Chota Shakeel
-
Dawood: చోటా షకీల్ కీలక ప్రకటన
ఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం(67) ఆరోగ్యంపై గత రెండు రోజులుగా రకరకాల కథనాలు వస్తున్నాయి. విష ప్రయోగం జరిగిందని, ఆరోగ్యం విషమించి చావుబతుకుల మధ్య కరాచీ ఆస్పత్రిలో ఉన్నాడని.. ఇలా ప్రచారాలు జరిగాయి. ఈలోపు దావూద్ దగ్గరి బంధువు, పాక్ క్రికెట్ దిగ్గజం జావెద్ మియాందద్ హౌజ్అరెస్ట్ కావడం, కాసేపటికే.. దావూద్ చనిపోయాడంటూ ఇంటర్నెట్లో పోస్టులు కనిపించాయి. దీనికి తోడు పాక్‌లో ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలగడంతో ఆ వార్తల్ని దాదాపుగా ధృవీకరించేసుకున్నాయి మన మీడియా సంస్థలు. అయితే.. నిన్న సాయంత్రం నుంచి దావూద్ చనిపోలేదంటూ పలు పాక్ మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తూ వస్తున్నాయి. ఈ తరుణంలో దావూద్ అనుచరుడు, డీ-కంపెనీ వ్యవహారాలను చూసుకునే చోటా షకీల్ భారత్‌కు చెందిన ఓ మీడియా ఛానల్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. దావూద్ ఇబ్రహీం ఆరోగ్య విషయంలో వస్తున్న కథనాల్ని చోటా షకీల్ ఖండించాడు. విషప్రయోగం జరిగిందన్న కథనాలతో పాటు దావూద్ ఆరోగ్యం క్షీణించిందన్న ప్రచారాన్ని షకీల్ కొట్టిపారేశాడు. భాయ్ వెయ్యి శాతం ఫిట్‌గా ఉన్నాడు అంటూ ఓ భారతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోటా షకీల్ చెప్పాడు. మరోవైపు నిఘా వర్గాలు సైతం దావూద్‌పై విష ప్రయోగం జరిగిందన్న ప్రచారాన్ని ఊహాగానంగా తేల్చేశాయి. ఐఎస్ఐ ఏజెంట్లు.. తన నమ్మకస్తుల భద్రతా వలయం నడుమ దావూద్ భద్రంగానే ఉన్నట్లు చెబుతున్నాయి. అమెరికా దావూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించినప్పటికీ.. ఐఎస్ఐ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటోంది. అండర్ వరల్డ్ మాఫియా డాన్‌గా, ముంబై వరుస పేలుళ్ల కేసుతో ఇండియాకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న దావూద్ ఇబ్రహీం.. కరాచీలో తలదాచుకున్నాడని భారత్ తొలి నుంచి వాదిస్తోంది. అయితే పాక్ మాత్రం దానిని ఆరోపణగానే తోసిపుచ్చుతూ వస్తోంది. తాజాగా.. జాతీయ భద్రతా సంస్థ NIA విడుదల చేసిన ఛార్జిషీట్లో దావూద్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఉన్నాయి. -
దావూద్ ఇబ్రహీంపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా?
ఢిల్లీ: గ్లోబల్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై భారీ రివార్డు ప్రకటించింది భారత ఉగ్రవాద వ్యతిరేక సంస్థ ఎన్ఐఏ. దావూద్ గురించి సమాచారం అందించిన వాళ్లకు పాతిక లక్షల రూపాయలు అందిస్తామని ప్రకటించింది. దావూద్‌తో పాటు అతని అనుచరుడు చోటా షకీల్ మీద కూడా రూ.20 లక్షలు ప్రకటించింది జాతీయ విచారణ సంస్థ. భారత ఉగ్రవాద వ్యతిరేక విభాగాల్లో టాప్ అయిన ఎన్ఐఏ.. తాజాగా దావూద్‌కు సంబంధించి ఫొటోను సైతం విడుదల చేసింది. దావూద్, చోటా షకీల్‌తో పాటు ఉగ్రవాదులైన అనీస్ ఇబ్రహీం, జావెద్ చిక్నా, టైగర్ మెమోన్‌ల మీద రూ.15 లక్షల బౌంటీ ప్రకటించింది ఎన్ఐఏ. దావూద్‌తో పాటు ఇతరులంతా కలిసి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్, అల్ కాయిదాలతో కలిసి పని చేస్తున్నారని, బడా వ్యాపారవేత్తలను, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. వీళ్ల గురించి సమాచారం అందించిన వాళ్లకు రివార్డు అందిస్తామని పేర్కొంది. ► 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం.. పన్నెండు చోట్ల పేలుళ్లతో 257 మంది అమాయకుల మరణానికి, 700 మంది గాయపడడానికి కారణం అయ్యాడు. ► గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ఐరాస భద్రతా మండలి దావూద్‌ను గుర్తించగా.. అరెస్ట్‌ను తప్పించుకోవడానికి దావూద్ పాక్‌లో తలదాచుకున్నాడు. ఈ విషయాన్ని 2018లో భారత్ సైతం ధృవీకరించింది. తాజాగా భద్రతా మండలి రిలీజ్ చేసిన ఉగ్రవాద జాబితాలో దావూద్ ఉండగా.. కరాచీ పేరిట అతని చిరునామా సైతం ఉండడం గమనార్హం. ► అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా తరలించడానికి పాకిస్తాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థల సహాయంతో ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి డీ-కంపెనీ భారతదేశంలో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసిందని దర్యాప్తులో తేలింది. ► మే నెలలో ఎన్ఐఏ 29 ప్రాంతాల్లో దాడులు చేసింది. అందులో హాజీ అలీ దర్గా, మహిమ్ దర్గా ట్రస్టీ అయిన సమీర్ హింగోరా(1993 ముంబై పేలుళ్లలో దోషి), సలీం ఖురేషీ(ఛోటా షకీల్ బావమరిది), ఇతరులకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ► 2003లో, దావూద్ ఇబ్రహీంను భారతదేశం, అమెరికాలు గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించాయి. అంతేకాదు 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిపై 25 మిలియన్ల డాలర్ల రివార్డును సైతం ప్రకటించాయి. ► ముంబై బాంబు పేలుళ్ల కేసు, పలు ఉగ్ర సంబంధిత కార్యకలాపాలతో పాటు దోపిడీలు, హత్యలు, స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా దావూద్‌పై కేసులు నమోదు అయ్యాయి. ► 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో, దావూద్ తాజ్ మహల్ హోటల్‌తో సహా నగరంలో పేలుళ్లకు ఉగ్రవాదులను తరలించాడు. ► 2013 ఐపీఎల్ సమయంలో తన సోదరుడు అనీస్ సాయంతో బెట్టింగ్ రాకెట్‌ను దావూద్ నడిపించాడని కొన్ని జాతీయ మీడియా హౌజ్‌లు కథనాలు వెలువరించాయి. ► డీ కంపెనీ.. ప్రస్తుతం ఆఫ్రికా దేశాలను పట్టి పీడిస్తోందని, నైజీరియాకు చెందిన బోకో హరామ్ ఉగ్ర సంస్థలో పెట్టుబడులు పెట్టిందని సమాచారం. ఇదీ చదవండి: శాఖ మార్చిన కాసేపటికే మంత్రి రాజీనామా -
సమాధానం చెప్పాల్సిన పని లేదు: చోటా షకీల్
ఇస్లాంబాద్: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీలో నివసిస్తున్నాడన్న వార్తలను పాకిస్తాన్ ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను దావూద్ ప్రధాన అనుచరుడు చోటా షకీల్ బుధవారం ఖండించారు. కరాచీలో ఒక ఖరీదైన భవనంలో ఉన్నాడని భారత మీడియా చూపించిందని ఈ విషయంలో పూర్తి బాధ్యత దానిదే అని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌తో సహా తాము ఏ ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపాడు. సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తూ ఉంటాయని, వాటన్నింటికి తాము బాధ్యత వహించబోమని తెలిపాడు. సామాజిక మాధ్యమాలలో విలువైన బంగ్లాలలో ఉంటూ, ఖరీదైన కార్లలలో తిరుగుతారని ఏవేవో రాస్తారని వాటన్నింటికి మేం ఎలా బాధ్యత వహిస్తామని చోటా షకిల్ ప్రశ్నించాడు. 1993 ముంబై పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం దేశం విడిచి పారిపోయి పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ చాలా సంవత్సరాల పాటు ఖండించింది. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్నట్లు పాక్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. చదవండి: పాక్‌లోనే దావూద్..! -
దావూద్ రైట్ హ్యాండ్.. రకరకాల కథలు
సాక్షి, న్యూఢిల్లీ : దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు, గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దావూద్ కుడి భుజంగా మెదులుతూ దశాబ్దాలుగా డీ-గ్యాంగ్ కార్యకలాపాలను షకీలే చూసుకుంటున్నాడు. అయితే అతను ఇప్పుడు ప్రాణాలతో లేడనేది దాని సారాంశం. దీనికి రకరకాల కథనాలు వినిపిస్తుండగా.. అందులో ఓ కోణం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. పాక్ నిఘా సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) అతన్ని ప్రాణాలు తీసిందంట. షకీల్‌కు, దావూద్‌కు మనస్ఫర్థలు వచ్చాక.. వారి మధ్య సయోధ్య కోసం ఐఎస్ఐ మధ్యవర్తిత్వం వహించిందని... అయితే అది విఫలం కావటంతో షకీల్ ఏక్షణానైనా తమ దేశానికి వ్యతిరేకంగా మారి భారత్‌కు సహకరిస్తాడన్న ఉద్దేశంతోనే చంపిందన్నది ఆ కథనం సారాంశం. చంపేశాక శవాన్ని సీ-130 రవాణా విమానంలో కరాచీకి తరలించి. గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారని.. ఈ విషయం ప్రపంచానికి తెలీకుండా చాలా జాగ్రత్త పడ్డారంట. ఇక షకీల్ కుటుంబ సభ్యులను లాహోర్‌లోని ఓ ఇంటికి తరలించారని... దావూద్‌కు కూడా ఈ సమాచారం ఆలస్యంగా చేరిందనేది అందులో పేర్కొని ఉంది. ఇక మిగతా కథల్లో.. జనవరి 6, 2017న ప్రత్యర్థులు అతన్ని చంపారని.. ఈ మేరకు అతని గ్యాంగ్‌కు చెందిన బిలాల్‌కు ముంబైకి చెందిన ఓ గ్యాంగ్ స్టర్‌కు మధ్య జరిగిన ఆడియో సంభాషణల టేపు ఒకటి చక్కర్లు కొడుతోంది. గుండెపోటుతో మరణించాడనేది మరో కథనం వినిపిస్తోంది. మరో కథలో అతను ప్రాణాలతోనే ఉన్నాడని.. దావూద్‌తో సంబంధాలను తెగదెంపులు చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాడని చెబుతున్నారు. కానీ, గతంలో ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో షకీల్ మాట్లాడుతూ.. తన తుది శ్వాస వరకు భాయ్(దావూద్) తోనే ఉంటాడని చెప్పటం చూశాం. ఏది ఏమైనా ప్రస్తుతం అతని జాడ అంతుచిక్కకపోవటంతో అతను బతికున్నాడా? లేదా? అన్న విషయంపై భారత నిఘా వర్గాల్లో కూడా స్పష్టత కొరవడింది. గతంలో దావూద్ విషయంలో కూడా ఇలాగే అనారోగ్యం.. చావుబతుకుల్లో ఉన్నాడంటూ వార్తలు రావటం చూశాం. దావూద్ కోసం భారత్ మాస్టర్ ప్లాన్ ఇది కూడా చదవండి -
దావూద్ ఆస్తుల వేలానికి వెళ్తావా?
బిడ్డర్‌కు ఛోటా షకీల్ నుంచి బెదిరింపు ముంబై: మాఫియా డాన్ దావూద్ ఆస్తుల వేలంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న ఓ జర్నలిస్టుకు.. దావూద్ అనుచరుడు ఛోటా షకీల్‌నుంచి బెదిరింపు ఎస్ఎంఎస్ వచ్చింది. ‘వేలంలో పాల్గొంటావా? అసలు నీకేమైంది? బాగానే ఉన్నావనుకుంటున్నా!’ అని ఆ సందేశంలో ఉంది. దావూద్‌కు చెందిన ఏడు భవనాలను స్వాధీనం చేసుకుని, వేలంలో అమ్మడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ చర్యలు చేపట్టింది. దక్షిణ ముంబైలోని పక్ మోడియా వీధిలోని ‘రౌనక్ అఫ్రోజ్’ అనే హోటల్ భవనానికి ఈనెల 9న వేలం జరగనుంది. ఈ హోటల్ విలువను ప్రభుత్వం రూ. 1.18 కోట్లుగా నిర్ణయించింది. భవనాన్ని కొనుగోలు చేసేందుకు మాజీ జర్నలిస్ట్ బాలకృష్ణన్ తన ఎన్జీవో సంస్థ అయిన ‘దేశ్ సేవ సమిత్’ (శిశు సంక్షేమం, స్త్రీ సాధికారతకోసం పనిచేస్తోంది) తరపున బిడ్డింగ్ వేశారు.