డబుల్‌ బెడ్రూం ఇళ్లపై జీఎస్టీ భారం ఉండదు | There is no GST burden on double bedroom houses scheme | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్రూం ఇళ్లపై జీఎస్టీ భారం ఉండదు

Published Wed, Sep 20 2017 3:45 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

డబుల్‌ బెడ్రూం ఇళ్లపై జీఎస్టీ భారం ఉండదు - Sakshi

డబుల్‌ బెడ్రూం ఇళ్లపై జీఎస్టీ భారం ఉండదు

గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌
 
సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకంపై జీఎస్టీ ప్రభావం అంతగా ఉండదని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ తెలిపారు. దీనిపై కాంట్రాక్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అండ్‌ ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీలో మంగళవారం జరిగిన ‘డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకం– జీఎస్టీ’పై జిల్లా నోడల్‌ అధికారులు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జీఎస్టీ రాక ముందే ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని.. ఇళ్ల నిర్మాణంలో 70 శాతం సిమెంట్, స్టీల్, ఇసుక ఇతర నిర్మాణ సామగ్రికే ఖర్చువుతుందని చిత్ర రామచంద్రన్‌ అన్నారు.

ఇది జీఎస్టీ రూపంలో భారం కాబోదని వివరించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (పీయంఎస్‌)ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పనులు సాఫీగా సాగేందుకు జిల్లా నోడల్‌ అధికారి జీఎస్టీ నిబంధనల ప్రకారం జీఎస్టీ చెల్లింపుదారు, జీఎస్టీ మినహాయింపుదారునిగా రిజిస్ట్రర్‌ చేసుకోవాల్సి ఉంటుందని వాణిజ్య, పన్నుల శాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వాణిజ్యపన్నుల కమిషనర్‌ అనిల్‌కుమార్, జాయింట్‌ కమిషనర్‌ సాయికిషోర్, హౌజింగ్‌ కార్పొరేషన్‌ సీఈ సత్యమూర్తి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement