Chittes
-
రూ. 6 కోట్లతో చిట్టీల వ్యాపారి పరారీ
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మరో చిట్టీల మోసం బయటపడింది. స్థానిక ప్రకాశం బజార్ లో ఉండే పోతరాజు నరసింహ చిట్టీల పేరుతో ఖాతాదారులను నిలువునా ముంచాడు. సాయి చిట్ ఫండ్ సంస్థను ఏర్పాటు చేసిన నరసింహ భారీగా నగదును వసూలు చేశాడు. దాదాపు రూ. 6 కోట్లు వసూలు చేసిన నిందితుడు వాటితో ఉడాయించాడు. విషయం తెలుసుకున్న భాదితులు ఆందోళన చేశారు. ఈ మోసం పై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. -
చిట్టీల పేరుతో ఘరానా మోసం
హైదరాబాద్: నగరంలోని బోరబండ శివాజీనగర్‌లో చిట్టీల పేరుతో ఓ మహిళ కుచ్చుటోపి పెట్టింది. బాధితుల నుంచి కోటిన్నర వసూలు చేసి ఆ డబ్బుతో ఊడాయించింది. పుష్ప అనే మహిళ కొంతకాలంగా చిట్టీల పేరుతో వ్యాపారం చేస్తోంది. డబ్బు అందగానే చిన్నగా జారుకుంది. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు సనత్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చిట్టీల పేరుతో పోలీసులకు కుచ్చుటోపీ
హైదరాబాద్: చిట్టీల పేరుతో ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు కుచ్చుటోపీ పెట్టింది. చిట్టీలు వేయమని నమ్మబలికి పోలీసుల వద్ద ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేసింది. సొమ్ము చేతికిరాగానే లీవ్ పెట్టినట్టు పెట్టి మెల్లగా ఊడాయించింది. దీంతో మోసం పోయామని తెలుసుకున్న బాధితులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు మహిళా కానిస్టేబుల్ వద్ద 50లక్షల రూపాయల చిట్టీలు వేసినట్టు సమాచారం. బాధితులందరూ మహిళా కానిస్టేబుల్‌పై సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. -
తిరుమలలో వీఐపీ చిట్టీలకు చెల్లుచీటీ...
సాక్షి, హైదరాబాద్: తిరుమలలో వీఐపీ దర్శనాలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా వీఐపీ చిట్టీలను తగ్గిస్తూ చివరకు పూర్తిగా రద్దుచేయాలని భావి స్తోంది. ఇటీవల ఏపీ హోంమంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇచ్చిన సిఫారసు లేఖలను టీటీడీ రెండుసార్లు తిరస్కరించింది. సోమవారం మంత్రిమండలి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు దృష్టికి తీసుకువచ్చారు. దేవాదాయ మంత్రి బుధవారం టీటీడీ అధికారులను హైదరాబాద్‌కు పిలిచి తిరుమలపై సమీక్ష నిర్వహించారు. గత కొన్నేళ్లుగా తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య ఏ మేరకు ఉందో అంచనా వేశారు. రానున్న కాలంలో రద్దీ మరింత పెరుగుతుందనే అంచనాకు వచ్చారు. వీఐపీ చిట్టీలతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతోందని, దర్శన సమయం 30 గంటలకు పైగా పడుతోందని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఈ సమయాన్ని సాధ్యమైనంతమేర తగ్గించాలన్న అభిప్రాయానికి వచ్చారు. నడకదారి భక్తుల సంఖ్య పెరగటం కూడా టీటీడీకి ఇబ్బందిగా మారుతోంది. శీఘ్రదర్శనం టికెట్లు కూడా ఇకపై ఆన్లైన్లో మాత్రమే విక్రయించనున్నారు. తిరుమలకు చేరుకున్న భక్తులకు శీఘ్రదర్శనం టికెట్లకోసం ప్రత్యేక ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. కాగా దేవాలయాలన్నిటినీ సమాచారహక్కు చట్టం పరిధిలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయాలు భక్తుల కానుకలతో నడుస్తున్నాయన్న ఉద్దేశంతో తొలుత ఈ చట్టం పరిధిలోకి చేర్చలేదు.