chinajeeyar swamy
-
నిగర్వి.. పెద్దల మాటను గౌరవించే వ్యక్తి జగన్
సాక్షి, హైదరాబాద్: ‘విద్య, ధనం, వయసు, అధికారం కలిగి ఉన్న వారు ఇతరుల సలహాలు తీసుకోరు. కానీ జగన్‌కు ఈ నాలుగు ఉన్నప్పటికీ ఎలాంటి గర్వం లేదు. పెద్దల మాటను గౌరవిస్తారు. పెద్దలు ఇచ్చే సూచనలు, సలహాలను స్వీకరిస్తారు.. పాటిస్తారు. జగన్మోహన్రెడ్డి మరింత ఉన్నత స్థానానికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా..’ అని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించేందుకు వచ్చిన ఏపీ సీఎం జగన్‌ను మైహోం ఎండీ రామేశ్వర్రావు జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. యువకుడు జగన్ ధర్మ పరిరక్షణకు, సమాజంలో సమానత కోసం ఏం కావాలో తెలుసుకొని దాని కోసం కృషి చేస్తున్న వ్యక్తి అని అన్నారు. ముచ్చింతల్ క్షేత్రంలో తీర్థప్రసాదాలను స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు తెలుసని, ముఖ్యమంత్రి కాక ముందు ఆయన తనను కలిశారని గుర్తు చేసుకున్నారు. ఏ పాలకుడికైనా ఉండాల్సింది అన్ని వర్గాల ప్రజలను, వారి ప్రయోజనాలను సమానంగా చూడటమేనని.. జగన్, వైఎస్సార్‌ల ఆలోచన ఇదేనని చెప్పారు. ‘వారు అన్ని వర్గాల వారి హక్కులను కాపాడుతూ, వారి సంక్షేమానికి పాటుపడాలని భావించారు. ఏపీలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న జగన్ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయా. సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహ సందర్శనకు సమాజంలో అన్ని వర్గాలకు మంచి జరగాలని కోరుకున్న వారిని ఆహ్వానించాం. ముచ్చింతల్ క్షేత్రంలో తీర్థప్రసాదాలను స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమానత్వం పట్ల ఉన్న దృఢ సంకల్పంతో జగన్ రావడం సంతోషకరం’ అని చినజీయర్ చెప్పారు. నెల్సన్ మండేలా నల్ల, తెల్ల జాతీయుల మధ్య సమానత్వం కోసం పాటుపడ్డారని, మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఇదే తరహాలో కృషి చేశారన్నారు. ‘హాల్ ఆఫ్ ఫేమ్’ పేరిట సమానత్వం కోసం ప్రపంచవ్యాప్తంగా పనిచేసిన వారి చిత్రపటాలను ఏర్పాటు చేస్తామని, ఆ హాల్లోకి ప్రవేశించి ఆ చిత్రాలను స్పృశించగానే వారి గురించి హెడ్‌ఫోన్స్ ద్వారా వినే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమానత్వం కోసం కృషి చేసిన 150 మందిని ఇప్పటివరకు గుర్తించామన్నారు. వీరందరి కన్నా ముందు వెయ్యేళ్ల క్రితమే సామాజిక, ఆర్థిక, లింగ వివక్షలపై పోరాడి సమానత్వం కోసం తపించిన మహనీయుడు రామానుజాచార్యుడని చినజీయర్ స్వామి కీర్తించారు. పాలకులు, అధికారులు, మేధావులు, సాధారణ ప్రజల ఆలోచనలు ఒకేవిధంగా ఉండవని, అయితే రామానుజాచార్యులు ఈ నలుగురి ఆలోచనలను ఒకే తోవలోకి తీసుకొచ్చారని కొనియాడారు. చినజీయర్ స్వామికి దండ వేస్తున్న సీఎం జగన్ చెవిరెడ్డి దగ్గరుండి సేవలు చేశారు జగన్ తొలిసారి క్షేత్రానికి వచ్చినా, ఆయన తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా రోజుల నుంచే ముచ్చింతల్‌లో ఏర్పాట్లు చూశారని చినజీయర్ స్వామి చెప్పారు. ఉత్సవాలకు ముందే సంక్రాంతి నుంచి ఏర్పాట్లు చూశారన్నారు. ‘మంచిగా చూడవయ్యా..’ అంటూ పూలు, పండ్ల అలంకరణలన్నీ దగ్గరుండి చేయించారన్నారు. ‘మా బాస్ చెప్పారు... చేస్తున్నాం’ అని చెప్పేవారని, ఆయనను జగన్ ప్రోత్సహించడం ముదావహమని చినజీయర్ అన్నారు. ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, స్వర్ణమ్మల సేవలను చినజీయర్ స్వామి అభినందించారు. వీరందరికి రామేశ్వర్ రావు జ్ఞాపికలను అందజేశారు. సీఎం జగన్‌ను ఆశీర్వదిస్తున్న చినజీయర్ స్వామి (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మళ్లీ ‘భువికి’ రామానుజులు!
సాక్షి, హైదరాబాద్: జాతులు.. వర్గాలు.. ఆడ.. మగ.. మనిషి.. జంతువు.. అంతా సమానమే.. పరమాత్మ దృష్టి అన్నీ ఒకటే అంటూ సమానత్వాన్ని చాటిన సమతా మూర్తి శ్రీరామానుజాచార్యులు మరోసారి మనముందు వెలుస్తున్నారు. ఓవైపు భారీ రామానుజుడి విగ్రహం.. మరోవైపు ఆధ్యాత్మిక పరిమళాలు, సంభ్రమాశ్చర్యాలను కలిగించే సాంకేతిక విన్యాసాలు.. అబ్బురపరిచే రాతి శిల్పాలతో శ్రీరామానుజ సహస్రాబ్ధి ప్రాంగణం సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ శ్రీరామనగరంలో నిర్మించిన ఈ మహా ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలా 2 నుంచి 14 వరకు ‘శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం’పేరిట ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్ద సంఖ్యలో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, పలు రంగాల ప్రముఖులు అందులో పాల్గొననున్నారు. 216 అడుగుల ఎత్తయిన రామానుజుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని ప్రారంభించనుండగా.. ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందిన 54 అంగుళాల రామానుజుల నిత్యపూజామూర్తిని 13న రాష్ట్రప్రతి తొలి దర్శనంతో ప్రారంభిస్తారు. సీఎం కె.చంద్రశేఖరరావు ఈ వేడుకలను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఎన్నో ప్రత్యేకతలతో.. ♦ రామానుజుల ప్రాంగణం ఎన్నో ప్రత్యేకతలకు నెలవుగా నిలుస్తోంది. చినజీయర్ స్వామి చిరకాల వాంఛను నిజం చేస్తూ 2016లో దాదాపు రూ.వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను మేళవించి 2,700 శిల్పులు ఈ రాతి కట్టడాన్ని సిద్ధం చేశారు. ♦ ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న అతి ఎత్తయిన లోహ విగ్రహంగా శ్రీరామానుజుల విగ్రహం నిలవనుంది. ఇందులో పద్మాసనంలో ఉన్న రామానుజుల విగ్రహం 108 అడుగులుండగా.. దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మపీఠం 27 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. స్వామివారి పాదుకలతో ఉండే శఠారి 18 అడుగులు ఉంది. ఈ లోహ విగ్రహం బరువు 1,800 టన్నులు. దీన్ని చైనాకు చెందిన ఏరోసన్ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో.. చినజీయర్ స్వామి సూచనల ప్రకారం రూపొందించారు. 200 మం ది చైనా నిపుణులు 9 నెలల పాటు శ్రమించి.. 1,600 భాగాలుగా విగ్రహాన్ని తయారు (క్యాస్టింగ్)‡ చేశారు. వాటిని ఇండియాకు తీసుకొచ్చాక 60మంది చైనా నిపుణులు కలిపి తుదిరూపు ఇచ్చారు. వాతావరణంలో ఏర్పడే మార్పులు, పరిణామాలను తట్టుకుని వెయ్యేళ్లు నిలిచేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 108 పుణ్యక్షేత్రాల దర్శన అనుభూతితో.. ♦ ఈ క్షేత్రంలో రామానుజుల మహా విగ్రహం చుట్టూ.. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాల గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా ప్రధాన వైష్ణవాలయాలు ఇందులో ఉన్నాయి. వీటిని అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. ♦ ఈ క్షేత్రంలో ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించగానే ఎదురుగా 45 అడుగుల ఎత్తుతో ఉండే డైనమిక్ ఫౌంటెయిన్ స్వాగతం పలుకుతుంది. అష్టదశ పద్మాకృతిలో ఉండే ఈ ఫౌంటెయిన్‌లో పద్మపత్రాలు విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఎనిమిది రకాల జీవరాశులు నీటిని విరజిమ్ముతుండగా.. పద్మపత్రాల మధ్య నుంచి రామానుజుల ఆకృతిపైకి వచ్చి అభిషేకం జరుగుతున్న భావన కలుగుతుంది. అదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా వినిపిస్తుంటాయి. ♦ రామానుజుల సమతామూర్తి, పక్కనే ఉన్న ఫౌంటెయిన్, ఇతర భవనాలపైన కనువిందు చేసేలా.. ప్రత్యేక కాంతిపుంజాల విన్యాసాలతో జరిగే ఏఆర్ (అగుమెంటెడ్ రియాలిటీ) షో మంత్రముగ్ధులను చేస్తుంది. రోజూ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 18 నిమిషాల పాటు ఈ 3డీ షో నిర్వహిస్తారు. ఇందులో రామానుజులు ప్రబోధించిన సమానత్వాన్ని చాటే ఘట్టాలు కనివిందు చేస్తాయి. ఏకకాలంలో 3,600 మంది తిలకించొచ్చు. ఇక రెండు లక్షల మొక్కలతో ఉద్యానవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. -
ప్రధాని మోదీని కలుసుకున్న చినజీయర్ స్వామి
-
ఆలయాల అభివృద్ధి ఘనత కేసీఆర్‌దే..
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆలయాల నిధులను ప్రభుత్వం ప్రజా అవసరాలకు వినియోగించేదన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బాలాజీ ఆలయంలో శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం చేపట్టినా దేవుళ్లకు పూజ చేసిన తర్వాతే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలకు సైతం దేవుళ్ల పేర్లను పెట్టారని గుర్తు చేశారు. ఆలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్.. ప్రభుత్వ పరంగా రూ.4.25 కోట్లు, వ్యక్తిగతంగా రూ.కోటి అందజేశారని మంత్రి తెలిపారు. పచ్చటి తెలంగాణ కేసీఆర్ చలువే...: రాష్ట్రంలో గతంలో బీడు భూములు ఉండేవని.. ఇప్పుడు పచ్చటి పంట పొలాలతో, జలాశయాలతో తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దే అని చినజీయర్ స్వామి అన్నారు. శంషాబాద్‌లో రామానుజ ప్రతిష్ట కార్యక్రమం ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరుగుతుందన్నారు. 1,035 కుండలతో లక్ష్మీనారాయణ యాగం చేస్తున్నామన్నారు. ఈ యాగానికి 2 లక్షల కిలోల నెయ్యిని వినియోగించి కరోనా లాంటివి కొంతలోకొంతైనా ప్రజల దరిచేరకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు పాల్గొన్నారు. -
రామమయం
-
అహో..యాదాద్రి
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆగమ, వైదిక నియమాలు.. ఆకట్టుకునే శిల్పకళాకృతులతో ప్రపంచంలోనే అద్భుతమైన ఆలయంగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటోంది. రాజుల కాలంనాటి నిర్మాణశైలిని అనుసరిస్తూ.. జీవకళ తొణికిసలాడేలా కృష్ణ శిలలతో కూడిన అద్భుత సౌందర్య నిర్మాణం త్వరలో ఆవిష్కృతం కానుంది. దేశంలోని నారసింహ క్షేత్రాల్లో అతిపురాతనమైన యాదగిరికొండపై కొలువైన పంచనారసింహుడి ఆలయ మహిమలు విశ్వవ్యాప్తం కానున్నాయి. దక్షిణ భారతంలోని తంజావూరు.. అనంత మంగళం.. మధుర.. రామేశ్వరం వంటి పురాతన ఆలయాల నిర్మాణ శైలిని మించిన రాతి శిల్పాలు ఇక్కడ సిద్ధమవుతున్నాయి. పునాది నుంచి శిఖరం వరకు పూర్తిగా రాతి శిల్పాలతో సాగడం యాదాద్రి ఆలయ నిర్మాణ విశిష్టతగా చెబుతున్నారు. – సాక్షి, యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం చినజీయర్ స్వామి సూచనలు, సలహాలు, వాస్తు, పంచరాత్ర ఆగమ శాస్త్ర పద్ధతిలో స్తపతులు పనులను ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో.. సీఎం కేసీఆర్ పట్టుదలతో రూ.2,000 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ నిర్మాణం త్వరలోనే పూర్తి కానుంది. ఇప్పటికే పనులకోసం రూ.1,800 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో రూ.610 కోట్లు ఖర్చు అయ్యాయి. ప్రాకార మండపంపై రాతి పనులు యాదాద్రి ప్రధానాలయం, అష్టభుజి ప్రాకార మండపం వద్ద కొడింగల్, సాలహారాలు, వేలంరాల శిల్పాల పనులను చేస్తున్నారు. అలాగే ప్రాకార మండపం వద్ద రాతి కప్పు పనులను ముమ్మరం చేశారు. గర్భాలయ ప్రధాన గోపురం వద్ద కర్ణకూటం లేయర్ అమర్చుతున్నారు. తూర్పు రాజగోపురంలోనుంచి వెళ్లగానే కర్ణకూటం కనిపించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. «ప్రధాన ఆలయానికి ఎదురుగా ఇటీవల ధ్వజస్తంభం కోసం బలిపీఠం నిలబెట్టారు. వాటికి బంగారు తొడుగులు చేయించడానికి ప్రథమంగా రాగి తొడుగు పనులను చేపట్టారు. శరవేగంగా శివాలయం పనులు శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ విస్తరణ, పునఃనిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. తోగుట స్వామి పర్యవేక్షణలో శివాలయ ప్రాకారం, ఆలయం లోపలి భాగం పనులు చేపట్టారు. మహా శివుడు కొలువైన ఈ ఆలయాన్ని కూడా లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోనే అందుబాటులోకి తేనున్నారు. పూర్తి కావస్తున్న ప్రధానాలయం ప్రస్తుతం ప్రధాన ఆలయంలో ఇప్పటికే గర్భాలయం,ముఖ మండపం, అంతర్గత ప్రాకారం, ఏడు గోపురాలు పూర్తయ్యాయి. అష్టభుజి ప్రాకారం, బాహ్య ప్రాకారం పనులు కొనసాగుతున్నాయి. మరో రెండు నెలల్లో ప్రధాన ఆలయాన్ని ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్వం నారసింహ చరితం సప్తగోపుర సముదాయాలు, కాకతీయ శిల్పాలు,యాలి పిల్లర్లు ఇలా .. పలు హంగులతో ఆలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. రాజగోపురాల పనులు పూర్తయ్యాయి. గర్భాలయంలోగల ఉప ఆలయాలైన ఆండాల్ అమ్మవారి ఆలయం, క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి, నమ్మాళ్వార్, రామానుజాళ్వార్ల ఆలయాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపులా జయ విజయుల స్వాగత మూర్తులను ఏర్పాటు చేస్తున్నారు. ద్వారంపై కొండగుహ ఆకృతి నరసింహావిర్భావ భక్త ప్రహ్లాదచరితం,ఆంజనేయస్వామి, గరుడాళ్వార్లు శంకుచక్రనామాలతో శిలా విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆండాల్ అమ్మవారి ఆలయానికి మధ్య స్వామివారి శయన మందిరాన్ని నిర్మించి శయన నారసింహుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ శయన మందిరాన్ని అద్దాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. మరో పక్క ధ్వజస్తంభం పనులు కూడా ప్రారంభమయ్యాయి. మూడు నెలల్లో పూర్తి మరో మూడు నెలల్లో ప్రధాన ఆలయ పనులు పూర్తవుతాయని ఈవో గీతా రెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు జరుగుతున్నాయని చెప్పారు. జీయర్ మంగళశాసనాలతో.. చినజీయర్ స్వామి సూచనలు, సలహాలు,మంగళశాసనాలతో జరుగుతున్నాయని ప్రధాన అర్చకుడు లక్ష్మినరసింహాచార్యులు తెలిపారు. స్తపతులు ఆగమశాస్త్ర పద్ధతిలో పనులను పూర్తి చేస్తున్నారు. పుష్కరణి పనులు వేగం ప్రస్తుతం 300 గజాల్లో ఉన్న పుష్కరిణిని 1,200 గజాలకు విస్తరిస్తున్నారు. రెండు నెలల్లో సివిల్ పనులను పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పుష్కరిణిలో ఒక రాతి మండపం ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల నాటికి పుష్కరిణి పనులు కూడా పూర్తి చేసి శ్రీస్వామి వారి చక్రతీర్థ స్థానం చేపట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. అంతే కాకుండా భక్తులకు ఇబ్బందులు కలగకుండా కొండకింద గల గండిచెరువును కూడా అభివృద్ధి చేస్తున్నారు. సమకాలీన పరిస్థితుల చిత్రీకరణ యాదాద్రి క్షేత్ర చరిత్రతోపాటు, ప్రస్తుత సమాజంలోని వాస్తవ పరిస్థితుల గురించి భావితరాలకు తెలిపేందుకు ఇప్పుడు ఉన్న కరెన్సీ, తెలంగాణ జీవన విధానం, బతుకమ్మ, ఉగాది, సంక్రాంతి పండుగలు, క్రీడలు, తెలంగాణ తల్లి ఆకృతులు వంటి వాటిని ప్రాకార మండపాల్లోని పిల్లర్లలో చెక్కుతున్నారు. పూర్తయిన రాజగోపురాలు మహారాజగోపురం పనులు పూర్తయ్యాయి. వీటిపై ప్రస్తుతం లక్ష్మీనరసింహుని వివిధ రూపాల విగ్రహాలు, కలశాలను ఏర్పాటు చేసే పనుల్లో కూలీలు నిమగ్నమయ్యారు. ఇప్పటికే మొదటి ప్రాకారంలో 3 అంతస్తుల తూర్పు రాజగోపురం, 5 అంతస్తులతో దివ్య విమాన రాజగోపురం, రెండవ ప్రాకారంలో 5 అంతస్తులతో తూర్పు, ఉత్తర, దక్షిణ రాజగోపురాల నిర్మాణాలు పూర్తి చేశారు. సుందరీకరణ కోసం ప్రణాళికలు పెద్దగుట్టపై చేపట్టిన లేఅవుట్లో ఓపెన్‌ప్లాట్లు, రోడ్లు, సుందరీకరణ పనులు పూర్తికావచ్చాయి. 250 ఎకరాల లేఅవుట్ ప్లాన్ రూపొందించి చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తికావొస్తున్నాయి. రూ.207 కోట్ల నిధులను కేటాయించారు. 100 కోట్లతో రోడ్లు, మంచినీటి సౌకర్యం, మురుగునీటి పారుదల, పచ్చదనం కోసం పనులు చేపట్టారు. హెచ్ఎండీఏ పర్యవేక్షణలో రోడ్ల మధ్య, పక్కన మొక్కలతోపాటు పచ్చని గడ్డిని పరిచారు. ఆలయ సన్నిధిలో భోజనాలు చేస్తున్న శిల్పులు 2,000 మంది శిల్పుల శ్రమ తమిళనాడు, బిహార్, ఏపీలోని గుంటూరు, ఆళ్లగడ్డ ప్రాంతాల నుంచి వచ్చిన 2వేల మంది శిల్పులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. నిపుణుల సూచన మేరకు గుంటూరు– ప్రకాశం మధ్యలో ఉన్న గురిజేపల్లి ప్రాంతం నుంచి లక్ష టన్నుల కృష్ణ శిలలను వాడుతున్నారు. పచ్చదనం అందాలు యాదాద్రిళక్ష పచ్చదనానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఇందుకోసం కొండచుట్టూ ల్యాండ్ స్కేప్‌లు ఏర్పాటు చేసి పచ్చదనం పంచే మొక్కలు నాటుతున్నారు. అలాగే కొండపైకి వెళ్ళే దారిలో ఇరువైపులా పచ్చని పూలమొక్కలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధగుణాలు కలిగిన మొక్కలను నాటుతున్నారు. పూర్వజన్మ సుకృతం యాదాద్రి క్షేత్రం అద్భుతంగా మారుతోందని స్తపతి డాక్టర్ ఆనందాచారి వేలు తెలిపారు. ఇలాంటి ఆలయంలో స్తపతిగా పనిచేయడం పూర్వజన్మ సుకృతమన్నారు. -
కేసీఆర్ రాజాశ్యామల హోమం
జగదేవ్‌పూర్(గజ్వేల్): జాతకాలు, ముహూర్తాలను ఎక్కువగా విశ్వసించే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆదివారం ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో రాజాశ్యామల హోమం చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం నుంచి మంగళవారం వరకు యాగం నిర్వహించనున్నారు. ఇటీవల చినజీయర్‌స్వామిని కలిసిన కేసీఆర్.. ఫాంహౌస్‌లోనే హోమం చేయాలని నిర్ణయించుకున్నారు. స్వామి వారి శిష్యబృందం వేద పండితులతోనే రాజాశ్యామల హోమం చేపట్టనున్నారు. హోమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతోపాటు ముఖ్య అనుచరులు పాల్గొనే అవకాశం ఉంది. శనివారం సాయంత్రం నుంచే హోమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. రాజయోగం.. ప్రజా సంక్షేమం కోసమే... ఫాంహౌస్‌లో ఆదివారం నిర్వహించే హోమం కేసీఆర్ రాజయోగం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చినజీయర్‌స్వామి జన్మదినం సం దర్భంగా స్వామి హోమం నిర్వహించారు. స్వామిజీ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ ఈనెల 10న అక్కడికి వెళ్లారు. కేసీఆర్ తన మనసులోని మాటను చినజీయర్‌స్వామికి, వేద పండితులకు వివరించగా మంచి ముహూర్తం చూసి హోమం చేయాలని పండితులు చెప్పగా వారి సూచనలు, సలహాల మేరకు ఆదివారం ఫాంహౌస్‌లో మూడు రోజుల పాటు హోమానికి శ్రీకారం చుట్టారు. 120 మంది ఋత్వికులతో హోమం... రాజాశ్యామల హోమాన్ని చినజీయర్‌స్వామి శిష్యబృందం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రమే వారంతా ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి హోమం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఒకేసారి 120 మంది ఋత్వికులతో హోమం జరగనుంది. హోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొని పూజలు చేయనున్నారు. రెండోరోజు కేసీఆర్ కుమారుడు, కుమార్తెలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే కుటుంబ సభ్యులతో పాటు ముఖ్య అనుచరులు కూడా పాల్గొననున్నారు. హోమానికి ముమ్మర ఏర్పాట్లు... కేసీఆర్ తన వ్యవసాయక్షేత్రంలో ఆదివారం నిర్వహించే రాజాశ్యామల హోమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచే ఫాంహౌస్‌లో అన్ని రకాల ఏర్పాట్లలో వేద పండితులు నిమగ్నమయ్యారు. ముందుగానే పండితులు ఫణిశశాంకశర్మ, గోపికృష్ణశర్మలు ఫాంహౌస్‌కు చేరుకుని హోమంకు సంబంధించిన పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. రాత్రి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు చేరుకుని హోమం ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిసింది. ఫాంహౌస్‌కు ప్రధాన గేటుకు ఎడమ భాగంలో హోమం నిర్వహించనున్నట్లు తెలిసింది. హోమం చేసేందుకు పందిళ్లు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. -
యాదాద్రిగా మారిన యాదగిరి గుట్ట
యాదగిరి గుట్ట : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామితో కలిసి గురువారం యాదగిరి గుట్టలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ యాదగిరి గుట్టకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన మార్పులన్నీ ఆగమ శాస్త్రం ప్రకారమే ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి యాదగిరి గుట్టకు యాదాద్రిగా నామకరణం చేశారు. యాదగిరి గుట్ట అభివృద్ధికి 100 కోట్ల రూపాయల కేటాయించడం గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన హర్షం వ్యక్తం చేశారు