chintakani
-
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం: ఇక నలుదిశలా ‘దళిత బంధు’
-
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం: ఇక నలుదిశలా ‘దళిత బంధు’
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాన్ని ఇక రాష్ట్రవ్యాప్తం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని నలుదిశలా దళితబంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేశారు. ఆ నాలుగు మండలాల్లో అన్ని దళిత కుటుంబాలకు హుజూరాబాద్‌తో పాటు అమలుచేయాలని సీఎం ఆదేశించారు. (చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..?) ఎంపికైన ఆ నాలుగు మండలాలు ఇవే.. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం: చింతకాని మండలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం: తిరుమలగిరి మండలం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం: చారగొండ మండలం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: నిజాం సాగర్ మండలం ఈ మండలాల్లోని అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేయనుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో హైదరాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
కూతురితో తండ్రి అసభ్య ప్రవర్తన..
సాక్షి, చింతకాని(ఖమ్మం): మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన వీరబాబుపై మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఎస్సై రెడ్డిబోయిన ఉమ కథనం ప్రకారం.. వీరబాబు తన మొదటి భార్య కూతురు ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇంటి వద్ద నిద్రిస్తుండగా తండ్రి తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈలోగా పాప కేకలు వేయగా కుటుంబసభ్యులు అతడిని మందలించారు. అనంతరం అదే రోజు అర్ధరాత్రి సైతం మరోసారి అలాగే కూతురితో ప్రవర్తించడంతో తన రెండో భార్య చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
నవ్‌జీవన్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
హైదరాబాద్: సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా నవజీవన్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. బుధవారం ఉదయం విజయవాడ- ఖమ్మం మార్గంలో చింతకాని మండలం వద్ద సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించిన డ్రైవర్ రైలును నిలిపివేశారు. సంఘటన స్థలానికి రైల్వే సిబ్బంది చేరుకుని, మరమ్మతులు ప్రారంభించారు. -
బెదిరించి.. రైలు వెనక్కి..
చింతకాని: పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ తర్వాత 108వ నెంబర్ గేటు వద్ద గయా ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి జార్ఖండ్ రాష్ట్రంలోని ఫలామా జిల్లాకు చెందిన రాజేందర్ బుయ్యా (45) అనే వ్యక్తి సోమవారం మృతి చెందాడు. సంఘటనకు సంబంధించి తోటి ప్రయాణికులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కూలి పనుల కోసం రాజేందర్ బుయ్యాతో పాటు మరో నలుగురు చెన్నైకి వెళ్లేందుకు గయా నుంచి బయల్దేరారు. రైలు పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ దాటిన తర్వాత 107వ నెంబర్ గేటు వద్దకు రాగానే బోగీలోని డోర్ వద్ద కూర్చొని ఉన్న రాజేందర్ బుయ్యా జారిపడ్డాడు. గమనించిన అతని బంధువులు రైలు చైన్‌ను లాగడంతో 108వ నెంబర్ గేటు వద్దకు వచ్చాక ట్రైన్ ఆగింది. పడిపోయిన వ్యక్తిని వెతికేందుకు రైలును వెనక్కి తీసుకెళ్లాలని గార్డుతో బంధువులు ఘర్షణకు దిగారు. గార్డు విన్నపంతో లోకో పైలట్లు రైలును కిలోమీటరు మేరకు 107వ నెంబర్ గేటు వరకు వెనక్కి తీసుకెళ్లారు. ఇక్కడి గేట్‌మన్ ద్వారా పడిపోయిన వ్యక్తి చనిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనతో రైలు గంటపాటు నిలిచి బయల్దేరింది. మృతదేహాన్ని రైల్వే పోలీసులు పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఖమ్మం తరలించారు. పందిళ్లపల్లి స్టేషన్ మాస్టర్ రైల్వే అధికారుల అనుమతితో గయా ఎక్స్‌ప్రెస్ రైలునుంచి దిగిన కొంతమంది ప్రయాణికులను 107వ నెంబర్ గేటు వద్ద సికింద్రాబాద్ - గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఆపుజేయించి ఎక్కించారు. ప్రమాద ఘటన, గయా ఎక్స్‌ప్రెస్ నిలవడం కారణాలతో విజయవాడ వైపు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్, గూడ్స్ ైరె ళ్లు గంటపాటు ఆలస్యంగా నడిచాయి. సిగ్నల్ ఇవ్వని కారణంగా 110వ నెంబర్ గేటు వద్ద రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాద సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం రైల్వే ఎస్సై రవిరాజు తెలిపారు.