శ్రీ చైతన్య కాలేజిలో అమానుషం
సాక్షి, విజయవాడ : నగరంలోని శ్రీ చైతన్య కాలేజిలో మంగళవారం అమానుషం జరిగింది. కాలేజీలో తోటి విద్యార్థులతో జరిగిన గొడవ కారణంగా చింతా కళ్యాణ్ అనే విద్యార్ధిని ఉపాధ్యాయులు తీవ్రంగా దండించారు. కళ్యాణ్.. శ్రీ చైతన్య కళాశాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మనస్థాపానికి గురైన చింతా కళ్యాణ్ ఆత్మహత్యకు యత్నించాడు.
దీంతో కళ్యాణ్‌ను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. రాత్రి గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమని అంటున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు యత్నించినా యాజమాన్యం మాత్రం స్పందించడం లేదంటూ కళ్యాణ్ తోటి విద్యార్థులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. లెక్చరర్ తీవ్రంగా కొట్టడం వల్లే మనస్తాపానికి గురైన కళ్యాణ్ కాలేజీ బయటకు వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు.