China phones
-
టెక్నో క్యామాన్ 30ప్రో 5జీ, క్యామాన్ 30 ప్రీమియర్ 5జీ విడుదల.. ధర ఎంతంటే?
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో మొబైల్.. టెక్నో క్యామాన్ 30ప్రో 5జీ, క్యామాన్ 30 ప్రీమియర్ 5జీని భారత్‌లో విడుదల చేసింది. రెండు స్మార్ట్ఫోన్లు ఐపీ53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇక తాజాగా విడుదలైన టెక్నో క్యామాన్ 30 ప్రో 5జీ, క్యామన్ 30 ప్రీమియర్ 5జీ ధరలు ఇలా ఉన్నాయి. ముందుగా టెక్నో క్యామాన్ 30 5జీ 8జీబీ ర్యామ్/ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 ఉండగా.. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 గా ఉందిక్యామన్ 30 ప్రీమియర్ 5జీ 12 జీబీ ర్యామ్,512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. టెక్నో క్యామన్ 30 5జీ స్పెసిఫికేషన్స్:టెక్నో క్యామన్ 30 5జీ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1080 x 2436 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో ఎల్టీపీఎస్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్ 360హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160హెచ్ జెడ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీడియా టెక్ డైమన్సిటీ 7020 చిప్సెట్, గరిష్టంగా 12జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనిని 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్, 10డబ్ల్యూ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. -
తక్కువ ధర చైనా ఫోన్లపై భారత్‌లో నిషేధం!
చిన్నకర్రనైనా పెద్ద పాముతో కొట్టాలంటారు పెద్దలు. చైనా ఫోన్ల విషయంలో భారత్ ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో కాబోతోంది. చైనా ఫోన్లపై నిషేధం విధించాలని భారత్ కోరుతోంది. అదీ రూ. 12,000 కంటే తక్కువ ధర కలిగిన చైనీస్ ఫోన్ల అమ్మకాలను నిషేధించాలనుకుంటోంది. తద్వారా తడబడుతున్న దేశీయ పరిశ్రమకు బలం ఇవ్వాలని భావిస్తోంది. తక్కువ రేటు చైనా ఫోన్ల అమ్మకాలను భారత్‌లో నిషేధించాలన్న భారత ప్రభుత్వ తాజా నిర్ణయం ద్వారా షావోమీలాంటి చైనీస్ బ్రాండ్లతో సహా చాలావాటికి దెబ్బ పడనుంది. ముఖ్యంగా ప్రపంచంలోని రెండవ అతిపెద్ద మొబైల్ మార్కెట్ అయిన భారత్.. తద్వారా దిగువ విభాగం నుండి చైనీస్ కంపెనీలను బయటకు గెంటేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ ప్రవేశ-స్థాయి(ఎంట్రీ లెవల్) మార్కెట్ నుంచి తప్పించడం ద్వారా షావోమీ, మరికొన్ని సహచర కంపెనీలను నిలువరించడమే భారత వ్యూహమని నిపుణులు చెప్తున్నారు. చైనాలో కరోనా, లాక్డౌన్ ప్రభావంతో అక్కడి మార్కెట్ ఘోరంగా దెబ్బతింటోంది. దీంతో ఎక్కువగా భారతదేశంపైనే ఆధారపడుతోంది ఆ మార్కెట్. మార్కెట్ ట్రాకర్ కౌంటర్‌పాయింట్ ప్రకారం, జూన్ 2022 వరకు త్రైమాసికంలో $150(12వేలరూపాయల) లోపు స్మార్ట్ఫోన్లు.. భారతదేశ విక్రయాలకుగానూ మూడింట ఒక వంతుకు దోహదపడ్డాయి. చైనా కంపెనీలు ఆ షిప్మెంట్లలో 80% వరకు ఉండడం గమనార్హం. ఇప్పటికే షావోమీ, ఒప్పో , వివో వంటి చైనీస్ సంస్థలు భారత్‌లో ఆర్థిక సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ట్యాక్సుల ఎగవేతతో పాటు ఏకంగా మనీల్యాండరింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి కూడా. అయితే చైనీస్ ఫోన్లు, ఉత్పత్తులను నేరుగా నిషేధించేందుకు ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్ ఉన్నందున.. గతంలో హువాయ్, జెడ్‌టీఈ లాంటి దిగ్గజాల టెలికాం పరికరాలను నిషేధించడానికి అనధికారిక మార్గాలను ఉపయోగించింది. చైనా ఫోన్ల విషయంలో అలాంటి స్ట్రాటజీనే పాటించాలని భావిస్తోంది. మరోవైపు.. భారత్‌లో యూనిట్ల ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీలపై ఒత్తిడి చేస్తోంది. స్థానికంగా సప్లయ్ చెయిన్లు ఏర్పాటు చేయాలని, భారీగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని, భారత్ నుంచే ఎగుమతి చేయాలని కోరుతూ వస్తోంది. తద్వారా చైనా ఫోన్లకు మేడ్ ఇన్ ఇండియా మార్క్‌తో పాటు స్థానికంగా ఉపాధి కల్పన కూడా ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. ఇదీ చదవండి: 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు ఇవే! -
చైనా 'బే'జార్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న నినాదం ఒక్కటే.. ‘చైనా వస్తువుల్ని బహిష్కరించాల’ని.. మన దేశంలో తన వస్తువులు అమ్ముకొని బతికే చైనా.. మన సైనికులపై రాళ్లతో దాడి చేసి పొట్టన పెట్టుకోవడం ఏంటని..? ఓవైపు కరోనా మహమ్మారిని ప్రపంచంపై వదిలి లక్షల ప్రాణాలను తీసుకుంటోందని.. మరోవైపు తన సైన్యాన్ని భారత్‌పై ఉసిగొల్పుతోందని ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే ఫోన్లలో ఉండే చైనీస్ యాప్‌లను వేల సంఖ్యలో డిలీట్ చేసి.. ‘నేను దేశభక్తి చాటుకున్నాను’ అంటూ వాట్సాప్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ నినాదం నగరంలో జోరుగా వినిపిస్తోంది. చైనా వస్తువులను బహిష్కరించాలని పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ చైనా వస్తువులనుబహిష్కరించి దేశభక్తి చాటుకోవాలని కోరుతున్నారు. మనదగ్గరే కుటీర పరిశ్రమల్లో తయారైన వస్తువులను కొనుగోలు చేయాలని అంటున్నారు. దీంతో నిత్యం కిటకిటలాడే చైనా బజార్లు వెలవెలబోతున్నాయి. చైనీస్ ఫుడ్‌ని సైతం నగరవాసులు ఇష్టపడటం లేదు. అప్రమత్తమైన వ్యాపారులు చైనా బజార్ల బోర్డులు తొలగిస్తున్నారు. అంబర్‌పేట: చైనా వస్తువులు కొనుగోలు చేయవద్దంటూ ప్రచారం నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోని చైనా బజార్ల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. చైనా బజార్ల బోర్డులను తొలగిస్తున్నారు. స్థానిక పేర్లతో వ్యాపారాలు సాగించుకుంటున్నారు. అవసరమైన వస్తువులను స్థానికంగా కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. మనమూ తయారు చేయవచ్చు.. చైనా బజార్లలో విక్రయించే చైనా వస్తువులను ఇక్కడే తయారు చేయవచ్చని పలువురు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకొని ఇక్క డ విక్రయాలు సాగించే పరిస్థితి నుంచి బయట పడేందుకు ప్రభుత్వాలు అండగా ఉండాలంటున్నారు. చైనా నుంచి వచ్చి ఇక్కడ విక్రయాలు జరిగే వరకు వేచి చూడకుండా ప్రభుత్వం నిషేధిస్తే ఇక్కడి వరకు ఎలా వస్తాయంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనా బజార్లలో అమ్మే ప్రతి వస్తువు చైనాది కాదంటున్నారు. చైనీస్ ఫుడ్ రెస్టారెంట్లు ఢమాల్ సనత్‌నగర్: నగరంలో చైనీస్ ఫుడ్ రెస్టారెంట్లు డీలా పడిపోయాయి. చైనా వంటకాలను లొట్టలేసుకుని తినే భోజన ప్రియులు ఇప్పుడు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. నగరవాసులు సరికొత్త రుచులను ఆహ్వానించేందుకు ముందుంటారు. ఈ క్రమంలో సిటీజనుల జిహ్వా రుచులను పట్టేసిన చైనీస్ ఫుడ్ రెస్టారెంట్ల నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త రుచులను అందిస్తూ వచ్చారు. అయితే కరోనా తోడు తాజాగా చైనా–భారత్ సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘర్షణల్లో భారత సైనికులు అమరులుకావడం.. దీంతో ఆ దేశీయ ఉత్పత్తుల వాడకాన్ని నిషేధిద్దామనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై సోషల్ మీడియాలో ఉవ్వెతున ఉద్యమమే నడుస్తోంది. ఈ క్రమంలో చైనా పేరు వినిపిస్తేనే కొంత ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. అలాంటిది చైనీస్ ఉత్పత్తులే కాదు.. చైనీస్ ఫుడ్‌పై కూడా నిషేధాన్ని విధిస్తున్నారా? అన్న పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. బిజినెస్ భారీగా పడిపోయి ఆయా రెస్టారెంట్లు కుదేలవ్వడమే ఇందుకు నిదర్శనం. 5–10 శాతమే వ్యాపారం.. కరోనా వైరస్ చైనాలో పుట్టిందని తెలిసినప్పటి నుంచే ఆయా వంటకాలకు క్రమేపీ డిమాండ్ తగ్గుతూ వచ్చింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే చైనీస్ ఫుడ్ రెస్టారెంట్ల బిజినెస్ 30 శాతానికి పడిపోగా, లాక్డౌన్ తర్వాత మరింత పతనావస్థకు చేరుకుంది. దీనికి తోడు చైనా కవ్వింపు చర్యలకు దిగడమే కాకుండా ఘర్షణల్లో భారత్ సైనికులను పొట్టన పెట్టుకున్న దగ్గర నుంచి చైనా ఉత్పత్తులు అంటే మండిపోతున్నారు. ఈ క్రమంలో కేవలం 5–10 శాతం మాత్రమే వ్యాపారం జరుగుతుందనేది రెస్టారెంట్ల నిర్వాహకులు చెప్పేమాట. గతంలో లక్ష వ్యాపారం జరిగే చోట రూ.5–10 వేలకు పడిపోయింది. సాధారణంగా చైనీస్ రెస్టారెంట్లలో ఎక్కువ శాతం వివిధ రకాల సూప్‌లతో పాటు చికెన్, మటన్, చేపలు, రొయ్యలతో వివిధ రకాల వంటకాలను తయారుచేసి అందిస్తుంటారు. ఆయా రకాల వంటకాలు హైదరాబాదీయులను నోరూరించేవే.. కానీ చైనీస్ అనే పదం వినిపిస్తే చాలు.. భోజన ప్రియులు ఆమడదూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. తెరుచుకోని మెయిన్ ల్యాండ్ చైనా రెస్టారెంట్.. సమస్త చైనీస్ వంటకాలకు పెట్టింది పేరు గ్రీన్‌ల్యాండ్స్ ప్రాంతంలోని మెయిన్ ల్యాండ్ చైనా రెస్టారెంట్. సాధారణంగా ఎక్కువ శాతం ఇక్కడి వారే చైనీస్ ఫుడ్ రెస్టారెంట్లను నెలకొల్పి నిర్వహిస్తుండగా, మెయిన్‌ల్యాండ్ చైనా రెస్టారెంట్ మాత్రం అచ్చంగా చైనీయులకు సంబంధించినదేనన్న పేరును మూటగట్టుకుంది. ఇక్కడ దొరకని చైనీస్ వంటకం అంటూ ఏమీ ఉండదు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి మూసివేసిన ఈ రెస్టారెంట్ ఇప్పటి వరకు తెరుచుకోలేదు. అనివార్య కారణాల వల్ల తెరవలేకపోయామని, అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ నిర్వాహకులు బోర్డును కూడా ఏర్పాటుచేశారు. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితుల్లో ఓపెన్ చేసినా చైనీస్ వంటకాలను ఎక్కువగా ఇష్టపడరనే ఆలోచనతోనే ఈ రెస్టారెంట్‌ను ఇంకా ఓపెన్ చేయలేదని తెలుస్తోంది. చైనీస్ ఫుడ్‌కు డిమాండ్ పడిపోయింది కరోనా దెబ్బకు తోడు ఇప్పుడు చైనా, భారత్ మధ్య జరుగుతున్న ఘర్షణలతో చైనీస్ వంటకాలకు డిమాండ్ భారీగా పడిపోయింది. 5 శాతం మాత్రమే ఇప్పుడు జరుగుతుంది. హోటల్ అద్దె రూ.2 లక్షలు చెల్లించాలి. సిబ్బంది 30 మంది ఉండేవారు. ప్రస్తుతం 11 మందే విధులు నిర్వర్తిస్తున్నారు. కనీసం జీతాలు, అద్దెలు చెల్లించాలంటేనే గగనమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మళ్లీ సాధారణ స్థితి ఎప్పటికి వస్తుందో తెలియడం లేదు.– నూర్, బౌల్ ఓ చైనా రెస్టారెంట్ ఉద్యోగి, బేగంపేట. గిరాకీ లేక వెలవెలబోతున్న చైనా బజార్లు గోల్కొండ: చైనా బజార్లలో గిరాకీ తగ్గింది. లాక్డౌన్ నేపథ్యంలో అసలే అంతంత మాత్రం గిరాకీ ఉన్న చైనా బజార్లు సరిహద్దులో చైనా దుశ్చర్య కారణంగా భారత్ జవాన్లు వీరమరణం పొందిన తర్వాత చైనా బజార్ల నిర్వాహకులు జాగ్రత్తపడ్డారు. చైనా వస్తువులను బహిష్కరించాలన్న పిలుపు మేరకు గుడిమల్కాపూర్, మెహిదీపట్నం, టోలిచౌకి తదితర ప్రాంతాల్లోని చైనా బజార్ల నిర్వాహకులు రాత్రికి రాత్రే తమ తమ షోరూంలలోని చైనా వస్తువులను తీసేశారు. ప్రస్తుతం ఆ షాపుల్లో ప్లాస్టిక్ సామాగ్రి, పూల కుండీలు, ప్లాస్టిక్ పూలతో పాటు హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలలో తయారైన వస్తువులను మాత్రమే అమ్ముతున్నారు. చైనా వస్తువులను ఇక నుంచి విక్రయించేదిలేదని చైనా బజార్ నిర్వాహకులు అంటున్నారు. ప్రోత్సహిస్తే బావుంటుంది మా దుకాణంలో అమ్మే చైనా వస్తువులను ఇక్కడే తయారు చేయవచ్చు. నేను గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేశాను. ఆదాయం సరిపోక ఈ వ్యాపారంలోకి దిగాను. హోల్‌సేల్ దుకాణదారుల నుంచి వస్తువులు తెచ్చుకొని అమ్ముకుంటాం. రెండు, మూడు దశల్లో తమకు ఈ వస్తువులు చేరుతాయి. చైనాలో ఉపాధి కోసం 72 గంటల్లో బ్యాంకు నుంచి రుణం మంజూరవుతుందని విన్నాను. ఇక్కడ ఆసక్తి, ప్రతిభ ఉన్నా అలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది.– షకీర్, అంబర్‌పేట, చైనాబజార్ మేనేజర్ -
చైనాకు చోరీ ఫోన్లు
=హైఎండ్ మోడల్సే అత్యధికంగా తరలింపు =‘రిటర్న్ మాల్’ ముసుగులో గుట్టుగా రవాణా =పక్కా వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యవహారం =రికవరీలు కష్టంగా మారిన వైనం సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు... చోరీ చేసిన ఫోన్లను యథాతథంగా వినియోగించడం/విక్రయించడం.. ఆ తరవాత... ఐఎంఈఐ నెంబర్ల ట్యాంపరింగ్/క్లోనింగ్ చేసి వాడటం.. ఇప్పుడు.. అత్యంత ఖరీదైన చోరీ సెల్ఫోన్లను గుట్టుగా పొరుగు దేశానికి తరలించడం.. నగరంలో తస్కరణకు గురవుతున్న సెల్ఫోన్లలో అత్యధిక భాగం చైనాకు తరలిపోతున్నాయని పోలీసులు గుర్తించారు. ఫలితంగానే వీటిని రికవరీ చేయడం కష్టంగా మారుతోందని చెప్తున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం నగర వ్యాప్తంగా ఏటా 20 వేల వరకు సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. నగరంలో అనేక చోటామోటా ముఠాలు సెల్‌ఫోన్ పిక్‌పాకెటింగ్, స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. పర్సుల నుంచి సెల్ఫోన్ల వరకు.. పిక్‌పాకెటింగ్ గ్యాంగ్‌లు ఒకప్పుడు పర్సుల్ని మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే ప్లాస్టిక్ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరిగిన తరవాత పర్సులతో ‘గిట్టుబాటు’ కావట్లేదు. అందుకే ఇటీవల కాలంలో పర్సుల్ని వదిలేసి సెల్ఫోన్లపై పడ్డారు. కరుడుగట్టిన రౌడీషీటర్లు ఫయాజ్, ఖైసర్, షేరూ, లతీఫ్ తదితరులు ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒకరి ఏరియాల్లోకి మరోకరు ప్రవేశిస్తుండటంతో అనేక సందర్భాల్లో గ్యాంగ్ వార్స్ జరిగి హత్యల వరకు వెళ్తున్నాయి. గతంలో ఐఎంఈఐ నెంబర్ మార్చేసి.. ప్రతి సెల్‌ఫోన్‌కీ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నెంబర్ ఉంటుంది. ఏ రెండు ఫోన్లకూ ఒకే నెంబర్ ఉండదు. సదరు సెల్‌ఫోన్‌ను ఏ వ్యక్తి వినియోగిస్తున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఐఎంఈఐ నెంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్స్ విపణిలో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లను దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్‌ను వినియోగించి దానికి ఉన్న నెంబర్‌కు బదులు మరో నెంబర్ కేటాయించే వారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్‌ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ ఫోన్లకు వేసే వారు. దీనివల్ల చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఏకంగా సరిహద్దులు దాటిస్తూ.. ఇటీవల కాలంలో ఈ చోరీ సెల్ఫోన్లను కొనుగోలు చేసే మారు వ్యాపారుల పంథా పూర్తిగా మారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ తరహా వ్యాపారాలు ప్రారంభించిన చోరీ మాల్ వ్యాపారస్తులు సిండికేట్స్‌గా చైనా మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆధారాలు సేకరించారు. గడిచిన కొన్నేళ్లుగా చైనా నుంచి పలు వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం సాధారణమై పోయింది. ఇలా వచ్చిన దాంట్లో కొంత వివిధ కారణాల నేపథ్యంలో తిరిగి పంపిస్తారు. వీటితో కలిపి చోరీ ఫోన్లను చైనాకు పంపేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పక్కా ప్రొఫెషనల్ చోరుల నుంచి కొన్న ఖరీదైన హై-ఎండ్ ఫోన్లను మాత్రమే ఇలా పంపిస్తున్నట్లు నిర్ధారిస్తున్నారు. ఈ కారణంగానే చోరీకి గురైన హై-ఎండ్ సెల్ఫోన్లను రికవరీ చేయడం అసాధ్యంగా మారినట్లు చెబుతున్నారు. దీని వెనుకున్న సూత్రధారులపై పోలీసులు కన్నేశారు. జాగ్రత్తలే మేలు.. సెల్ఫోన్లు కోల్పోయిన బాధితులను ఎక్కువగా ఆందోళనకు గురి చేసేది దాని ఖరీదు కంటే అందులో ఉన్న డేటానే. ఫలితంగా ఫోన్ పోతే.. దాదాపుగా అందరితోనూ సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి సెల్‌ఫోన్‌కీ ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. మీ సెల్ఫోన్లో బటన్లు నొక్కితే ఈ నెంబరు డిస్ప్లే అవుతుంది. ఈ సంఖ్యను నోట్ చేసుకోవాలి. ఫోను పోతే దీన్ని బట్టి ఆచూకీ కనుక్కోవచ్చు. మీ సెల్‌ఫోన్‌కు సెక్యూరిటీ లాక్ పెట్టుకోవాలి. ప్రతి ఫోనులోనూ ఉన్న మెనూలో సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో ఇది అందబాటులో ఉంటుంది. దీన్ని సెట్ చేసుకోవడం వల్ల మన ఫోను ఎవరికైనా దొరికినా, దొంగిలించినా.. వినియోగించుకోడం వారి, అందులోని వ్యక్తిగత డేటాను చూడటం వారి వల్లకాదు. ప్రస్తుతం కొన్ని సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు, వెబ్‌సైట్స్ ఫోన్‌బుక్‌తో పాటు కొంత డేటా, ఫొటోలు బ్యాకప్/స్టోర్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటి ద్వారా విలువైన డేటా జాగ్రత్తగా ఉంచుకోవచ్చు ఫోన్ నెంబర్లను సెల్లో ఫీడ్ చేసుకోవడంతో పాటు ఆ డేటా మొత్తాన్ని కంప్యూటర్లో, సీడీల్లో భద్రపరుచు కోవడం/రాసి పెట్టుకోవడం మంచిది