
సాక్షి, చింతకాని(ఖమ్మం): మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన వీరబాబుపై మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఎస్సై రెడ్డిబోయిన ఉమ కథనం ప్రకారం.. వీరబాబు తన మొదటి భార్య కూతురు ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇంటి వద్ద నిద్రిస్తుండగా తండ్రి తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈలోగా పాప కేకలు వేయగా కుటుంబసభ్యులు అతడిని మందలించారు. అనంతరం అదే రోజు అర్ధరాత్రి సైతం మరోసారి అలాగే కూతురితో ప్రవర్తించడంతో తన రెండో భార్య చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.