Chromecast
-
అమెజాన్, గూగుల్ దోస్తీ
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత తమ విభేదాలను పక్కన పెట్టి చేతులు కలిపాయి. దీంతో గూగుల్‌కి చెందిన యూట్యూబ్ ఇకపై అమెజాన్ ఫైర్ టీవీ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. అలాగే అమెజాన్‌కు చెందిన ప్రైమ్ వీడియో కంటెంట్‌ను గూగుల్ క్రోమ్‌క్యాస్ట్ యూజర్లు కూడా వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ టీవీ డివైజెస్‌లో ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ను పొందుపర్చనుండగా, ఫైర్ టీవీ డివైజ్‌లలో యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ కిడ్స్ యాప్స్ కూడా లభ్యం కానున్నాయి. ఇరు సంస్థలు ఈ విషయం వెల్లడించాయి. అయితే, ఎప్పట్లోగా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందనేది నిర్దిష్టంగా చెప్పలేదు. తాజా దోస్తీతో ఇరు సంస్థల మధ్య కొన్నాళ్లుగా నెలకొన్న విభేదాలకు ఫుల్స్టాప్ పడినట్లయింది. అమెజాన్ సుమారు నాలుగేళ్ల నుంచి గూగుల్‌కి చెందిన క్రోమ్‌క్యాస్ట్ స్ట్రీమింగ్ అడాప్టర్ తమ పోర్టల్‌లో విక్రయించడం నిలిపేసింది. -
ఎయిర్టెల్ వారి సెట్ టాప్ బాక్స్ వచ్చేసింది!
సెటాప్ బాక్స్ లతో మరో సంచలనానికి తెరతీయాలని చూస్తున్న రిలయన్స్ జియో కంటే ముందస్తుగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తన ఇంటర్నెట్ టీవీ సెట్ టాప్ బాక్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉండే అన్ని కంటెంట్లను చూసుకునేందుకు వీలుగా, 500 శాటిలైట్ టీవీ ఛానల్స్ పైగా అందించేలా సెట్ టాప్ బాక్స్ ను బుధవారం కంపెనీ ఆవిష్కరించింది. 4వేల యూట్యూబ్ కంటెంట్ ను ఇవి సపోర్టు చేస్తోంది. ఈ ఎయిర్ టెల్ సెట్ టాప్ బాక్స్ ఏ టీవీనైనా స్మార్ట్ టీవీగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ నుంచి ఏ కంటెంట్ నైనా యూజర్లు తిలకించవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూజర్లు అప్లికేషన్లను, ప్లే గేమ్స్ టీవీపైకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దేశంలోఆండ్రాయిడ్ టీవీ ఆధారంగా లాంచ్ అయిన తొలి హైబ్రిడ్ డీటీహెచ్ సెట్ టాప్ బాక్స్ తమదేనని కంపెనీ చెబుతోంది. ఈ కొత్త సెట్ టాప్ బాక్స్ లో నెట్ ఫ్లిక్స్ ప్రీలోడెడ్ గా ఉంటుంది. దీని ధర రూ.4999గా కంపెనీ పేర్కొంది. 4999తో మూడు నెలల డిజిటల్ టీవీ సబ్స్క్రిప్షన్ ను ఇది అందిస్తోంది. నేటి నుంచి అమెజాన్ ఇండియాలో ఇది ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఆఫ్ లైన్ స్టోర్లలోనూ త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఏదైనా పనిమీద ఉన్నప్పుడు టీవీషోలను పాజ్ చేయడం, రికార్డు లేదా రివైండ్ చేయడం కూడా దీని ద్వారా చేసుకోవచ్చు. అయితే కంటెంట్ ను రికార్డు చేసుకోవడానికి యూజర్లు యూఎస్బీ పెన్ డ్రైవ్ ను ఇన్ సర్ట్ చేయాల్సి ఉంటుంది. డౌన్ లోడ్ యాప్స్ ను సేవ్ చేసుకోవడానికి ఎస్డీ కార్డును వాడుకోవచ్చు. గేమ్ ప్యాడ్ యాప్ ద్వారా ఇంటర్నెట్ టీవీలోనే గేమ్స్ ను ఆడుకోవచ్చు. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకునే వెసులుబాటును ఇది అందిస్తోంది. ఒకవేళ అవసరమైతే మొబైల్ హాట్ స్పాట్ ను లేదా హోమ్ లోని నెట్ వర్క్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. 2గిగిహెడ్జ్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్ తో రూపొందిన ఈ సెట్ టాప్ బాక్స్ 2జీబీ ర్యామ్ ను కలిగి ఉంది. యాప్స్ కోసం 8జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్, ఎస్ డీ కార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ మెమరీ, వై-ఫై రిసీవర్, బ్లూటూత్ ఫంక్షన్ దీనిలో మిగతా ఫీచర్లు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న బ్రాడ్ బ్యాండ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ప్రజలకోసం దీన్ని తీసుకొచ్చినట్టు భారతీ ఎయిర్ టెల్ సీఈవో, డైరెక్టర్ సునిల్ తాల్దార్ చెప్పారు. వెబ్ లోని వరల్డ్ క్లాస్ కంటెంట్ ను టీవీపైకి తమ ఇంటర్నెట్ టీవీ తీసుకొస్తుందన్నారు. -
ఫేస్బుక్ వీడియోలను టీవీలోనూ చూడొచ్చు!
ఫేస్ బుక్ వీడియోలను టెలివిజన్ స్క్రీన్ పై చూడాలనుకుంటున్నారా..? అయితే మీ కోరిక సాధ్యమవుతుందట. వీడియో స్ట్రీమింగ్ సర్వీసులో కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో కొత్త ఫీచర్‌తో మన ముందుకు రాబోతుంది. ఆ ఫీచర్ తో తన వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను టెలివిజన్ స్క్రీన్‌పై అందించేందుకు టెస్టింగ్ ప్రారంభించిందట. దీంతో యూజర్లకు అందించే వీడియో కంటెంట్‌ను ఫేస్బుక్ పెంచుకోవాలనుకుంటోంది. ఇటీవలే లైవ్ బ్రాండ్కాస్టింగ్ సర్వీసును ప్రారంభించిన ఫేస్బుక్, తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ద్వారా ఫేస్బుక్ వీడియోలను టీవీలో కూడా వీక్షించేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఎయిర్‌ప్లే, క్రోమ్కాస్ట్ల ద్వారా ఈ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను టీవీలకు కనెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఎయిర్‌ప్లే, క్రోమ్‌కాస్ట్ ద్వారా వీడియోలను యాప్ నుంచి టీవీలోకి బెటర్‌గా అందించడానికి ఫేస్బుక్ యాప్‌ను టెస్ట్ చేస్తున్నామని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ యాప్‌లో వీడియో ప్లేయర్‌ను మినిమైజ్ చేసి, న్యూస్ ఫీడ్‌ను కూడా చూసుకోవచ్చని మార్కెటింగ్ ల్యాండ్ రిపోర్టులు చెబుతున్నాయి. క్రోమ్‌కాస్ట్ యూజర్లు ప్లే లిస్ట్‌ను క్రియేట్ చేసుకుని ఒకదాని తర్వాత మరొకటి ప్లే అయ్యేలా సెట్ కూడా చేసుకోవచ్చని తెలిపాయి. ఈ కొత్త ఫీచర్‌తో ఫేస్బుక్, వీడియో స్ట్రీమింగ్ డిపార్ట్మెంట్లో ఆధిపత్య స్థానానికి వెళ్లనుంది. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్స్కు ఈ ఫీచర్ ఎక్కువగా ఉపయోగపడనుంది. దీంతో లైవ్‌లను ఫేస్బుక్ యాప్‌లో వీక్షించే యూజర్లు ఇక నుంచి బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం లభిస్తుందని కంపెనీ చెబుతోంది.