china veerabhadrudu
-
వచ్చే ఏడాది నుంచి పాఠశాలలకు ర్యాంకింగ్ విధానం అమలు
తెనాలి టౌన్: వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరి బి.రాజశేఖర్ తెలిపారు. తెనాలి మండలం కొలకలూరులోని జెడ్పీ హైస్కూల్‌ను పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరి బిరాజశేఖర్, కమిషనర్ వి.చినవీరభద్రుడు, అధికారుల బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పాఠశాలలో చేపట్టిన నాడు–నేడు పనులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించింది. అనంతరం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు చెప్పడమే ముఖ్యమైన అంశంగా ఉపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు. సిలబస్ పూర్తి చేయడం ముఖ్యం కాదని, విద్యార్థులకు చదవడం, రాయడం, అర్థమయ్యేలా బోధించడం ముఖ్యమన్నారు. జనవరి 5వ తేదీన తిరిగి పాఠశాలకు వస్తామని, అప్పటికల్లా విద్యార్థులంతా ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టుల్లో రాసి, చదవగలిగేలా చూడాలన్నారు. వీరి వెంట స్కూల్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్ మురళి, సమగ్ర శిక్షా ఎస్పీడీ కె.సెల్వి, ఎస్ఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాపరెడ్డి, డీఈవో ఆర్ఎస్ గంగాభవాని, సమగ్ర శిక్షా ఏపీసీ ఎం.వెంకటప్పయ్య, డీవైఈవె కె.నారాయణరావు ఉన్నారు. -
టెన్త్ పరీక్షలపై రేపు సీఎం జగన్ కీలక నిర్ణయం: చినవీరభద్రుడు
సాక్షి, అమరావతి: టెన్త్ పరీక్షలపై రేపు సీఎం జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో జులై 26 నుంచి ఆగస్ట్ రెండు వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 6.28 లక్షల మంది విద్యార్ధుల హాజరవుతారని, వారి కోసం 4 వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో 80 వేల మంది ఉపాద్యాయులు, సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. ఈ సారి 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లకే పరీక్షలు నిర్వహించేలా సూచిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే సెప్డెంబర్ 2 లోపు పరీక్షా ఫలితాలు వెలువడేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గత ఏడాది కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయగా, ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులకి నష్టం కలుగుతుందని అదే క్రమంలో కోవిడ్ నిబంధనలు అనుసరించి పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామన్నారు. చదవండి: జూన్ 20 తర్వాత ఏపీలో కర్ఫ్యూ సడలింపులు: సీఎం జగన్ -
టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు బుధవారం రాత్రి తాత్కాలిక తేదీలతో బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించారు. బదిలీలను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ముందు అడహక్ పదోన్నతుల కౌన్సెలింగ్, టీచర్ల సర్దుబాటు ప్రక్రియను ముగించనున్నారు. మొత్తం ప్రక్రియ 43 రోజుల్లో పూర్తయ్యేలా షెడ్యూల్‌ను రూపొందించారు. -
బడికి రాకపోతే చర్యలే..!
నెల్లూరు (టౌన్): జిల్లాలోని పాఠశాలల్లో 100 శాతం హాజరు ఉండాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. మరో మూడు రోజుల సమయమిస్తామని, ఆలోపు 100 శాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా ఎలాంటి సమాచారం లేకుండా పాఠశాలలకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే కావలి, గూడూరు, నెల్లూరు డివిజన్ల వారీగా పాఠశాలలకు రాని ఉపా«ధ్యాయుల వివరాలను ఆయా డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు సేకరించారు. జిల్లాలో రెండు వేల మందికిపైగా ఉపాధ్యాయులు పాఠశాలలకు గైర్హాజరవుతున్నారు. అయితే వీరిలో దాదాపు వెయ్యి మంది వరకు కంటైన్మెంట్ జోన్లలో ఉండటం, దీర్ఘకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. వీరికి పాఠశాలల హాజరుకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. మరో వెయ్యి మందికి పైగా టీచర్లు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. వీరికి త్వరలో మెమోలు జారీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా శుక్రవారం మ«ధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల మధ్య పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఆందోళనలో ఉపాధ్యాయులు ఉన్నారు. -
టెన్త్ ఎగ్జామ్స్ : ఆ వదంతులు నమ్మొద్దు!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదోవ తరగతి పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమంలో వస్తున్న వదంతులు నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు విజ్ఞప్తి చేశారు. రోజుకు ఒకరకంగా పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫేక్ న్యూస్‌లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నారు. మొన్న టైమ్ టేబుల్ విషయంలో వదంతులు సృష్టించగా, నేడు ఏకంగా తన పేరును ఫోర్జరీ చేసి పరీక్ష తేదీలను ఆన్లైన్లో పెట్టారని తెలిపారు. (‘అప్పుడే పదో తరగతి పరీక్షల నిర్వహణ’) పదవ తరగతి పరీక్షలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇలాంటి వదంతులు సృష్టించడం సైబర్ నేరాల కిందకి వస్తోందని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని వారిని ఇలా గందరగోళానికి గురిచేయడం సమంజసం కాదన్నారు. ప్రజలెవరు ఈ వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని వీరభద్రుడు కోరారు. (పరీక్షలు జరుగుతాయి.. చదువుకోండి) -
15 నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఈనెల 15వ తేదీ నుంచి ‘ఒంటి పూట బడులు’ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ వి.చినవీరభద్రుడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒంటిపూట బడుల సమయంలో అనుసరించాల్సిన విధులను అందులో పేర్కొన్నారు. - ఒంటిపూట బడులపై సమయ పట్టికను తప్పనిసరిగా అన్ని పాఠశాలలు అమలు చేయాలి. - ఏప్రిల్ రెండో శనివారం సెలవు ఉండదు. - వేసవి ఎండల దృష్ట్యా పాఠశాలల్లో మంచినీటిని అందుబాటులో ఉంచాలి. - ఎట్టి పరిస్థితుల్లోనూ తరగతులను ఆరుబయట, చెట్లకింద నిర్వహించరాదు. - విద్యార్థులకు వడదెబ్బ తగలకుండా స్కూళ్లలో ఓరల్ రీ–హైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలి. - మధ్యాహ్న భోజనాన్ని ఒంటిపూట బడి సమయం ముగిసేలోగా తయారు చేయించి విద్యార్థులకు అందించాలి. - ప్రాథమిక పాఠశాలలు ఉదయం 7–45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు 6 పీరియడ్లు పనిచేయాలి. - ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశా లలు ఉదయం 7–45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు 6 పీరియడ్లు జరపాలి. 16 నుంచి బ్రిడ్జికోర్సులు ఎలిమెంటరీ విద్యార్థులకు ఈనెల 16 నుంచి నిర్వహించే బ్రిడ్జి కోర్సులకు సంబంధించిన కొన్ని విధివిధానాలను విద్యాశాఖ అధికారులకు సూచించింది. ఇందుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆడుతూ పాడుతూ ఆయా అంశాలను నేర్చుకోవడం ద్వారా పిల్లల్లో చదువుపై మరింత అభిరుచిని కలిగించేందుకు ప్రభుత్వం ఈ బ్రిడ్జికోర్సును ఏర్పాటు చేసింది. - పిల్లల్లోని సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఈనెల 16న విద్యార్థులకు బేస్‌లైన్ టెస్టు ఉంటుంది. పరీక్ష మొత్తం 50 మార్కులకు నిర్వహిస్తారు. - బేస్‌లైన్ టెస్టులో సున్నా వచ్చినా టీచర్లకు, విద్యార్థులకూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. బేస్‌లైన్ టెస్టు విద్యార్థులు ఏ లెవెల్లో ఉన్నారో తెలుసుకోవడానికి మాత్రమే. - బ్రిడ్జి కోర్సు జరిగే 30 రోజుల తర్వాత విద్యార్థుల్లో ఎంత మార్పు వచ్చిందో చూడాలి. ఇందుకు ఏప్రిల్ 22న ఎండ్‌లైన్ పరీక్ష జరుగుతుంది. - సింగిల్ టీచర్ ఉన్న చోట కూడా ఈ బ్రిడ్జికోర్సు కొనసాగించాలి. - ఒకటి రెండు తరగతులకు ఈవీఎస్ ఉండదు. - బ్రిడ్జి కోర్సు సమయంలో విద్యార్థులకు నోట్‌బుక్‌లతో అవసరం లేదు. వర్కుబుక్స్‌ను, టీచర్లకు హ్యాండ్ బుక్స్‌ను విద్యాశాఖ అందిస్తుంది. - ఏప్రిల్ 23న పేరెంట్స్ యాజమాన్య కమిటీ (పీఎంసీ) సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రగతిని తల్లిదం డ్రులకు తెలియజేయాలి. -
‘గిరి’లోనే జనుల ఆనందం!
భారత రాజ్యాంగం 5వ, 6వ షెడ్యూళ్లు గిరిజనులకు రక్షణ కల్పిస్తున్నాయి. రాష్ట్ర గిరి జనులు 5వ షెడ్యూల్ పరిధిలో ఉన్నారు. మన రాష్ట్రం నుంచే షెడ్యూల్డ్ ప్రాంతం అనే ఆలోచన వచ్చింది. క్రీ.శ.1874వ సంవత్సరం లో బ్రిటిష్ వలస పాలకులు తమ ప్రాంతం లోకి, జీవితంలోకి ప్రవేశించడాన్ని గంజాం, విశాఖ ప్రాంతపు గిరిజనులు వ్యతిరేకించారు. వలస పాలకులు వారి దేశాల్లోని పథకాలను, ఆచారాలను ప్రవేశపెట్టడాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. బ్రిటిష్ వారు తమ రవి అస్త మించని సామ్రాజ్యంలో అన్ని ఖండాలనూ పరిపాలించారు. కాని, ఎక్కడా ఎదురుకాని వ్యతిరేకత మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే వారి అనుభవంలోకి వచ్చింది. గాంధీ ఆఫ్రికాలో బ్రిటిష్ వారిపై చేసిన ఆందోళనలకు కొన్ని దశాబ్దాలకు పూర్వమే రాష్ట్ర గిరిజనులు యానాం-విశాఖ ప్రాంతం లో తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఫలి తంగా రాష్ట్రంలోని ఫలానా ప్రాంతాలు జాతీ య ఆర్ధికరంగానికి, విద్యావిధానానికి, అధి కార యంత్రాంగానికి ‘దూరం’గా ఉన్న ప్రాం తాలుగా ప్రకటించారు. బ్రిటిష్ పాలనను భారతదేశ మైదాన ప్రాంతం ఆహ్వానించింది. గిరిజనులు ఎదుర్కొన్నారు. ‘తెల్లవాడు’ కాబట్టి గిరిజనులు వ్యతిరేకించలేదు. గిరిజ నుల దృష్టిలో బ్రిటిష్ వాడికి స్థానిక భూస్వా మికి తేడా లేదు. వారి పద్ధతులకు వ్యతిరేకం అయినప్పుడు ప్రతిఘటించి తీరుతారు. గిరి జనుల పద్ధతి ఏదైనా ప్రత్యక్షమే. వారిది ప్రత్య క్ష ప్రజాస్వామ్యం. అందరూ మాట్లాడుకుం టారు. ఇంగ్లండ్-అమెరికా- ఇండియాల వం టి పరోక్ష ప్రజాస్వామ్యం కాదు. గిరిజన న్యాయవ్యవస్థ ప్రపంచంలోని అన్ని న్యాయ వ్యవస్థలకంటే గొప్పది. తమ సంఘంలో సభ్యులు కాని వ్యక్తులు తమకు న్యాయం ఎలా చెబుతారు అని గిరిజనుల ప్రశ్న! ‘వారి ప్రాంతంలో వారి చట్టాలనే అనుమతిద్దాం’ అని బ్రిటిష్ వాడు తీసుకున్న నిర్ణయమే గిరిజనుల హక్కుల రక్షణకు ‘కార్నర్ స్టోన్ (బొడ్రాయి)’ అయింది. రాష్ట్రంలో 5,800 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 35 గిరిజన తెగలున్నాయి. ైగిరిజ నుల సంస్కృతి భౌగోళికమైనది. శ్రీశైలంకు సమీపంలోని చెంచుల నివాస గ్రామాలు మన్ననూరుకు మేకలబండకు వైవిధ్యం ఉం దని 12వ శతాబ్దపు ఆధారాలను బట్టి తెలు స్తుంది. సమూహాలుగా వేర్వేరుగా జీవించి నప్పటికీ వారి ఆధ్యాత్మిక ప్రపంచం విశాల మైనది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు కలసి ఉన్న శ్రీశైలం అడవుల్లోని అణువణువూ వారికి ‘శివ’ స్వరూపమే! నది-చెట్టు-పిట్ట- పుట్ట ఏకత్వంలో భాగమే! పాల్కురికి సోమన ‘శ్రీప ర్వతపు మహిమ’ను వర్ణిస్తూ ‘చెంచు సద్భ క్తు’లు అని వర్ణించారు. గిరిజనుల ఆమోదంతో నిర్ణయాలు తీసు కోవాలని చెప్పే ‘ట్రైబల్ సబ్‌ప్లాన్’ సక్ర మంగా అమలు కావడంలేదు. నకిలీ గిరిజన సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తోన్న వారు రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. తెలుగులో చక్క ని కవిత్వం రాసిన గిరిజన బాలలు ఉన్నత విద్యకు సహాయం కోసం ఎదురు చూస్తు న్నారు. నదిపక్కన నివసిస్తూ గిరిజనులు చేప లు పట్టుకోలేరు. ప్రభుత్వాలు అమలుపరచా లనుకునే ‘ఆహారభద్రత’ వారి జీవనశైలికి సరి పోదు. గిరిజనులు శ్రామికులు లేదా కూలీలు కాదు. ఆహారాన్ని సేకరించుకునే వారు మాత్ర మే. అడవిలో ఏది తీసుకోవాలో ఏది తీసు కోకూడదో వారికి తెలుసు. ప్రభుత్వాలు చే యాల్సింది అందుకు వారిని అనుమతించడమే! గిరిజనులకు సవర భాషలో విద్యనేర్పిన దివంగత గిడుగు రామ్మూర్తి తాను చూసిన ఒక సంఘటనను ఉదహరించారు. ఒక గిరి జన స్త్రీ, మరొక పురుషుడు ముందు వెళ్తు న్నారు. వారి వెనుక పశువుల మందతో మరో గిరిజనుడు సాగుతున్నాడు. ‘ఆ ముందు వెళ్తు న్నదెవరూ?’ అని గిడుగు వారి భాషలోనే ప్రశ్నించాడు. ‘నిన్నటి వరకూ నా భార్య. అతడు రేపు ఆమెకు కాబోయే భర్త. పశువులు ఆమెవి. వారి కొత్త ఇంటికి చేర్చాలి కదా’ అన్నాడు మాజీ భర్త! ఆడ-మగ సమానతకు, ఆర్ధిక సమానత్వానికి ఇంతకంటే మంచి ఉదా హరణ ఏ ‘అభివృద్ధి’ చెందిన సమాజంలో చూడగలం? అడవులను గిరిజనులకంటే మిన్నగా ఎ వరూ కాపాడుకోలేరు. వారికి కేటాయించిన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రాజ్యాధికారం కలిగి ఉండటం ద్వారా మాత్రమే వారి సమస్యలు పరిష్కారమవుతాయి. గిరిజనుల ఆనందం లోనే సభ్యసమాజం ఆనందం ఉంది. గిరిజ నులతో మమేకమై జీవించే ఉద్యోగులను ప్రభుత్వం ఎంపిక చేసుకోవాలి. గర్భవతి అయిన గిరిజనస్త్రీని గుర్తించి, సకాలంలో వైద్యసేవలు అందించాలి. వారి ఆరోగ్యానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. - వాడ్రేవు చిన వీరభద్రుడు, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ అడిషనల్ డెరైక్టర్ (శ్రీశైలంలో సెప్టెంబర్ 8-9 తేదీల్లో ‘ఇతిహాస సంకలన సమితి’ నిర్వహించిన వర్క్‌షాప్‌లో చిన వీరభద్రుడు ఇచ్చిన ప్రసంగంలోని కొన్ని భాగాలు)