బిడ్డర్‌కు ఛోటా షకీల్ నుంచి బెదిరింపు
ముంబై: మాఫియా డాన్ దావూద్ ఆస్తుల వేలంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న ఓ జర్నలిస్టుకు.. దావూద్ అనుచరుడు ఛోటా షకీల్‌నుంచి బెదిరింపు ఎస్‌ఎంఎస్ వచ్చింది. ‘వేలంలో పాల్గొంటావా? అసలు నీకేమైంది? బాగానే ఉన్నావనుకుంటున్నా!’ అని ఆ సందేశంలో ఉంది. దావూద్‌కు చెందిన ఏడు భవనాలను స్వాధీనం చేసుకుని, వేలంలో అమ్మడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ చర్యలు చేపట్టింది. దక్షిణ ముంబైలోని పక్ మోడియా వీధిలోని ‘రౌనక్ అఫ్రోజ్’ అనే హోటల్ భవనానికి ఈనెల 9న వేలం జరగనుంది.
ఈ హోటల్ విలువను ప్రభుత్వం రూ. 1.18 కోట్లుగా నిర్ణయించింది. భవనాన్ని కొనుగోలు చేసేందుకు మాజీ జర్నలిస్ట్ బాలకృష్ణన్ తన ఎన్‌జీవో సంస్థ అయిన ‘దేశ్ సేవ సమిత్’ (శిశు సంక్షేమం, స్త్రీ సాధికారతకోసం పనిచేస్తోంది) తరపున బిడ్డింగ్ వేశారు.
దావూద్ ఆస్తుల వేలానికి వెళ్తావా?
Published Sun, Dec 6 2015 1:08 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
Advertisement
Advertisement