‘గిరి’లోనే జనుల ఆనందం! | Tribals feel happy living in forests only! | Sakshi
Sakshi News home page

‘గిరి’లోనే జనుల ఆనందం!

Published Wed, Oct 9 2013 2:42 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

‘గిరి’లోనే జనుల ఆనందం! - Sakshi

‘గిరి’లోనే జనుల ఆనందం!

భారత రాజ్యాంగం 5వ, 6వ షెడ్యూళ్లు గిరిజనులకు రక్షణ కల్పిస్తున్నాయి. రాష్ట్ర గిరి జనులు 5వ షెడ్యూల్ పరిధిలో ఉన్నారు. మన రాష్ట్రం నుంచే షెడ్యూల్డ్ ప్రాంతం అనే ఆలోచన వచ్చింది. క్రీ.శ.1874వ సంవత్సరం లో బ్రిటిష్ వలస పాలకులు తమ ప్రాంతం లోకి, జీవితంలోకి ప్రవేశించడాన్ని గంజాం, విశాఖ ప్రాంతపు గిరిజనులు వ్యతిరేకించారు. వలస పాలకులు వారి దేశాల్లోని పథకాలను, ఆచారాలను ప్రవేశపెట్టడాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. బ్రిటిష్ వారు తమ రవి అస్త మించని సామ్రాజ్యంలో అన్ని ఖండాలనూ పరిపాలించారు. కాని, ఎక్కడా ఎదురుకాని వ్యతిరేకత మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే వారి అనుభవంలోకి వచ్చింది.
 
 గాంధీ ఆఫ్రికాలో బ్రిటిష్ వారిపై చేసిన ఆందోళనలకు కొన్ని దశాబ్దాలకు పూర్వమే రాష్ట్ర గిరిజనులు యానాం-విశాఖ ప్రాంతం లో తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఫలి తంగా రాష్ట్రంలోని ఫలానా ప్రాంతాలు జాతీ య ఆర్ధికరంగానికి, విద్యావిధానానికి, అధి కార యంత్రాంగానికి ‘దూరం’గా ఉన్న ప్రాం తాలుగా ప్రకటించారు. బ్రిటిష్ పాలనను భారతదేశ మైదాన ప్రాంతం ఆహ్వానించింది. గిరిజనులు ఎదుర్కొన్నారు. ‘తెల్లవాడు’ కాబట్టి గిరిజనులు వ్యతిరేకించలేదు. గిరిజ నుల దృష్టిలో బ్రిటిష్ వాడికి స్థానిక భూస్వా మికి తేడా లేదు. వారి పద్ధతులకు వ్యతిరేకం అయినప్పుడు ప్రతిఘటించి తీరుతారు. గిరి జనుల పద్ధతి ఏదైనా ప్రత్యక్షమే. వారిది ప్రత్య క్ష ప్రజాస్వామ్యం. అందరూ మాట్లాడుకుం టారు.
 
 ఇంగ్లండ్-అమెరికా- ఇండియాల వం టి పరోక్ష ప్రజాస్వామ్యం కాదు. గిరిజన న్యాయవ్యవస్థ ప్రపంచంలోని అన్ని న్యాయ వ్యవస్థలకంటే గొప్పది. తమ సంఘంలో సభ్యులు కాని వ్యక్తులు తమకు న్యాయం ఎలా చెబుతారు అని గిరిజనుల ప్రశ్న!  ‘వారి ప్రాంతంలో వారి చట్టాలనే అనుమతిద్దాం’ అని బ్రిటిష్ వాడు తీసుకున్న నిర్ణయమే గిరిజనుల హక్కుల రక్షణకు ‘కార్నర్ స్టోన్ (బొడ్రాయి)’ అయింది.  
 
 రాష్ట్రంలో 5,800 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 35 గిరిజన తెగలున్నాయి. ైగిరిజ నుల సంస్కృతి భౌగోళికమైనది. శ్రీశైలంకు సమీపంలోని చెంచుల నివాస గ్రామాలు మన్ననూరుకు మేకలబండకు వైవిధ్యం ఉం దని 12వ శతాబ్దపు ఆధారాలను బట్టి తెలు స్తుంది. సమూహాలుగా వేర్వేరుగా జీవించి నప్పటికీ వారి ఆధ్యాత్మిక ప్రపంచం విశాల మైనది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు కలసి ఉన్న శ్రీశైలం అడవుల్లోని అణువణువూ వారికి ‘శివ’ స్వరూపమే! నది-చెట్టు-పిట్ట- పుట్ట ఏకత్వంలో భాగమే! పాల్కురికి సోమన ‘శ్రీప ర్వతపు మహిమ’ను వర్ణిస్తూ ‘చెంచు సద్భ క్తు’లు అని వర్ణించారు.
 
 గిరిజనుల ఆమోదంతో నిర్ణయాలు తీసు కోవాలని చెప్పే ‘ట్రైబల్ సబ్‌ప్లాన్’ సక్ర మంగా అమలు కావడంలేదు. నకిలీ గిరిజన సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తోన్న వారు రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. తెలుగులో చక్క ని కవిత్వం రాసిన గిరిజన బాలలు ఉన్నత విద్యకు సహాయం కోసం ఎదురు చూస్తు న్నారు. నదిపక్కన నివసిస్తూ గిరిజనులు చేప లు పట్టుకోలేరు. ప్రభుత్వాలు అమలుపరచా లనుకునే ‘ఆహారభద్రత’ వారి జీవనశైలికి సరి పోదు.  గిరిజనులు శ్రామికులు లేదా కూలీలు కాదు. ఆహారాన్ని సేకరించుకునే వారు మాత్ర మే.  అడవిలో ఏది తీసుకోవాలో ఏది తీసు కోకూడదో వారికి తెలుసు. ప్రభుత్వాలు చే యాల్సింది  అందుకు వారిని అనుమతించడమే!
 
 గిరిజనులకు సవర భాషలో విద్యనేర్పిన దివంగత  గిడుగు రామ్మూర్తి  తాను చూసిన ఒక సంఘటనను ఉదహరించారు. ఒక గిరి జన స్త్రీ, మరొక పురుషుడు ముందు వెళ్తు న్నారు. వారి వెనుక పశువుల మందతో మరో గిరిజనుడు సాగుతున్నాడు. ‘ఆ ముందు వెళ్తు న్నదెవరూ?’ అని గిడుగు వారి భాషలోనే ప్రశ్నించాడు. ‘నిన్నటి వరకూ నా భార్య. అతడు రేపు ఆమెకు కాబోయే భర్త. పశువులు ఆమెవి. వారి కొత్త ఇంటికి చేర్చాలి కదా’ అన్నాడు మాజీ భర్త! ఆడ-మగ సమానతకు, ఆర్ధిక సమానత్వానికి ఇంతకంటే మంచి ఉదా హరణ ఏ ‘అభివృద్ధి’ చెందిన సమాజంలో చూడగలం?
 
 అడవులను గిరిజనులకంటే మిన్నగా ఎ వరూ కాపాడుకోలేరు. వారికి కేటాయించిన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రాజ్యాధికారం కలిగి ఉండటం ద్వారా మాత్రమే వారి సమస్యలు పరిష్కారమవుతాయి. గిరిజనుల ఆనందం లోనే  సభ్యసమాజం ఆనందం ఉంది. గిరిజ నులతో మమేకమై జీవించే ఉద్యోగులను ప్రభుత్వం ఎంపిక చేసుకోవాలి. గర్భవతి అయిన గిరిజనస్త్రీని గుర్తించి, సకాలంలో వైద్యసేవలు అందించాలి. వారి ఆరోగ్యానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.
 
 - వాడ్రేవు చిన వీరభద్రుడు, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ అడిషనల్ డెరైక్టర్
 (శ్రీశైలంలో సెప్టెంబర్ 8-9 తేదీల్లో ‘ఇతిహాస సంకలన సమితి’ నిర్వహించిన వర్క్‌షాప్‌లో చిన వీరభద్రుడు ఇచ్చిన ప్రసంగంలోని కొన్ని భాగాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement