ఆర్మీ రైలులో బాంబుల బాక్సు చోరీ
ఝాన్సీ: ఆర్మీ అధికారులతో వెళ్తున్న ప్రత్యేక రైల్లో స్మోక్ బాంబ్స్తో కూడిన ఓ బాక్సును దుండగులు ఎత్తుకెళ్లారు. బోగీకి వేసిన సీలు తొలగించి ఉండటం, బాంబుల తో కూడిన బాక్సు కనిపించకపోవడంతో.. మహా రాష్ట్రలోని పుల్గావ్ నుంచి పంజా బ్లోని పఠాన్కోట్ వెళ్తున్న ప్రత్యేక రైలును ఆదివారం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేసినట్లు సర్కిల్ ఆఫీసర్ శరద్ ప్రతాప్ సింగ్ తెలిపారు.
ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారని, దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. మధ్యప్రదేశ్లోని బినా–ఝాన్సీల మధ్య రైలు పలు చోట్ల ఆగిందని, చోరీ ఆ రెండు ప్రాంతాల మధ్యే జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. ఝాన్సీ కలెక్టరేట్లో పని చేస్తూ పాక్ గూఢచార సంస్థలకు ఆర్మీ సమాచారం చేరవేస్తున్నాడన్న ఆరోప ణలతో అరెస్టయిన వ్యక్తికీ.. తాజా ఘటనకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమా నిస్తున్నారు.