cigarattes
-
సిగరేట్ పీక ఇష్టానుసారంగా పడేస్తే ఏం జరుగుతుంది?
-
సిగరెట్ అక్రమ రవాణా.. చర్యలు తీసుకోవాలన్న ప్రతినిధులు
ప్రభుత్వ ఖజానాకు ఏటా దాదాపు రూ.13,000 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతున్న సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం ఎఫ్‌ఏఐఎఫ్‌ఏ (ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్) గతంలో ప్రభుత్వాన్ని అభ్యర్థించిన విషయం తెలిసిందే. అక్రమ రవాణా ప్రక్రియలో భాగంగా నేరాలు కూడా పెరుగుతున్నట్లు మెమోరాండంలో పేర్కొన్నారు. సిగరెట్ స్మగ్లింగ్‌ను అరికట్టడానికి పన్నులను తగ్గించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో వాణిజ్య పంటల సాగులో ఉన్న లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులకు అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇదీ చదవండి: ఓవెన్ సైకిళ్లు వచ్చేశాయ్.. ఓ లుక్కేయండి.. అక్రమ రవాణాను అరికట్టడానికి పసిడిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నారన్న వార్తలను అసోసియేషన్ ప్రస్తావిస్తూ, ఇదే రకమైన చర్యలు సిగరెట్ పరిశ్రమకు సంబంధించి ఉండాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఫోన్ల స్మగ్లింగ్ నిరోధానికీ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఫోన్ అక్రమ రవాణా వల్ల కేంద్ర ఖజానాకు సుమారు 3వేలకోట్ల నష్టం వాటిల్లుతుండగా, సిగరెట్ అక్రమ రవాణా విషయంలో ఈ మొత్తం సుమారు రూ.13వేలకోట్లు ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టేలా బడ్జెట్లో చర్యలుంటాయని ఆశిస్తున్నారు. -
డీవీడి రైటర్లో రూ. 40 లక్షలు ఖరీదు చేసే బంగారం
చెన్నై: అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు వేర్వేరు ఘటనల్లో దాదాపు 40 లక్షలు ఖరీదు చేసే బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారలు తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 29న దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు బ్యాగ్‌లో ఉంచిన పోర్టబుల్ డిజిటల్ వీడియో డిస్క్(డీవీడీ) రైటర్లో దాచిన బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు. ఆ బ్యాగ్‌ను మరింతగా చెక్ చేయగా సుమారు 15 మొబైల్ ఫోన్లు, దాదాపు 9 వేల విదేశీ సిగరెట్లు లభించినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. మరోక ఘటనలో దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడు ఏకంగా పేస్ట్ రూపంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఇద్దరు ప్రయాణకుల నుంచి దాదాపు రూ. 40 లక్షలు విలువ చేసే 900 గ్రాముల బంగారం, మొబైల్ ఫోన్లు, సుమారు రూ. 3.15 లక్షలు విలువ చేసే విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: యమునా నదిపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు... ప్రూవ్ చేసిన అధికారి) -
కరోనా: 116 ఏళ్ల వృధ్దుడి కోరిక ఏంటంటే...
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు సంబంధించి భయంకరమైన విషయం ఏమిటంటే, సిగరెట్ అమ్మకాలపై నిషేధం విధించడం. ‘మే 8వ తేదీ సిగరెట్ లేకుండానే నా పుట్టిన రోజు గడచి పోవడం నాకు బాధాకరం’ ఈ మాటలు అన్నదెవరంటే 116 ఏళ్ల ప్రపంచ కురువద్ధుడైన ఫ్రెడీ బ్లామ్. ఆయన దక్షిణాఫ్రికాలోని అడలాయిడ్‌లో 1904, మే 8వ తేదీన జన్మించారు. ఆయనకు 14 ఏళ్లు ఉన్నప్పుడు, అంటే 1918లో ఆయన సోదరి స్పానిష్ ఫ్లూతో చనిపోయారట. ఆ వ్యాధి తనకు సోకకుండా బ్లామ్ ఆరు బయట గడ్డిలో పడుకునే వారట. అప్పట్లో స్పానిష్ ఫ్లూ వల్ల దక్షిణాఫ్రికాలో దాదాపు మూడు లక్షల మంది మరణించారు. (ఇవాంకా వ్యక్తిగత సహాయకురాలికి కరోనా!) కరోనా వైరస్ మహమ్మారి ఎంతటి ప్రమాదకారో బ్లామ్ అర్థం చేసుకోలేక పోతున్నారని, ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా సిగరెట్లు అందుబాటులో లేకపోవడం వెలితిగా భావించారని బ్లామ్ పొరిగింటాయన గైరోనెసా మైకేల్ తెలిపారు. ‘ఈ పుట్టిన రోజుకు సిగరెట్లు కావాలని కోరుకున్నాను. దేశాధ్యక్షుడు సిరిల్ రమఫోసా అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు’ అంటూ ఏకంగా దేశాధ్యక్షుడినే ఆయన తప్పు పట్టారు. గిన్నీస్ బుక్‌లోకి ఆయన మాత్రం ఎక్కలేదు. ఆయనకన్నా నాలుగేళ్లు చిన్న వాడైన బ్రిటన్ నివాసి, 112 ఏళ్ల బాబ్ వెయిటన్ ప్రపంచ వద్ధుడిగా గిన్నీస్ బుక్‌లోకి ఎక్కారు. (బాంబు పేలుడు : ఆర్మీ మేజర్ మృతి) బ్లామ్ గురించి ఎవరూ గిన్నీస్ బుక్ దష్టికి తీసుకెళ్లక పోవడం వల్లనే ఆయన పేరు రికార్డుల్లో నమోదు కాలేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన పుట్టిన రోజు గురించి మీడియా శుక్రవారం నాడు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు బ్లామ్ ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. మధ్యాహ్నం ఆయన మనవళ్లు, ఇరుగుపొరుగు వారు వచ్చి ఆయనకు పుట్టిన రోజు అభినందనలు తెలుపుతూ పాట పాడారు. కేప్‌టౌన్‌లో వ్యవసాయం చేసుకుని బతికిన బ్లామ్ చివరి దశలో 106 ఏళ్ల వరకు గార్డెనర్‌గా పనిచేస్తూ కట్టెలు కూడా కొట్టేవారట. ఆయన భార్య కూడా ఇప్పటికీ ఉన్నారు. ‘నేను ప్రతి రోజు డిస్ప్రిన్ టాబ్లెట్ వేసుకుంటా. యూనో తాగుతాను. లాక్డౌన్ విధించే వరకు సిగరెట్లు కూడా తాగాను. అంతకుమించిన ఆరోగ్య రహస్యం మరేమి లేదు’ ఓ ప్రశ్నకు సమాధానంగా బ్లామ్ చెప్పారు. (పుతిన్‌కు కిమ్ జోంగ్ ఉన్ లేఖ) -
సిగరెట్ కోసం బయటకు.. రూ.11వేల ఫైన్
పారిస్ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. అయితే ప్రభుత్వాలు ఎన్ని కట్టు దిట్టమైన చర్యలు తీసుకున్నా వాటిని అతిక్రమిస్తున్నవారి సంఖ్యకూడా పెరుగుతూనే ఉంది. ఫ్రాన్స్‌లో లాక్డౌన్ నేపథ్యంలో ఓ యువకుడికి సిగరెట్లు దొరక్కపోవడంతో ఏకంగా ఓ భారీ సాహసానికే ఒడిగట్టాడు. అది విఫలమవ్వడంతో అంతే భారీగా జరిమానును కూడా కట్టాడు. స్పెయిన్‌లో కాటలోనియాలోని లాజోన్క్వెరా గ్రామంలో సిగరెట్లు విరివిగా దొరకడమే కాకుండా ధర కూడా తక్కువ కావడంతో ఫ్రాన్స్‌కి చెందిన యువకుడు అక్కడికి వెళ్లాలనుకున్నాడు. ముందుగా ఫ్రాన్స్‌లోని తన స్వస్థలమైన పెర్పిగ్నన్ నుంచి కారులో బయలుదేరాడు. అయితే మధ్యలోనే పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగినా, సిగరెట్లపై ఆశమాత్రం చావలేదు. ఎలాగైన సిగరెట్ తాగాలనే పిచ్చితో ఏకంగా పోలీసుల కళ్లుగప్పి పైరెనీస్ పర్వతాల గుండా స్పెయిన్‌కు వెళ్లాలని భావించాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత అతను పట్టుతప్పి లోయలో పడ్డాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక సహాయం కోసం తన ఫోన్ నుంచి అత్యవసర సిబ్బందికి మెసేజ్ చేశాడు. వెంటనే హెలీకాప్టర్‌లో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫ్రెంచ్ మౌంటైన్ పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా అతన్ని కాపాడారు. లాక్ డౌన్ సమయంలో నిబంధనలను అతిక్రమించినందుకుగానూ అతనికి 120 పౌండ్లు(దాదాపు 11,300 రూపాయలు)జరిమానా విధించారు. కాగా, ఫ్రాన్స్‌లో 70వేల మందికి పైగా కరోనా వ్యాధి బారినపడగా, 8వేల మందికి పైగా మరణించారు. ఇక పక్కనే ఉన్న స్పెయిన్‌లో 1 లక్ష 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా, 12 వేల మందికిపైగా మరణించారు. -
రూ. 6 కోట్ల విదేశీ సిగరెట్ల సీజ్
సాక్షి, హైదరాబాద్ : అరబ్, తదితర దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్న విదేశీ సిగరెట్లను నగరానికి చెందిన డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో డీఆర్ఐ పోలీసులు శాంషాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిఘా వేశారు. శుక్రవారం అర్థరాత్రి 01.30 గంటల తర్వాత ఓ కంటైనర్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. కంటైనర్‌లో ఉన్న బాక్సులన్నింటిలో విదేశీ సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు. కంటైనర్‌ను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏయే దేశాల నుంచి సిగరెట్లను దిగుమతి చేసుకుంటున్నారో తెలుసుకునేందుకు అధికారులు యత్నిస్తున్నట్లు తెలిసింది. కాగా, పట్టుబడిన విదేశీ సిగరెట్ల విలువ రూ. 6.33 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తనిఖీల సమయంలో దొరికిపోకుండా ఉండేందుకు ప్రత్యేకమైన బాక్సుల్లో సిగరెట్లను రవాణా చేస్తున్నట్లు వెల్లడించారు. -
స్మగ్లింగ్‌లో సిగరెట్లదే అగ్రస్థానం
గతేడాది రూ. 200 కోట్ల సిగరెట్ల పట్టివేత 5 కేజీల బంగారంతో రెండో స్థానంలో బంగారం కాకినాడ రేవు ఆదాయం తగ్గి.. కృష్ణపట్నంలో పెరిగింది సాక్షి, అమరావతి: రాష్ట్రంలోకి అక్రమంగా తరలివస్తున్న వస్తువుల జాబితాల్లో మొదటి స్థానంలో సెగరెట్లు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో బంగారం ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి స్మగ్లింగ్ అవుతున్న రూ. 200 కోట్ల విలువైన సిగరెట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గడిచిన ఏడాదిలో 39 సిగరెట్ల స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయని, సుమారు రూ. 198.6 కోట్ల విలువైన 6,000 కార్టన్ల విదేశీ సిగరెట్లను పట్టుకొని ధ్వంసం చేసినట్లు రాష్ట్ర కస్టమ్స్ కమిషనర్ ఖాదర్ రెహమాన్ ‘సాక్షి’కి తెలిపారు. ఇదే సమయంలో 5 బంగారం స్మగ్లింగ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. మొత్తం రూ. 1.37 కోట్ల విలువైన 4.67 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్మగ్లింగ్‌ను అరికట్టడం ద్వారా గతేడాది రూ. 311 కోట్ల అదనపు ఆదాయం కస్టమ్స్ శాఖకు వచ్చినట్లు ఆయన తెలిపారు. తగ్గిన కాకినాడ రేవు జోరు బొగ్గు, ఎరువుల దిగుమతులు గణనీయంగా తగ్గడంతో కాకినాడ రేవు ఆదాయం బాగా పడిపోయింది. 2015–16లో రూ. 1,208 కోట్లుగా ఉన్న కస్టమ్స్ ఆదాయం 2016–17లో 8 శాతం తగ్గి రూ. 1,109 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో కృష్ణపట్నం ఆదాయంలో 24 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. కృష్ణపట్నం రేవు కస్టమ్స్ ఆదాయం రూ. 1,735 కోట్ల నుంచి రూ. 2,152 కోట్లకు పెరిగింది. పొగాకు, గ్రానైట్, మిర్చి, పత్తి ఎగుమతులలో 20 శాతానికి పైగా వృద్ధి నమోదు కావడం తో కృష్ణపట్నం ఆదాయం పెరిగింది. ఎగుమతిదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలు కూడా 150 శాతం పెరిగాయి. 2015–16లో ఎగుమతి ప్రోత్సాహకాలు (కస్టమ్ డ్యూటీ వెనక్కి ఇవ్వడం) రూ. 100 కోట్లుగా ఉంటే 2016–17లో ఈ మొత్తం రూ. 250 కోట్లు దాటింది.