Chinnapa reddy
-
బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి రాజీనామా
సాక్షి ప్రతినిధి నల్లగొండ: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి శనివారం ఆ పారీ్టకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించిన రోజే ఆయన రాజీనామా చేయ డం గమనార్హం. రాజీనామా లేఖలో ఈనెల 18న రాజీనామా చేసినట్లు పేర్కొనగా, చిన్నపరెడ్డి ఈ రోజే రాజీనామా చేశారని, టైపింగ్ ఎర్రర్ వల్ల అలా వచ్చిందని ఆయన అనుచరులు పేర్కొన్నారు. నల్ల గొండ ఎంపీ అభ్యర్థిగా చిన్నపరెడ్డిని బరిలో నిల పాలని మొదట్లో బీఆర్ఎస్ భావించింది. అయితే ఆయన బీజేపీకి టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరగడంతో చిన్నపరెడ్డి పేరును పక్కన పెట్టింది. కానీ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, టికెట్ తనకే వస్తుందని చిన్నపరెడ్డి రెండ్రోజుల కిందట చెప్పారు. బీఆర్ఎస్ అధిష్టానం అనూహ్యంగా కంచర్ల కృష్ణారెడ్డి పేరును ప్రకటించింది. బీజేపీ అధిష్టానం హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరును ప్రకటించింది. 15 రోజులు గడవక ముందే ఆయన్ను మార్చి చిన్నపరెడ్డికి టికెట్ ఇస్తారన్న చర్చ కూడా సాగుతోంది. కంచర్ల కృష్ణారెడ్డికి నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. -
జైహింద్ స్పెషల్: కోటప్పకొండ దొమ్మీ
కోటప్పకొండ తిరునాళ్లకు పయనమయే టప్పటికి పరిస్థితి కొంత అనుమానంగా కనిపించింది. ప్రమాదాన్ని శంకించిన సన్నిహితులు ఎంతగానో నచ్చజెప్పారు. తగ్గేదే లేదంటూ చిన్నపరెడ్డి కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభను కట్టాడు. తర్వాత ఏం జరిగింది? గుంటూరుజిల్లా తెనాలి డివిజనులోని మండల కేంద్రం చేబ్రోలు శివారు కొత్తరెడ్డిపాలెం.. చిన్నపరెడ్డి స్వస్థలం. 1864లో జన్మించాడు. అప్పట్లో బ్రిటిష్ పాలకులు పన్నులు కఠినంగా వసూలుచేసేవారు. కరువు రోజుల్లో గ్రామంలో ఉండే రైతుకూలీలు, బీదాబిక్కీ ఆకలి బాధలు పడుతుండేవారు. వీరికోసం ధాన్యం కొల్లగొట్టేందుకు చిన్నపరెడ్డి జంకేవాడు కాదు. సమీప గ్రామాల్లోని రైతులను కలసి, తాను అడిగిన ధరకు ధాన్యం ఇవ్వమని కోరేవాడు. అందుకు నిరాకరిస్తే రాత్రికి రాత్రే పొల్లాల్లోని ధాన్యం కుప్పలను నూర్చుకు వచ్చేవాడు. అలా రెడ్డిపాలెం ‘రాబిన్‌హుడ్’గా ప్రసిద్ధుడయ్యాడు. భారత స్వాతంత్య్రోద్యమానికి ఒక దివిటీ అయ్యాడు. బ్రిటిష్ పాలకులకు విరోధి అయ్యాడు. చదవండి: జైహింద్ స్పెషల్: సైసైరా చిన్నపరెడ్డీ.. నీ పేరు బంగరు కడ్డీ ఎప్పుడూ ముందువరుసే మహాశివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్లకు 60 అడుగుల ప్రభను సిద్ధంచేసి తీసుకెళ్లటం శివభక్తుడైన చిన్నపరెడ్డికి ఆనవాయితీ. నందీశ్వరుడికి ప్రతిరూపంగా శివలింగాలు దివ్యతేజస్సుతో ఆరు రాతిచక్రాల ప్రభను అలంకరించేవారు. ప్రభతో అరవైమంది ఆహారధాన్యాలు, వంటకాలతో నడచివెళ్లేవారు. కోటప్పకొండ ప్రాంతం అప్పట్లో రెడ్డిరాజుల పాలనలో ఉండేది. దీనితో రెడ్డిపాలెం నుంచి వెళ్లిన చిన్నపరెడ్డి ప్రభకు ముందువరుసలో స్థానం కల్పించేవారు. గుర్రంతో సహా ఏటా కోటప్పకొండకు వెళ్లటం చిన్నపరెడ్డికి అలవాటు. ఏనుగులబాట నుంచి గుర్రంపైనే కొండపైకి నేరుగా వెళ్లేవాడు. స్వామివారికి పూజలు జరిపించి వచ్చేవాడు. ఎడ్లు అడ్డుకున్నాయి! 1909 ఫిబ్రవరి 18న మళ్లీ కోటప్పకొండ తిరునాళ్లకు పయనమయేటప్పటికి పరిస్థితి కొంత అనుమానంగా కనిపించింది. ప్రమాదాన్ని శంకించిన సన్నిహితులు ఎంతగానో నచ్చజెప్పారు. తగ్గేదే లేదంటూ చిన్నపరెడ్డి కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభను కట్టాడు. అయిదు లక్షల జనం వచ్చిన ఆ తిరునాళ్లలో జనం రద్దీకి పోలీసులు లాఠీలు విసిరారు. ఎడ్లు బెదిరాయి. వారించిన చిన్నపరెడ్డిని పోలీసులు స్టేషనుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన స్వయంగా పెంచి మాలిమి చేసిన ఎడ్లు దీన్ని పసిగట్టి ఎదురుతిరిగి అదుపుతప్పాయి. పోలీసులు కాల్పులకు దిగి ఒకదానిని కాల్చిచంపారు. ప్రజలు రెచ్చిపోవటానికి కారణం అదే అయింది. అంతకుముందు చిన్నపరెడ్డి అందించిన వందేమాతరం నినాదంతో పోలీసులను చితగ్గొట్టారు. ఈ గొడవంతటికీ కారణం చిన్నపరెడ్డేనని భావించిన పోలీసులు అతడిని అరెస్టుచేశారు. అక్కడే స్టేషనులో ఉంచారు. అతడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఎగబడ్డారు. స్టేషను ముందున్న తాటాకు పందిరికి నిప్పంటించారు. నచ్చజెప్పేందుకు వచ్చి సత్రంలో ఉన్న డీఎస్పీని గాయపరిచారు. సబ్‌కలెక్టర్‌తో వచ్చిన దఫేదారును చితకబాదారు. సత్రానికి నిప్పంటించారు. సబ్‌కలెక్టర్, డీఎస్పీలు తప్పించుకున్నారు. ఈ రగడలో ఒక కానిస్టేబుల్, ఉప్పు శాఖకు చెందిన జవాను మరణించారు. జనసమూహంలో మొత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉరిశిక్ష విధించిన ప్రభుత్వం ఈ అల్లర్లకు చిన్నపరెడ్డి, అతడి అనుచరులు కారణమని నమ్మిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనతోసహా వందమందిపై గుంటూరు అదనపు సెషన్స్ కోర్టులో కేసు (నెం.27/1909) నమోదు చేశారు. పోలీసుల గాలింపుకు దొరక్కుండా తన ఇంటిలోని భూగృహంలో దాక్కున్న చిన్నపరెడ్డిని అరెస్టు చేశారు. కేసు విచారణ తర్వాత 21 మందికి ఉరిశిక్ష, 24 మందికి వివిధ కఠిన కారాగారశిక్షలు విధిస్తూ ఐషర్ కార్షన్ అనే న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఏ తప్పూ చేయని వారిక్కూడా శిక్ష పడిందన్న భావనతో చిన్నపరెడ్డి మద్రాస్ హైకోర్టులో అప్పీలు చేశారు. వాదిగా చిన్నపరెడ్డి, ప్రతివాదిగా బ్రిటిష్ చక్రవర్తిని చేర్చి 17/1910 విచారణ నంబరుగా ఇచ్చారు. హైకోర్టు న్యాయాధిపతులు మున్రో, శంకరన్ నాయర్లు విచారణ జరిపారు. 1910 ఆగస్టు 18న చిన్నపరెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. ముద్దాయిల తరపున న్యాయవాది ఎస్.స్వామినాధన్, ప్రభుత్వం తరపున టి.రిచ్మాండ్ వాదించారు. తర్వాత చిన్నపరెడ్డిని రాజమండ్రి తీసుకెళ్లి అక్టోబరులో ఉరితీశారు. కచ్చితమైన తేదీ తెలియరాలేదు. ఈ తీర్పును జీర్ణం చేసుకోలేని ప్రజలు గ్రామగ్రామాల్లో వందేమాతరం ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. చిన్నపరెడ్డి సాహసంపై బుర్రకథ, గేయాలు వచ్చాయి. స్వస్థలమైన చేబ్రోలు నుంచి 47 మంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. కోటప్పకొండ సంఘటన, చిన్నపరెడ్డి పోరాటపటిమ ఆనాటి స్వరాజ్య ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా నిలిచినట్టు ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకరు అయ్యదేవర కాళేశ్వరరావు, ఇతర ప్రముఖులు తమ రచనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికీ ఆనవాయితీ బ్రిటిష్ హయాంలో చిన్నపరెడ్డి కారణంగా కోటప్పకొండ తిరునాళ్లలో పోలీసుక్యాంపు ఏర్పాటుచేసి, జిల్లా ఎస్పీ, కలెక్టరు అక్కడే మకాం వేసేవారు. ఇదే ఆనవాయితీ ఇప్పటికీ కోటప్పకొండలో కొనసాగుతోంది. ఈ సంప్రదాయం రాష్ట్రంలో మరే ఇతర తిరునాళ్లలో లేదు. కోటప్పకొండలో చిన్నపరెడ్డి ప్రభను నిలిపి మకాం చేసిన ప్రాంతం, ఎడ్లపందాల్లో పాల్గొన్న స్థలం ఇప్పటికీ జిల్లాపరిషత్ ఆధీనంలోనే ఉంది. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
జైహింద్ స్పెషల్: సైసైరా చిన్నపరెడ్డీ.. నీ పేరు బంగరు కడ్డీ
‘సైసైరా చిన్నపరెడ్డీ.. నీ పేరు బంగరు కడ్డీ..’ స్వరాజ్య ఉద్యమకారుల నాల్కలపై నడయాడిన గేయమిది. రెడ్డిరాజుల పరాక్రమాన్ని పుణికిపుచ్చుకున్న గాదె చిన్నపరెడ్డి శౌర్యపరాక్రమాలకు ఈ గేయం దర్పణం. జాతీయోద్యమాన్ని మలుపు తిప్పిన కోటప్పకొండ దొమ్మీ చిన్నపరెడ్డి సాహసానికి నినాదం. స్వాతంత్య్ర ఉద్యమానికి ఇంతగా ఊపిరిలూదిన ఆ.. చిన్నపరెడ్డి ఉరికొయ్యన సైతం ఉయ్యాలలూగిన ధీరుడు, యోధుడు. చదవండి: జైహింద్ స్పెషల్: 47కు 32 ఏళ్ల ముందే భారత్‌కు స్వాతంత్య్రం! గుంటూరుజిల్లా తెనాలి డివిజనులోని మండల కేంద్రం చేబ్రోలు శివారు.. కొత్తరెడ్డిపాలెం చిన్నపరెడ్డి స్వస్థలం. గాదె సుబ్బారెడ్డి, లింగమ్మ దంపతులకు ఆరుగురు మగ సంతానం. వీరిలో చివరివాడు చిన్నపరెడ్డి. 1864లో జన్మించాడు. నీలిమందు పంట సాగు వీరి ప్రధాన వ్యాపకం. నీలిమందును గుర్రాలపై మద్రాసు తీసుకెళ్లి విక్రయించేవారు. ఇంట్లోనే గుర్రాలు ఉండటంతో చిన్నతనం నుంచి చిన్నపరెడ్డికి స్వారీ అలవాటు. నీలిమందు పంట అమ్మేందుకు తాను కూడా నాటి మద్రాసు రాష్ట్రంలోని కూవం నది ఒడ్డున తెలుగువారి మార్కెట్‌కు వెళుతుండేవాడు. రెడ్డిపాలెం రాబిన్‌హుడ్ అప్పట్లో బ్రిటిష్ పాలకులు పన్నులు కఠినంగా వసూలుచేసేవారు. కరువు రోజుల్లో గ్రామంలో వీరితోపాటు ఉండే రైతుకూలీలు, బీదాబిక్కీ ఆకలి బాధలు పడుతుండేవారు. వీరికోసం ధాన్యం కొల్లగొట్టేందుకు చిన్నపరెడ్డి జంకేవాడు కాదు. సమీప గ్రామాల్లోని రైతులను కలసి, తాను అడిగిన ధరకు ధాన్యం ఇవ్వమని కోరేవాడు. అందుకు నిరాకరిస్తే రాత్రికి రాత్రే పొల్లాల్లోని ధాన్యం కుప్పలను నూర్చుకు వచ్చేవాడు. ఆజానుబాహుడైన చిన్నపరెడ్డి, గుబురుమీసాలతో తలపాగా చుట్టుకుని గుర్రంపై స్వారీచేస్తూ రోడ్డుపై వెళుతుంటే చిన్నాపెద్దా కన్నార్పకుండా చూసేవారు. చేబ్రోలులో మకాంవేసిన జమీందారి సైన్యానికి ఇదే కంటగింపయింది. చేబ్రోలు రోడ్డులో గుర్రంపై వెళుతున్న చిన్నపరెడ్డిని వారు అడ్డుకున్నారు. రాజవీధుల్లో ఇతరులు స్వారీ చేయరాదని, తలపాగా చుట్టరాదని ఆంక్ష విధించారు. దీన్ని సహించలేకున్నా, అప్పట్లో ఏమీ చేయలేక వెనుదిరిగి వచ్చాడు చిన్నపరెడ్డి. మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో చిన్నపరెడ్డి ఊరు ఊరంతా వెంటరాగా గుర్రంపై స్వారీ వెళ్లాడు. పెద్ద రగడ అవుతుందేమోనని భావించిన చేబ్రోలులోని పెద్దలు రాజీ ప్రతిపాదన చేశారు. గొడవ సద్దుమణిగినా అతడిలో ఆత్మాభిమానజ్వాల రగులుతూనే ఉంది. ఈ గొడవ పరోక్షంగా మరో యుద్ధానికి తెరతీసింది. జాతీయ నేతల స్ఫూర్తి 1907లో నీలిమందు పంట విక్రయానికి మద్రాసు వెళ్లినపుడు అక్కడ కూవం నది ఒడ్డున జరుగుతున్న బహిరంగసభలో ప్రకాశం పంతులు, బాలగంగాధర తిలక్ ప్రసంగాలను విన్నాడు చిన్నపరెడ్డి. వారి నోటివెంట వెలువడ్డ ‘వందేమాతరం’ నినాదానికి చిన్నపరెడ్డికి రోమాలు నిక్కబొడిచాయి. తిరిగొచ్చాక ‘వందేమాతరం.. మనదే రాజ్యం, బ్రిటిష్‌వారిని పారద్రోలండి’ అనే నినాదంతో జనాన్ని ఉత్సాహపరిచే ఒక దండును తయారుచేశాడు. 1907లో చిన్నపరెడ్డి గురించి తెలుసుకున్న అప్పటి బ్రిటిష్ కలెక్టర్ అతడిని పిలిపించుకుని ఉద్యమాన్ని విరమించాలని కోరాడు. రాజీమార్గంలోకి తెచ్చేందుకు ఎంతో ఒత్తిడి చేసినా చిన్నపరెడ్డి అంగీకరించలేదు. భారీ ప్రభతో తిరునాళ్లకు మహాశివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్లకు 60 అడుగుల ప్రభను సిద్ధంచేసి తీసుకెళ్లటం శివభక్తుడైన చిన్నపరెడ్డికి ఆనవాయితీ. నందీశ్వరుడికి ప్రతిరూపంగా శివలింగాల దివ్యతేజస్సుతో ఆరు రాతిచక్రాల ప్రభను అలంకరించేవారు. ప్రభతో అరవైమంది ఆహారధాన్యాలు, వంటకాలతో నడిచివెళ్లేవారు. కోటప్పకొండ ప్రాంతం అప్పట్లో రెడ్డిరాజుల పాలనలో ఉండేది. దీనితో రెడ్డిపాలెం నుంచి వెళ్లిన చిన్నపరెడ్డి ప్రభకు ముందువరుసలో స్థానం కల్పించేవారు. నరసరావుపేట సమీపంలోని రావిపాడుకు చెందిన మోతుబరి మహిళ తాలూకు ప్రభకు రెండోస్థానం ఇచ్చేవారు. గుర్రంతో సహా ఏటా కోటప్పకొండకు వెళ్లటం చిన్నపరెడ్డికి అలవాటు. ఏనుగులబాట నుంచి గుర్రంపైనే కొండపైకి నేరుగా వెళ్లేవాడు. స్వామివారికి పూజలు జరిపించి వచ్చేవాడు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
ఎమ్మెల్సీ ఫలితాలపై స్పందించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఎమ్మెల్సీలు విజయం సాధించిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఏకపక్ష విజయం ఇచ్చిన స్థానిక సంస్థల ప్రతినిధులకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. నల్గొండ టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి గెలుపొందారు. -
నల్లగొండ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపు
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయఢంకా
సాక్షి, హైదరాబాద్ : వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాలను అధికార పక్షం టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నల్లగొండ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి ...కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిపై గెలుపొందారు. చిన్నపరెడ్డికి 640, లక్ష్మికి 414 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక వరంగల్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (850) విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంగాల వెంకట్రామిరెడ్డి(23)పై ఆయన 827 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక రంగారెడ్డి స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి ...కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై విజయం సాధించారు. ఈ నెల 31న జరిగిన ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లో కలిపి 98.35 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,799మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు గాను 2,753మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితాలపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. నల్లగొండ మొత్తం ఓట్లు : 1085 పోలైనవి :1073 టీఆర్ఎస్ : 640 కాంగ్రెస్ : 414 చెల్లనవి : 19 సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గులాబీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నపరెడ్డి
సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికకు అధికార టీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ అధినాయకత్వం డాక్టర్ తేరా చిన్నపరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇదే నియోజకవర్గానికి 2015లో జరిగిన ఎన్నికల్లో తేరా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. కాగా ఆయన గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో స్థానికసంస్థల నియోజకవర్గం ఖాళీ అయ్యింది. ఈనెల 14వ తేదీతో (మంగళవారం) నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదివారం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున మూడు స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. కాగా, నల్లగొండ స్థానం నుంచి పలువురు టికెట్ ఆశించినా.. గత ఎన్నికల్లో (2015) ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తేరా చిన్నపురెడ్డికే మళ్లీ అవకాశం ఇచ్చారు. ఈసారి ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీఆర్ఎస్ వ్యూహా త్మకంగానే వ్యవహరించింది. గత ఎన్నికల్లో గెలుపు కోసం తేరా చిన్నపరెడ్డి బాగానే ఖర్చు చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన మొన్నటి ఎంపీ ఎన్నికల సమయంలో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ, ఆయనకు ఆ టికెట్ దక్కలేదు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆయననే తిరిగి పోటీకి పెట్టాలని అధినాయకత్వం భావించిందని చెబుతున్నారు. టీఆర్ఎస్లోనే.. ‘స్థానిక’ ఓటర్లు గత ఎన్నికల సమయం నాటికి స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు అత్యధికులు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆయా ఎన్నికల్లో వారు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు. కానీ ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారంతా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్లో చేరారు. గత ఎన్నికల సమయం నాటికి 1,110 మంది స్థానిక ఓటర్లు ఉండగా, వీరిలో మెజారిటీ ఓటర్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన వారే. ఈ కారణంగానే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలిచారన్నది సాధారణ అభిప్రాయం. కాగా, ప్రస్తుతం వీరిలో కొన్ని ఓట్లు తగ్గినా.. అత్యధికులు టీఆర్ఎస్లోనే ఉండడంతో ఈసారి తమ అభ్యర్థి ఎమ్మెల్సీగా విజయం సాధించడం ఖాయమన్న విశ్వాసం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్థానిక ఓటర్ల బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేకే అప్పజెప్పారని అంటున్నారు. ఈ నెల 31వ తేదీన నల్లగొండ స్థానిక ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇంకా ఖరారుకాని.. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు గడువు మిగిలి ఉండగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. 2015 నాటి ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్ తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలేవీ చేస్తున్నట్లు కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ పార్టీ గుర్తుపై గెలిచిన స్థానిక సంస్థల అభ్యర్థులంతా ఇప్పుడు టీఆర్ఎస్కు మారిపోవడంతో ఆ పార్టీకి ఉన్న ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కాగా, నల్లగొండ స్థానిక ఎమ్మెల్సీ పదవీకాలం మరో మూడేళ్లు మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి ముందుకు వచ్చి ఎవరు పోటీ చేస్తారో అన్న ఆసక్తి అన్ని వర్గాల్లో ఉంది. ఈ సారి అభ్యర్థిని బరిలోకి దింపుతుందా..? లేక పోటీకి దూరంగా ఉంటుందా అన్న అంశం తేలాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, పార్టీ వర్గాల్లో మాత్రం.. భువనగిరి యాదాద్రి జిల్లాకు చెందిన టీపీసీసీ కోశాధికారి గూడూరి నారాయణరెడ్డి, సూర్యాపేట జిల్లాకు చెందిన పటేల్ రమేష్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. నామినేషన్లకు రెండు రోజుల సమయమే ఉన్నందున కాంగ్రెస్ నాయకత్వం కూడా రేపో మాపో తమ అభ్యర్థిని ప్రకటిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తేరా చిన్నపరెడ్డి ప్రొఫైల్.. పేరు : తేరా చిన్నపరెడ్డి తల్లిదండ్రులు : తేరా కోటమ్మ, తేరా పెద్దరాంరెడ్డి కుటుంబం : భార్య కల్పన, కుమార్తెలు వీణారెడ్డి, రవళిరెడ్డి పుట్టిన తేదీ : 10–08–1963 విద్యార్హతలు : బీఎస్సీ కెమికల్ టెక్నాలజీ, 1985లో పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, డాక్టరేట్ ఇన్ ఫార్మాసిటికల్ టెక్నాలజీ ఫ్రం వెస్ట్బ్రోక్ యూనివర్సిటీ యూఎస్ఏ స్వస్థలం : పిన్నవూర, పెద్దవూర మండలం వృత్తి నేపథ్యం : పారిశ్రామికవేత్త పారిశ్రామిక రంగ నేపథ్యం : 1985లో పీజీ పూర్తి చేసిన తేరా చిన్నపురెడ్డి ఆ తర్వాత స్టాండర్డ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ కంపెనీలో మొదట ఉద్యోగం పొందారు. ఆ తరువాత ఢిల్లీ సీఫామ్ ల్యామ్లోకి మారారు. ఔషధ రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్‌లో సైంటిస్టుగా తొమ్మిది సంవత్సరాలు పనిచేశారు. ఆ తరువాత అమెరికా వెళ్లారు. 1993లో తేరా చిన్నపురెడ్డి కల్పనను వివాహం చేసుకున్నారు. 1994లో యూఎస్‌లోని ఫార్మా ఇండస్ట్రీస్‌లో అంతర్జాతీయ మార్కెటింగ్ విభాగంలో ఆరు సంవత్సరాల పాటు కెనడా, మెక్సికో, అమెరికా దేశాల్లో తిరుగుతూ పనిచేశారు. 1995లో నల్లగొండ జిల్లాలోని చౌట్టుప్పల్ సమీ పంలో శ్రీని ఫార్మా ఇండస్ట్రీస్ ప్రారంభించారు. రాజకీయ నేపథ్యం : 2009లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి రాజకీయ ప్రవేశం చేసి కుందూరు జానారెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2014లో నల్లగొండ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా తేరా చిన్నపురెడ్డి పోటీ చేసి గుత్తా సుఖేందర్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. 2015లో నల్లగొండ జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. -
పోలీసులా.. లేక టీడీపీ కార్యకర్తలా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చిన్నపరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలీసులు క్రమశిక్షణ తప్పుతున్నారని అన్నారు. ఏపీ పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తూ సీ విజల్ యాప్ ఫిర్యాదులకు అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. పోలీసులు డబ్బులు, మందు, పాంప్లెట్స్ ఉన్న కారుని పట్టుకున్నారని జనం గుమిగూడారు. అక్కడికి తాము వెళ్లి చూడగా కారు నెంబర్ TN 20 BY 9279 లో టీడీపీ అధినేత చంద్రబాబు బొమ్మ ఉన్న అట్టపెట్టి ఉంది. పోలీసులు ఎవరిని దగ్గరకు రానీయకుండా పంపించేశారని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ సామాన్యుడికి అవకాశమిచ్చిన సీ విజిల్ ద్వారా ఫిర్యాదు చేయడానికి తాము వీడియో తీయడానికి ప్రయత్నించగా వీడియో తీయకుండా పోలీసులు అడ్డుకొన్నారని తెలిపారు. పోలీసులు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ.. ఏదో మిస్ యూజ్ చేయబోతున్నారని అని తాము సీ విజిల్ లో ఫిర్యాదుకు ప్రయత్నించామని, వారు తమపై ఐపీసీ 353 ప్రకారం కేసు పెట్టి ఇంటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చిన్నపరెడ్డి ఆరోపించారు. -
అవినీతి కాంగ్రెస్‌కు చరమగీతం పాడాలి
తేరా చిన్నపరెడ్డి హుజూర్నగర్, న్యూస్‌లైన్ జరగబోయే సాధారణ ఎన్నికలలో అవినీతి కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడాలని టీడీపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వంగాల స్వామిగౌడ్‌తో కలిసి శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు త మ స్వలాభం కోసం అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో 15.7 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని ఆయన ఆరోపించారు. జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏనాడు కూడా జిల్లా అభివృద్ధి విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించలేదన్నారు. అనంతరం వంగాల స్వామిగౌడ్ మా ట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో అమర వీరుల త్యాగాలు, తెలంగాణ ప్రజల ఉద్యమాలు కీలకపాత్ర వహించాయి తప్ప ఏ పార్టీ గొప్పతనం కాదన్నారు. అదేవిధంగా టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చావాకిరణ్మయి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నానని పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు కోటా సూర్యప్రకాశరావు, నర్సింగ్ వెంకటేశ్వర్లు, అట్లూరి హరిబాబు, చావాసహదేవరావు, ముక్కపాటి వెంకటేశ్వరరావు, ముడెం గోపిరెడ్డి, గోలి వెంకటేశ్వర్లు, బానోతు పద్మ, నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు. -
సాహిత్య, సమన్యాయాల తీర్పరి
న్యాయమూర్తి తన సుదీర్ఘ తీర్పులోని ముఖ్యాంశాలను నిపుణతతో వెల్లడించినట్టే ఒక సాహిత్యాంశం గురించీ, సాహిత్యవేత్త గురించీ, సామాజికాంశం గురించీ చిన్నపరెడ్డి ప్రసంగించడం కనిపిస్తుంది. మానవాళికి అందకుండా అనంతంగా బాధిస్తున్న మౌలిక అవసరాలను, ప్రభుత్వాన్ని నిగ్గదీసి సాధించుకునే మానవ హక్కుల స్థాయికి తీసుకువచ్చిన అరుదైన న్యాయమూర్తులు మనకు ఉన్నారు. అంటే అణగారిన వర్గాలకు గొంతును ఇచ్చే బాధ్యతను వారు స్వీకరించారు. వారిలో జస్టిస్ ఒంటెత్తుపల్లి చిన్నపరెడ్డి ఒకరు. చిన్నపరెడ్డి ‘ది కోర్ట్ అండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ (ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2008) పుస్తకానికి ప్రొఫెసర్ ఉపేంద్ర బాగ్చి రాసిన్ఙ‘ముందుమాట’లో వీఆర్ కృష్ణయ్యర్, పీఎన్ భగవతి, డీఏ దేశాయ్‌లతో పాటు మన రాష్ట్రానికి చెందిన చిన్నపరెడ్డి కూడా అలాంటి చరిత్రాత్మక బాధ్యతను నిర్వర్తించారని వ్యాఖ్యానించారు. నిజానికి సాహిత్యం చేసిందీ, చేయాల్సిందీ ఇదేనని చిన్నపరెడ్డి విశ్వసించి, మనందరికీ చెప్పదలిచారనిపిస్తుంది. చిన్నపరెడ్డి ప్రథమ వర్ధంతి (ఏప్రిల్ 13, 2014)కి విడుదలవుతున్న ‘జస్టిస్ ఓ. చిన్నపరెడ్డి: సాహిత్య సామాజిక ప్రసంగాలు’ (జనసాహితి ప్రచురణ)పుస్తకం ఈ తాత్వికతనే ప్రతిబింబిస్తోంది. న్యాయస్థానం మౌనంగా ఉండిపోవడం మీద జస్టిస్ చిన్నపరెడ్డికి ఉన్న ఆవేదనే ఆయన విస్తృత గ్రంథం ‘ది కోర్ట్ అండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’లో కనిపిస్తుంది. 1967 నాటి గోలక్‌నాథ్ వ్యాజ్యంలో (ప్రాథమిక హక్కులను సవరించేందుకు పార్లమెంటును అనుమతించకపోవడం) అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం విషాదమని ఆయన వ్యాఖ్యానించారు. 1970లో ఈఎంఎస్ నంబూద్రిపాద్‌ను శిక్షిస్తూ తీర్పునివ్వడం తప్పిదమని అంటారాయన. అరుంధతీరాయ్‌ని శిక్షించడం, బాబ్రీ మసీదు కూల్చివేతలో మౌనం దాల్చడం గురించి కూడా చిన్నపరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య తీర్పులూ, హయాం మీద వెలువరించిన వ్యాఖ్యలు అసాధారణమైనవి. భూమయ్య, కిష్టాగౌడ్ మరణ దండనను తప్పించి, విప్లవకవుల మీద కేసును కొట్టేసిన న్యాయమూర్తి ఆయన. మహా నేరగాళ్లు సమాజంలో నిర్భయంగా తిరుగుతుంటే వీళ్లనెందుకు శిక్షించాలన్నది ఆయన ప్రశ్న. ఇలాంటి తీర్పరి తెలుగు సాహిత్యం మీద చేసిన వాదనలూ, విశ్లేషణలూ లోతుగా కాకుండా ఇంకెలా ఉంటాయి? ‘సాహిత్యానికీ సామ్యవాదానికీ, నిత్య జీవితానికీ తీరని బంధాలున్నాయి’ అని నమ్మారాయన. ‘సమాజ హృదయం సాహిత్యం. లోకాన్నంతటినీ అవలోకించే నేత్రం సాహిత్యం. చదువరిలో చైతన్యం కలిగించి భావి భావ విప్లవానికి దారి తీస్తుంది సాహిత్యం’ అంటారు జస్టిస్ చిన్నపరెడ్డి. న్యాయమూర్తి తన సుదీర్ఘ తీర్పులోని ముఖ్యాంశాలను నిపుణతతో వెల్లడించినట్టే ఒక సాహిత్యాంశం గురించీ, సాహిత్యవేత్త గురించీ, సామాజికాంశం గురించీ చిన్నపరెడ్డి ప్రసంగించడం కనిపిస్తుంది. ఆ అంశం మీద ఆయన అధ్యయనం లోతుగా ఉంటుంది. దాని సారాన్ని ఆయన క్లుప్తంగా, బలంగా ఆవిష్కరిస్తారు. ‘వేమన ఏ కాలానికి చెందిన వాడూ కాదు. వేమన కాలం కలకాలం. చిరకాలం, స్థిరకాలం’ (వేమన-మనకర్తవ్యం) అన్నారాయన. కానీ వేమన తన సమకాలీన సమాజం మీద చేసిన విమర్శలు, నేటి సమాజానికి వర్తించడం గురించి జస్టిస్ గట్టిగానే స్పందించారు. ఆ దుస్థితి నుంచి సమాజాన్ని తప్పించమని మీ అందరినీ ‘శాసిస్తున్నాను’ అన్నారా న్యాయమూర్తి. ‘గురజాడ తెనుగు వారికి గ్రాంథిక భాషకు బదులు వాడుక భాషను చేకూర్చాడు. తెనుగు సాహిత్యంలో కాల్పనికానికి బదులు వాస్తవికాన్ని ప్రవేశపెట్టాడు. తెనుగు వారికి ఆధ్యాత్మికతత్వం బదులు శాస్త్రీయ మానవతాతత్వం పరిచయం చేశాడు. ఈ విధంగా రకరకాలుగా నవయుగ వైతాళికుడుగా వెలుగొందాడు గురజాడ’ (నవయుగ వైతాళికుడు - గురజాడ )అన్నారాయన. చండీగఢ్ ఆంధ్ర సాంస్కృతిక సంఘం నాటక పోటీలు నిర్వహిస్తే అక్కడకి కూడా వెళ్లి ‘ఏ విషయాన్నైనా, ఏ సమస్యనైనా ప్రజాబాహుళ్యానికి సులభ గ్రాహ్యం చేయగల కళ నాటక కళ’ అని పేర్కొన్నారు. ఆరుద్ర ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ కృషిలో జస్టిస్ చిన్నపరెడ్డి పాత్ర ఏమిటో చెప్పే ప్రసంగం చదవడం మంచి అనుభవం. ఆధునిక చరిత్రలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్థానం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ‘ధర్మయుద్ధం’, వసతి గృహాలలో ఉండే పేద విద్యార్థులకు ఏమి అందాలి వంటి అంశాల మీద ప్రసంగాలు విలువైనవి. సామాజిక న్యాయానికీ, సాహిత్యానికీ మధ్య బంధం గురించి ప్రపంచం చర్చిం చుకుంటున్న వేళ ఈ పుస్తకం రావడం ఆహ్వానించదగినదే. - కల్హణ 13 వ తేదీన హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో చిన్నపరెడ్డి ప్రథమ వర్ధంతి సభ సందర్భంగా -
కొత్త సూర్యోదయాన్ని చూసిన శివరాత్రి
ఆ త్యాగాలను నేటి తరం పాలకులు గౌరవిస్తున్నారా? ఈ తరం ప్రజలు గుర్తుంచుకుంటున్నారా? నాటి కాలపు దేశభక్తులు ‘క్విట్ ఇండియా’ అన్నారు. ఇప్పుడో! అభివృద్ధి ముసుగులో నల్లదొరలు బహుళజాతి సంస్థలకు స్వాగతం పలుకుతున్నారు. ‘సై సై చిన్నపరెడ్డీ! నీ పేరే బంగరు కడ్డీ!’ తెలుగు ప్రాంతంలో ఇప్పటికీ జనం నాలుకల మీద నర్తిస్తున్న పాట ఇది. కాలం గుర్తు పెట్టుకున్న వీరుడి మీద జానపదులు కట్టిన పాట ఇది. ఆయనే గాదె చిన్నపరెడ్డి. చరిత్రపుటలలో చిన్న స్థానానికే నోచుకున్నా, ప్రజల గుండెలలో ఆయన చిరస్మరణీయునిగానే ఉన్నాడు. భారతీయులను కలసి కట్టుగా కదిలేటట్టు చేసిన తొలి రాజకీయ నినాదం ‘వందేమాతరం’. బెంగాల్ విభజన నేపథ్యంలో 1905లో మిన్నంటిన ఆ నినాదమే దేశ ప్రజలను తొలిసారి రాజకీయంగా ఏకం చేసింది. వంగ సాహిత్యం మాదిరిగానే, వందేమాతరం ఉద్యమం ప్రభావం తెలుగు ప్రాంతాల మీద బలంగానే పడింది. అందుకు కారణం- 1906లో బిపిన్‌చంద్రపాల్ చేసిన పర్యటన. రాజమండ్రి, బెజవాడ, గుంటూరు, ఆపై మద్రాసు వరకు సాగిన పాల్ ఉపన్యాసాలు తెలుగువారిని ఉద్యమం దిశగా నడిపించాయి. జూలై 13, 1907న ఒంగోలులో జరిగిన బహిరంగ సభలో మిట్టదొడ్డి వెంకట సుబ్బారావు బెంగాల్ విభజనను తీవ్రంగా విమర్శించారు. వెనుకబడిన కొత్తపట్నం వంటి చోట కూడా ‘లాలా లజపతిరాయ్కీ జై’ అన్న నినాదాలు మిన్నంటాయి. రాజమండ్రిలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు తదితరుల ఉద్యమం, కాకినాడలో కెంప్ అనే అధికారికి వ్యతిరేకంగా జరిగిన అలజడి- అన్నీ అప్పుడే. ఆ తరువాత చరిత్రలో చోటు చేసుకున్న వీరోచిత ఘట్టమే కోటప్పకొండ శివరాత్రి ఉత్సవంలో చిన్నపరెడ్డి తిరుగుబాటు. గాదె చిన్నపరెడ్డి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వాడు. 1864లో జన్మించాడు. తండ్రి సుబ్బారెడ్డి, తల్లి లింగమ్మ. ఆయన గుర్రం మీదే మద్రాసులో కూనం న ది ఒడ్డున జరిగే సంతకు వెళ్లేవాడు. అలా వెళ్లినపుడే 1907లో బాలగంగాధర తిలక్‌ను చూశాడు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ నినాదంతో తన గ్రామాన్ని కదిలించాడు. రైతుకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, నీలిమందు రైతుకు గిట్టుబాటు ధరకు కోసం పోరాటాలు చేశాడు. అప్పుడే జన హృదయ నేతగా ఆవిర్భవించాడు. కానీ పోలీసులకు మాత్రం సహించరాని శత్రువుగా మారాడు. ఆ నేపథ్యంలో జరిగినదే కోటప్పకొండ ఘటన. ఫిబ్రవరి 18, 1909, శివరాత్రి పర్వదినం. జిల్లాలో నర్సరావుపేటకు సమీపంలో ఉన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కోటప్పకొండలో ఉత్సవం జరుగుతోంది. అంబరాన్ని చుంబించినట్టు ఉండే ప్రభలు, అలంకరించిన ఎద్దులు ఈ ఉత్సవం ప్రత్యేకత. ఆ రోజు జరిగే సంత కూడా అప్పటికే జాతీయ స్థాయిలో పేరెన్నికగన్నది. చిన్నపరెడ్డి కూడా స్వగ్రామం నుంచి అరవై అడుగుల ఎత్తు ప్రభ కట్టుకుని, ఎడ్లతో తిరనాళ్లకు వెళ్లాడు. ఆ సంరంభంలో ఆయన ఎద్దులు అదుపు తప్పాయి. చిన్న తొక్కిసలాట జరిగింది. దీనితో పోలీసులు జరిపిన కాల్పులకు చిన్నపరెడ్డి ఎడ్లు చనిపోయాయి. దీనిని ఆయన తీవ్రంగా ప్రతిఘటించాడు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న పోలీసులు చిన్నపరెడ్డిని అరెస్టు చేశారు. అక్కడే తాత్కాలికంగా తాటాకులతో నిర్మించిన పోలీసు స్టేషన్లో బంధించారు. చిన్నపరెడ్డిని విడుదల చేయాలని కోరుతూ ప్రజలు ఆందోళనకు దిగారు. వారి నోటి నుంచి వినిపించిన నినాదం - వందేమాతరం. పోలీసులు మళ్లీ కాల్పులు జరిపితే ఇద్దరు యువకులు మరణించారు. కోపోద్రిక్తులైన ప్రజలు తాటాకుల పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. చిన్నపరెడ్డితో పాటు మరో వందమందిపై కూడా కేసులు నమోదైనాయి. విచారణ ఒక ప్రహసనంగా మారిపోయింది. ఈ కేసులో గుంటూరు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఐషర్ కార్షన్ 21 మందికి ఉరిశిక్ష, 24 మందికి కఠిన శిక్షలు విధించాడు. అయితే ఈ తీర్పు ఇచ్చిన తరువాత అతడు పదవికి రాజీనామా చేశాడు. ఈ తీర్పును చిన్నపరెడ్డి మద్రాసు హైకోర్టులో సవాలు చేశాడు. కావాలంటే తనను శిక్షించి, మిగిలిన వారిని వదిలివేయమని ఆయన కోరాడు. ఆగస్టు 13, 1910న న్యాయమూర్తి మన్రో తీర్పు వెలువరించాడు. చిన్నపరెడ్డికి మరణశిక్ష, 21 మందికి ద్వీపాంతర శిక్ష పడింది. ఆ వెంటనే శిక్షను అమలు చేశారు. స్వేచ్ఛకోసం, స్వాతంత్య్రం కోసం, న్యాయం కోసం ఇలాంటి త్యాగాలు ఆధునిక చరిత్రలో ఎన్నో కనిపిస్తాయి. కానీ ఆ త్యాగాలను నేటి తరం పాలకులు గౌరవిస్తున్నారా? ఈ తరం ప్రజలు గుర్తుంచుకుంటున్నారా? నాటి కాలపు దేశభక్తులు ‘క్విట్ ఇండియా’ అన్నారు. ఇప్పుడో! అభివృద్ధి ముసుగులో నల్లదొరలు బహుళజాతి సంస్థలకు స్వాగతం పలుకుతున్నారు. సామ్రాజ్యవాదం ఏ రూపంలో ఉన్నా నిరోధించడానికి యత్ని స్తేనే మన త్యాగమూర్తులకు నిజమైన నివాళి కాగలదు. సందర్భం: చిట్టిపాటి వెంకటేశ్వర్లు (వ్యాసకర్త సీపీఐ యంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు)