Chitra Ramchandran
-
జేఎన్ఏఎఫ్ఏయూ ఇన్చార్జి వీసీగా చిత్రా రామచంద్రన్
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్‌గా (వీసీ) విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల కిందటే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు నియమించలేదు. ఎట్టకేలకు ఆ వర్సిటీకి కూడా ఇన్చార్జి వీసీని నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. -
టీచర్లు స్కూళ్లకు వెళ్లాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించినా టీచర్లు మాత్రం పాఠశాలలకు Ðððlళ్లాలని, పరీక్షల విధులను నిర్వర్తించాలని, పెండింగ్ పనులను పూర్తి చేసుకోవాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా డీఈవోలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోమవారం ఇంటర్మీడియెట్, పాఠశాల విద్యాశాఖ జిల్లాల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ విధులు, టెన్త్ పరీక్ష విధులు పడిన వారు కచ్చితంగా వాటిని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మూసివేయకుండా, తరగతులను నిర్వహించిన పాఠశాలలకు నోటీసులు జారీ చేసినట్లు చిత్రా రామచంద్రన్ తెలిపారు. ఇవేకాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు తరగతులను నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ దృష్టికి వచ్చింది. వాటిపైనా చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతోంది. అందులో మంత్రి మల్లారెడ్డి బంధువు విద్యా సంస్థ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను కరోనా నేపథ్యంలో మాస్క్‌లతో అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్షలకు హాజరు కావచ్చని వెల్లడించింది. ‘అంగన్వాడీ కేంద్రాలకూ సెలవులివ్వాలి’ కోవిడ్ హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. -
16 నుంచి ఒంటిపూట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు.. ఇతర అన్ని యాజమాన్యాలు, అన్ని మీడియంల పాఠశాలలు అన్నింటికీ వచ్చే సోమవారం (16వ తేదీ) నుంచి ఒంటి పూట బడులుగా విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా కమిషనర్ చిత్రా రామ్‌చంద్రన్ ప్రకటించారు. వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో 16 నుంచి ఒంటి పూట బడులను కొనసాగించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు కొనసాగించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని 12:30 గంటలకు పెట్టాలని పేర్కొన్నారు. పాఠశాలలకు వచ్చేనెల 23వ తేదీ చివరి పని దినమని, 24వ తేదీ నుంచి వేసవి సెలవులు వర్తిస్తాయని వెల్లడించారు. తిరిగి పాఠశాలలు (కొత్త విద్యా సంవత్సరం) జూన్ 12 నుంచి ప్రారంభం అవుతాయని వివరించారు. రాష్ట్రంలోని ఆర్జేడీలు, డీఈవోలు ఈ ఉత్తర్వులను అన్ని పాఠశాలలకు పంపించాలని స్పష్టం చేశారు. -
‘ఫైర్ సేఫ్టీ’ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) లేనిదే వచ్చే విద్యా ఏడాది నుంచి ఏ భవనంలోనైనా జూనియర్, డిగ్రీ కళాశాలలు నిర్వహించేందుకు అనుమతినిచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టు ఉత్తర్వుల అమలుకు సహకరించాలని, ఫైర్ అనుమతి లేకుంటే కళాశాలల నిర్వహణకు అనుమతించబోమని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల అమలు నేపథ్యంలో శనివారం రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు, వాటి అసోసియేషన్లతో ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. కొన్ని కళాశాలలు అగ్నిమాపక అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నారం టూ హైకోర్టులో దాఖలైన పిల్‌పై కోర్టు ఇచ్చిన తీ ర్పుపై చర్చించారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యాల తరఫు ప్రతినిధి మాట్లాడుతూ.. కొన్ని కళాశాలలకు ఫైర్ ఎన్వోసీ లేదని, వచ్చే ఏ డాదిలో కళాశాలను వేరే ప్రాంగణంలోకి మార్చేందుకు ప్రస్తుతానికి అఫిడవిట్లను దాఖలు చేస్తున్నామని చెప్పారు. ఈ వాదనను తోసిపుచ్చిన ప్రభుత్వం ప్రతియేటా ఇదే సాకు చెప్పి తప్పించుకుంటున్నారని, ఈనెల 25 లోపు సదరు కళాశాలలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చినట్లు తెలిపింది. ప్రతి కళాశాలకు అఫిలియేషన్ ఇచ్చేందుకు ఫైర్ ఎన్వోసీ తప్పనిసరి అని, ఈ విషయంపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ స్పష్టం చేశారు. ఇందుకు స్పందించిన యాజమాన్యాల ప్రతినిధి ఇంటర్‌బో ర్డు ఆదేశాలను పాటిస్తామని, అయితే వార్షిక పరీక్షలు త్వరలోనే ప్రారంభం కానున్నందున హైకోర్టు ఉత్తర్వుల అమలుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో కళాశాల విద్య కార్యదర్శి నవీన్‌మిట్టల్ కూడా పాల్గొన్నారు. నోటీసులు జారీ: అగ్నిమాపక అనుమతుల్లేని కాలేజీలకు ఇంటర్‌బోర్డు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలని, యాజమాన్యాలు స్పందించకపోతే కళాశాలను మూసివేస్తామని ఇంటర్‌బోర్డు కార్యద ర్శి జలీల్ స్పష్టం చేశారు. ఈనెల 25లోపు దీనిపై హైకోర్టుకు నివేదిక ఇస్తామని తెలిపారు. దవాఖానాల్లో ఫైర్స్టేషన్లు.. అగ్ని ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు వీలుగా దవాఖానాల్లోనే ఫైర్ స్టే షన్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో స్టే షన్ల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. దీనిపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ శనివారం సమీక్షించారు. సుల్తాన్ బజార్ హాస్పిటల్, మెంటల్ హెల్త్ హాస్పిటల్, నిమ్స్, ఎంఎన్‌జే దవాఖానాల్లోనూ ఫైర్ స్టేషన్లు పెట్టాలని ఈ సందర్భంగా జరిగిన సమీక్షలో నిర్ణయించారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిబంధనలు పాటించని ప్రైవేటు జూనియర్ కాలేజీలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు అతిక్రమించే కాలేజీలపై చర్యలు తప్పవని పేర్కొంది. విద్యా సంస్థల భవనాలు, నిబంధనల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఫైర్ సర్వీ సెస్ డీజీ, హోం సెక్రెటరీ, జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, కళాశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. అగ్నిమాపక నిబంధనల ప్రకారం ఎన్ని కాలేజీలు ఉన్నాయి.. ఎన్ని కాలేజీలు లేవు అన్న అంశాలను తేల్చేందుకు ఆ శాఖ తని ఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే గుర్తించిన నిబంధనలు పాటించని కాలేజీలపై ఎందుకు ఆయా శాఖలు చర్యలు చేపట్టడం లేదని చిత్రా రామచంద్రన్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎవరి శాఖ తరఫున వారు నిబంధనలు పాటించని వాటిపై చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం. హాస్టళ్లు, అకాడమీలు బోర్డు పరిధిలోకి.. అనుమతి లేని హాస్టళ్లు, శిక్షణ సంస్థలు, ఇంటర్మీడియెట్ తరగతులు నిర్వహించే అకాడమీలను ఇంటర్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని, అవన్ని కచ్చితంగా బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు తీసుకోవాలని నిర్ణయించారు. ఇకపై కండిషనల్ అఫిలియేషన్ల విధానం ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఫైర్ సేఫ్టీ, ఇతర నిబంధనల మేరకు లేని భవనాల నుంచి ఆయా కాలేజీలను ఇతర భవనాల్లోకి తరలించాలని యాజమాన్యాలకు తేల్చి చెప్పాలని నిర్ణయించారు. -
డబుల్ బెడ్రూం ఇళ్లపై జీఎస్టీ భారం ఉండదు
గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంపై జీఎస్టీ ప్రభావం అంతగా ఉండదని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు. దీనిపై కాంట్రాక్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో మంగళవారం జరిగిన ‘డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం– జీఎస్టీ’పై జిల్లా నోడల్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జీఎస్టీ రాక ముందే ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని.. ఇళ్ల నిర్మాణంలో 70 శాతం సిమెంట్, స్టీల్, ఇసుక ఇతర నిర్మాణ సామగ్రికే ఖర్చువుతుందని చిత్ర రామచంద్రన్ అన్నారు. ఇది జీఎస్టీ రూపంలో భారం కాబోదని వివరించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్ మానిటరింగ్ సిస్టమ్ (పీయంఎస్)ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పనులు సాఫీగా సాగేందుకు జిల్లా నోడల్ అధికారి జీఎస్టీ నిబంధనల ప్రకారం జీఎస్టీ చెల్లింపుదారు, జీఎస్టీ మినహాయింపుదారునిగా రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుందని వాణిజ్య, పన్నుల శాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వాణిజ్యపన్నుల కమిషనర్ అనిల్‌కుమార్, జాయింట్ కమిషనర్ సాయికిషోర్, హౌజింగ్ కార్పొరేషన్ సీఈ సత్యమూర్తి పాల్గొన్నారు.