాదం జరిగింది. గిజావ్ రాష్ట్రం సాండు కౌంటీలో హైవేపై బస్సు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన 20 మందిని హుటాహూటిన ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగినట్లు సమాచారం అందిన వంటేనే సహాయక బృందాలు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతం ఎత్తైన పర్వతాల మధ్య ఉంది. ఇక్కడ సంప్రదాయ తెగలవారు జీవిస్తుంటారు.
అయితే బస్సులో ఉన్నవారంతా కొవిడ్ బాధితులు అయి ఉంటారని ప్రచారం జరుగుతోంది. గిజావ్ ప్రభుత్వ అధికారులు కూడా వీరందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తుండగానే ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరించారు. ప్రమాద సమయంలో బస్సులోని ప్రయాణికులంతా కోవిడ్ సూట్లు ధరించి ఉన్నట్లు సమాచారం. కానీ వీరు కోవిడ్ బాధితులా? లేకా అనుమానితులా? అనే విషయంపై స్పషత లేదు.
గిజావ్ రాష్ట్రంలో గత రెండు రోజుల్లో 900కుపైగా కొత్త కేసులు వెలుగుచేశాయి. సెప్టెంబర్ మొదట్లోనే ఇక్కడ లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. కోవిడ్ బాధితులను, వారిని కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తోంది.
చదవండి: కింగ్ చార్లెస్ కారుని ఢీ కొట్టబోయాడు..! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment