నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురి మృతి
చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ముగ్గురు మృతి చెందగా, మరో 17మంది గాయపడ్డారు. తిరునల్వేలిలో నిర్మాణం ఉన్న చర్చ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గత రాత్రి స్లాబ్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా కూలినట్లు తెలుస్తోంది.
ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు అందచేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.