అవినీతి కాంగ్రెస్‌కు చరమగీతం పాడాలి | general election nominations | Sakshi
Sakshi News home page

అవినీతి కాంగ్రెస్‌కు చరమగీతం పాడాలి

Published Sun, Apr 13 2014 3:29 AM | Last Updated on Sat, Sep 22 2018 8:31 PM

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తేరా చిన్నపరెడ్డి - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తేరా చిన్నపరెడ్డి

 తేరా చిన్నపరెడ్డి
 
 హుజూర్‌నగర్, న్యూస్‌లైన్ జరగబోయే సాధారణ ఎన్నికలలో అవినీతి కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడాలని టీడీపీ  నల్లగొండ ఎంపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి పిలుపునిచ్చారు.  స్థానిక పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వంగాల స్వామిగౌడ్‌తో కలిసి శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు త మ స్వలాభం కోసం అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్నారు.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో 15.7 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని ఆయన ఆరోపించారు.



 జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏనాడు కూడా జిల్లా అభివృద్ధి విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించలేదన్నారు.  అనంతరం వంగాల స్వామిగౌడ్ మా ట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో అమర వీరుల త్యాగాలు, తెలంగాణ ప్రజల ఉద్యమాలు కీలకపాత్ర వహించాయి తప్ప ఏ పార్టీ గొప్పతనం కాదన్నారు.



అదేవిధంగా టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చావాకిరణ్మయి తన నామినేషన్‌ను  ఉపసంహరించుకున్నానని పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు కోటా సూర్యప్రకాశరావు, నర్సింగ్ వెంకటేశ్వర్లు, అట్లూరి హరిబాబు, చావాసహదేవరావు, ముక్కపాటి వెంకటేశ్వరరావు, ముడెం గోపిరెడ్డి, గోలి వెంకటేశ్వర్లు, బానోతు పద్మ,  నర్సయ్యగౌడ్   పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement