China virus
-
దేశంలో పెరుగుతున్న HMPV కేసులు
-
Omicron: ఆ సినిమా పోస్టర్ల కథేంటంటే..
Fact Check On Omicron Movie Posters Viral కొత్తగా ఏదైనా పుట్టుకొచ్చిందంటే.. దాని పూర్వాపరాలను తవ్వితీయడం, రంధ్రాన్వేషణ చేయడం అందరికీ అలవాటైన పనే. కరోనా విజృంభణ తర్వాత లాక్డౌన్ ఎఫెక్ట్ ఏమోగానీ.. అప్పటి నుంచి ఇలాంటి వ్యవహారాలు మరింత పెరిగాయి. తాజాగా ఒమిక్రాన్ (ఒమైక్రాన్) వేరియెంట్ పేరు తెర మీదకు వచ్చిన తరుణంలో.. తెర మీద ఆడిన ‘ఒమిక్రాన్’ సినిమా గురించి చర్చ మొదలైంది. గురువారం సాయంత్రం గూగుల్ ట్రెండ్‌లో టాప్-25 సెర్చ్ కంటెంట్‌లో మూడు ఒమిక్రాన్ సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. విశేషం ఏంటంటే.. అమెరికాలో ఇది ఒక సినిమాకు సంబంధించిన సెర్చింగ్ ద్వారా ట్రెండ్‌లోకి రావడం. 1963లో ‘ఒమిక్రాన్’ పేరుతో ఓ సినిమా వచ్చింది. అది ఇటాలియన్ సై-ఫై సినిమా. కథ.. ఏలియన్ బాడీస్నాచర్స్ చుట్టూ తిరుగుతుంటుంది. అంతేకానీ పాండెమిక్స్ గురించి కాదు. అలాంటప్పుడు ఈ సినిమా ఎలా ట్రెండ్ అయ్యిందంటారా? ఐర్లాండ్‌కు చెందిన డైరెక్టర్ బెక్కీ చీట్లే ఈ ఇటాలియన్ సై-ఫై క్లాసిక్ సినిమా టైటిల్‌ను మరోలా వాడేసింది. ‘ది ఒమిక్రాన్ వేరియెంట్’ పేరుతో సినిమా పోస్టర్లను ఫొటోషాప్‌తో ఎడిట్ చేసి.. కింద ‘ది డే ది ఎర్త్ వాజ్ టర్న్డ్ ఇన్టు ఏ సిమెట్రీ’(భూమి మొత్తం శ్మశానంగా మారిన రోజు) అంటూ ఓ క్యాప్షన్‌ను జత చేసింది. అంతే.. అది నిజమని అనుకుని చాలామంది అలాంటి ఓ సినిమా ఉందని, అది ఆ టైంలోనే ప్రస్తుత పరిస్థితులను ఊహించిందంటూ పొరపడి తెగ వైరల్ చేశారు. విశేషం ఏంటంటే.. డైరెక్టర్ ఆర్జీవీ లాంటి సినీ సెలబ్రిటీలు కూడా ఆ పోస్టర్లను తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. అయితే అవి విపరీతంగా వైరల్ కావడం దృష్టికి రావడంతో బెక్కీ చీట్లే మళ్లీ స్పందించింది. తాను సరదాగా వాటిని ఎడిట్ చేశానని, 70వ దశకంలో వచ్చిన సినిమాల పోస్టర్లను అలా చేయించానని, కంగారు పడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టత ఇచ్చింది. Believe it or faint ..This film came In 1963 ..Check the tagline 😳😳😳 pic.twitter.com/ntwCEcPMnN — Ram Gopal Varma (@RGVzoomin) December 2, 2021 ఇక 1957 సూపర్ హీరో కామిక్ స్ట్రిప్ ‘ఫాంటమ్’లోని ఓ సీన్ డైలాగ్ కూడా ఇలాగే వైరల్ అవుతోంది. ‘నేనెలా కట్టుకున్నానో అలా కట్టుకో. ఇది నిన్ను ఈ లోయలోని చైనా వైరస్ నుంచి కాపాడుతుంది’ అంటూ ఓ రైటప్ ఉందక్కడ. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ కాగా.. అది ఫేక్ అని తేలింది. వాస్తవానికి అక్కడ డైలాగ్ ‘స్లీప్ డెత్’ అని ఉంటుంది. సో.. కరోనా వైరస్‌కు ముడిపెట్టి ఎడిట్ చేసిన ఫొటో అలా వైరల్ అవుతోందన్న మాట!. -
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలోకి చైనా వైరస్
ప్రమాదంలో కోటి ఫోన్లు.. భారత్‌లో 13 లక్షలు న్యూఢిల్లీ: చైనా నేరగాళ్లు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లపై పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కోటి ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలోకి హమ్మింగ్‌బ్యాడ్ మాల్వేర్ (హాని తలపెట్టే సాఫ్ట్వేర్)ను జొప్పించారు. ఇంగ్‌మాబ్ పేరుతో ఉన్న నేరగాళ్ల ముఠా ఈ పనికి పాల్పడినట్టు సైబర్ భద్రతా సంస్థ చెక్ పాయింట్ వెల్లడించింది. ఈ మాల్వేర్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లను తెరవెనుక ఆపరేట్ చేస్తూ మోసపూరితంగా నెలకు రూ.2 కోట్లకుపైగా ప్రకటనల ఆదాయాన్ని గడిస్తున్నారని తెలిపింది. ఒక్కసారి ఈ మాల్వేర్ ఫోన్లోకి ప్రవేశిస్తే నియంత్రణ చైనా ముఠా చేతికి వెళ్లిపోతుంది. కానీ, ఆ విషయం యూజర్‌కు తెలియదు. అంతేకాదు, ఈ మాల్వేర్ అదనంగా మోసపూరిత యాప్‌లను కూడా ఇన్స్టాల్ చేస్తోందని చెక్‌పాయింట్ హెచ్చరించింది. యాడ్ కంపెనీ ముసుగులో అక్రమ పనులు నిజానికి ఇంగ్‌మాబ్ చైనాలో ఓ ప్రకటనల విశ్లేషణ కంపెనీని నిర్వహిస్తుండగా... ఇందులో 25 మంది ఉద్యోగులు మొత్తం నాలుగు విభాగాల్లో పనిచేస్తున్నారు. అయితే, దీనికి సంబంధించిన ఉద్యోగులను, టెక్నాలజీని హమ్మింగ్‌బ్యాడ్ పేరుతో హానికారక కాంపోనెంట్స్‌ను అభివృద్ధి చేసేందుకు వినియోగిస్తున్నట్టు చెక్‌పాయింట్ వెల్లడించింది. తమ నియంత్రణలోకి వచ్చిన స్మార్ట్ఫోన్ల ద్వారా వ్యాపార, ప్రభుత్వ ఏజెన్సీలపై చైనా గ్యాంగ్ దాడులకు పాల్పడుతోందని, ఇతర నేరగాళ్లకు సైతం ఈ అనుసంధానాన్ని బ్లాక్ మార్కెట్లో అడ్డంగా విక్రయిస్తోందని చెక్‌పాయింట్ సంస్థ వెల్లడించింది. ఇంగ్‌మాబ్ నియంత్రణలోకి వెళ్లిన కోటి ఫోన్లలో డేటా ప్రమాదంలో పడినట్టేనని పేర్కొంది. ఈ మాల్వేర్ బారిన పడిన కోటిఫోన్లలో చైనాలో 16 లక్షలు, భారత్‌లో 13.5 లక్షలు, ఫిలిప్పీన్స్‌లో 5.20లక్షలు, మిగిలినవి అమెరికా, పాకిస్తాన్, ఉక్రెయిన్, రొమేనియా, అల్జీరియా దేశాల్లో ఉన్నాయి. ఈ గ్రూపు చేతుల్లోకి వెళ్లిన ఫోన్లలో 50% కిట్క్యాట వెర్షన్‌తో నడిచేవి కాగా, 40 శాతం జెల్లీబీన్ వెర్షన్‌తో ఉన్నవి. ఒక్క శాతం మాత్రమే తాజా వెర్షన్ మార్ష్‌మాలో వినియోగిస్తున్నవి. కోటి మంది మొబైల్ యూజర్లలో 85 మంది ఇప్పటికే గ్రూప్‌నకు చెందిన హానికారక యాప్స్‌ను కూడా డౌన్లోడు చేసుకున్నారు.