cigarette smoking
-
వివేచన హక్కుపై నిషేధమా?
మంచేదో చెడేదో, తప్పేదో ఒప్పేదో, నైతికతేదో అనైతికమేదో మనకు మనం నిర్ణయించుకోగల మన సామర్థ్యమే నిస్సందేహంగా మనల్ని తక్కిన జంతువులకు భిన్నంగా ఉంచుతోంది. ఇతరులను మనం ప్రమాదంలోకి నెట్టనంత వరకు మనకున్న ఈ వివేచన హక్కు అభేద్యమైనది. అదే సమయంలో, మనపై విధించిన పూర్తిస్థాయి నిషేధం ఏదైనా... అది మనల్ని మనిషిగా తక్కువ చేసేస్తుంది. ప్రభుత్వం నిజాయితీగా కనుక ధూమపాన నిర్మూలన జరగాలని కోరుకుంటూ ఉంటే సృజనాత్మకమైన, చిరస్మరణీయ ప్రచారాన్ని చేపట్టాలి. పొగతాగే వారికి నచ్చజెప్పి ఆ అలవాటును మాన్పించటానికి అవకాశాలు న్నాయి. కానీ దండనలతో మార్పు తేచ్చే ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతాయి. బ్రిటన్‌లో గత ప్రభుత్వం ఇలాంటి నిష్ఫల ప్రయత్నమే చేసింది.అప్పుడు నాకు 16 ఏళ్లు ఉంటాయి. కానీ, నిన్ననే జరిగినంతగా ఆ సంగతి గుర్తుండి పోయింది. వీకెండ్ కోసం స్టోవ్ (యూఎస్‌లోని వమాంట్ రాష్ట్రంలో ఒక పట్టణం) నుండి వచ్చాను నేను. అందరం కలిసి టీవీ చూస్తున్నాం. కిరణ్ సిగరెట్ తాగుతూ ఉంది. ‘క్యారీ ఆన్’ (ప్రసిద్ధ బ్రిటిష్ కామెడీ సీరీస్)లోని ఒక చిత్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు సగం వరకూ రాగానే, మధ్యలో ఒక వాణిజ్య ప్రకటన మా దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు బ్రిటిష్ పోలీసు అధికారులు రోడ్డు పక్కన ఉన్న ఒక కేఫ్‌ను దాటి నడుచుకుంటూ వెళుతుండగా, వారి చూపు ఒక అందమైన యువతిపైన పడుతుంది. ఎడమ చేతిలో పొడవాటి సిగరెట్‌తో ఉన్న ఆమె కొద్ది కొద్దిగా కాఫీని సిప్ చేస్తుంటుంది. ‘‘ఆమెను చూడు’’ అని మొదటి పోలీస్ ఆఫీసర్ గుసగుసగా అంటాడు. ‘‘సిగరెట్ తాగుతోంది కదా?’’ అని రెండో ఆఫీసర్. ‘‘ఆమె కాళ్లు నాకు నచ్చాయి.’’‘‘అవి, కాలుతున్న ఆమె సిగరెట్ పొడవంత ఉన్నాయి.’’‘‘ఆ పెదవులను ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది నాకు.’’‘‘కంపు కట్టే యాష్‌ట్రేని ముద్దు పెట్టుకున్నట్లా?’’ఆ డైలాగ్ తర్వాత ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ముందుకు సాగిపోతారు. ఆ అందమైన యువతి స్క్రీన్ వైపు చూసి నవ్వుతుంది. విడివడిన ఆమె పెదవుల మధ్య పలువరుస నికోటిన్ మరకలతో పొగచూరి, గోధుమ వర్ణంలో ఉంటుంది! ‘యాక్’ అని అసంకల్పితంగా అరిచేశాను నేను. నా వెన్నులో వణుకు పుట్టింది. కిరణ్ అయితే తను తాగుతూ ఉన్న సిగరెట్‌ను అప్పటికప్పుడు విసిరి పారేసింది. ఆ వీకెండ్లో ఆమె మళ్లీ సిగరెట్ తాగినట్లు నాకు గుర్తు లేదు.ఆ వాణిజ్య ప్రకటనకు రూపకర్తలు ఎవరో నాకు తెలియదు. ప్రభుత్వమే చెప్పి చేయించిందో, లేదా ఏదైనా ప్రైవేటు ట్రస్టుఅందుకు నిధులు సమకూర్చిందో కానీ అది మాత్రం చాలా ప్రభావ వంతంగా ఉంది. మన ప్రభుత్వం నిజాయతీగా కనుక ధూమపాన నిర్మూలన జరగాలని కోరుకుంటూ ఉంటే ఆ ప్రకటనలో ఉన్నట్లే సృజ నాత్మకమైన, చిరస్మరణీయ ప్రచారాన్ని చేపట్టాలి. పొగతాగే వారికి నచ్చజెప్పి ఆ అలవాటును మాన్పించటానికైతే అవకాశాలున్నాయి. కానీ దండనలతో వారిలో మార్పు తేచ్చే ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతాయి. అందుకే ధూమపానాన్ని నిషేధించాలన్న నిర్ణ యాలు ఘోరమైన తప్పిదాలుగా మిగులుతున్నాయి. బ్రిటన్‌లో గత ప్రభుత్వం ఇలాంటి నిష్ఫల ప్రయత్నమే చేసింది. మన ప్రభుత్వం అలా ఎప్పటికీ చేయదనే ఆశిస్తున్నాను. మంచేదో చెడేదో, తప్పేదో ఒప్పేదో, నైతికతేదో అనైతికమేదో మనకు మనం నిర్ణయించుకోగల మన సామర్థ్యమే నిస్సందేహంగా మనల్ని తక్కిన జంతువులకు భిన్నంగా ఉంచుతోంది. ఇతరులను మనం ప్రమాదంలోకి నెట్టనంత వరకు మనకున్న ఈ వివేచన హక్కు అభేద్యమైనది. అది మన వ్యక్తిత్వాన్ని కూడా నిర్వచిస్తుంది. అదే సమ యంలో, మనపై విధించిన పూర్తిస్థాయి నిషేధం ఏదైనా... మానవత లోని అత్యవసరతల్ని నిరాకరిస్తుంది. అది మనల్ని తక్కువ చేసేస్తుంది. సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం లేని పిల్లల్ని చూసి నట్లుగా మనల్ని చూస్తుంది. నిర్ణయించుకునే హక్కు నుండి మనం అవిభాజ్యంగా ఉండటం అన్న భావనతో ఇతరులు ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ ఒకే ఒక్క కార ణమే ఆ హక్కును నిలబెడుతుంది. మీకు భిన్నంగా ఉండటమనే నా హక్కులోనే నా వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది. అంతేకాదు, నాలోని ఆ భిన్న త్వం మీకు నచ్చకపోయినా మీరు గౌరవించాలనే నేను కోరుకుంటాను. పొగ తాగే విషయం కూడా ఇంతే. పొగ తాగకుండా ఉండేందుకు వెయ్యి మంచి కారణాలు ఉంటాయి. పొగ మాన్పించేందుకు నన్ను ఒప్పించటానికి పది లక్షల సానుకూల వాదనలు ఉంటాయి. కానీ అప్పటికి కూడా నేను పొగ తాగుతున్నానంటే మీరు నా మీద నిషేధం విధించకూడదు. నా ఇష్టాన్ని అడ్డుకోకూడదు. మీరిలా నా మంచి కోసమే చేస్తున్నారన్న మీ వాదన విచిత్రమై నది, నమ్మశక్యం కానిది. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అన్న దానిని నేను కాదనలేదు. నేనే కాదు, నాకు తెలిసిన ధూమమాన ప్రియులు ఎవరూ కూడా కాదనలేరు. అతిగా తినటం, మితిమీరిన వ్యాయామం, కళ్లకు ఒత్తిడి కలిగించుకోవటం, విపరీతంగా కోక్‌లు తాగటం... ఇవన్నీ కూడా హానికరం కాదని ఎవరూ అనరు. అయినప్ప టికీ వీటిల్లో దేనినైనా నేను ఇష్టపడితే కనుక, అప్పుడు కూడా నేను మాత్రమే సలహాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లే విషయాన్ని నిర్ణయించుకోవాలి. దాని వల్ల నేను ఇబ్బంది పడితే అలాగే కానివ్వండి. ఎందుకంటే నిర్ణయించుకునే హక్కులోనే ఆ నిర్ణయం వల్ల బాధ పడే హక్కు కూడా కలిసి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎలా ప్రవర్తించాలి? సమాధానం చాలా సరళమైనది, సూటిౖయెనది. నిషేధం విధించటం కాకుండా ఎవరికి వారు సిగరెట్‌కు దూరమయ్యేలా ప్రభావం చూపే చర్యలు తీసు కోవాలి. సిగరెట్ ప్యాకెట్ల మీద అతి పెద్ద, అత్యంత భయానకమైన ఆరోగ్య హెచ్చరికలను చేయవచ్చు. పన్నులను తరచుగా పెంచుతూ ఉండొచ్చు. (దీని వల్ల ఒక దశ తర్వాత ప్రభుత్వానికి రాబడి తగ్గవచ్చు లేదా ప్రతికూల ఉత్పాదకత సంభవించవచ్చు). ధూమపానానికి వ్యతి రేకంగా విస్తృత ప్రచారాన్ని చేపట్టేందుకు నిధులను అందజేయవచ్చు. ఈ మూడింటినీ నేను సమర్థిస్తాను. అంతేతప్ప ఎప్పుడూ కూడా ధూమపాన నిషేధానికి ప్రయత్నించకూడదు. వ్యక్తులు, సమూహాలు తాము కోరుకున్నప్పుడే తమకై తాము ఆ పనికి సంకల్పించటం జరుగుతుంది. వారి కోసం ప్రభుత్వమే ఆ పని చెయ్యకూడదు. మరింత స్పష్టంగా చెబుతాను. మంచి ప్రభుత్వాలు – పెద్దలు పిల్లల్లో పరిణతి తెచ్చే విధంగా – తమకు తాముగా నిర్ణయించుకునే అవకాశాన్ని, అవకాశంతో పాటుగా వచ్చే బాధ్యతను స్వీకరించే సమర్థతను తమ పౌరులకు అందిస్తాయి. ఆ విధంగా దేశం తన కాళ్ల మీద ఎలా నిలబడాలో నేర్చుకుంటుంది. ఇందుకు భిన్నంగా చెడు ప్రభుత్వాలు పెద్దల్ని కూడా పిల్లలుగా పరిగణిస్తూ వారికున్న నిర్ణయ అధికారాన్ని లాగేసుకుని తమ సొంత నిర్ణయాలను వారిపై అమలు చేస్తాయి. అలా దేశాలు కూలిపోవటం మొదలవుతుంది. అన్నట్లు, నేను పొగ తాగటం మానేసి చాలాకాలమే అయ్యింది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భర్త సిగరెట్ అలవాటు ప్రభావం భార్య గర్భధారణపై ఉంటుందా..?
Husband Smoking Habit Affect Wife Pregnancy: భర్త సిగరెట్ తాగితే ప్యాసివ్ స్మోకింగ్ ప్రభావాల కారణంగా దాని దుష్ప్రభావాలు దంపతులిద్దరిపైనా ఉంటాయన్న విషయం అనేక పరిశోధనల్లో తేలిన విషయమే. అయితే అతడు ఇంటి బయట సిగరెట్ తాగి వచ్చినా ఆ అలవాటు దంపతులిద్దరితో పాటు భార్య తాలూకు గర్భధారణపై కూడా పడుతుంది. అతడి సిగరెట్ అలవాటు వల్ల సంతాన సాఫల్య అవకాశాలూ తగ్గుతాయి. అతడు తాగే సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆ దుష్ప్రభావాలూ పెరుగుతాయి. భర్తకి స్మోకింగ్ అలవాటు ఉన్నప్పుడు అతడి పార్ట్నర్కు గర్భధారణ కూడా ఆలస్యం కావచ్చు. దీనికి అనేక కారణాలున్నప్పటికీ... ముఖ్యంగా అతడి స్మోకింగ్ కారణంగా భార్యలోని హార్మోన్ సైకిళ్లలో పాలు పంచుకునే జీవరసాయనాల్లో మార్పు రావచ్చు. దాంతో ఆమెలోని అండాల సంఖ్య గణనీయంగా తగ్గవచ్చు. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యం కాదు. మహిళకు సంతాన సాఫల్య చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చి... ఆమె భర్తకు సిగరెట్ అలవాటు ఉన్నప్పుడు... ఐవీఎఫ్ లాంటి ప్రక్రియలో ఆమె ఓవరీ స్టిమ్యూలేషన్కు మరిన్ని మందులు అవసరమవుతాయి. అందుకే సాధారణ దంపతులతో పోలిస్తే భర్తకు ఈ దురలవాటు ఉన్న మహిళలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. గర్భస్రావాలు అయ్యే అవకాశాలూ పెరుగుతాయి. గర్భధారణ జరిగాక కూడా నెలలు నిండకముందే బిడ్డపుట్టే (ప్రీమెచ్యుర్ డెలివరీకి) అవకాశాలూ పెరుగుతాయి. అలా పుట్టే చిన్నారుల బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఇక పొగతాగే పురుషుల విషయానికే నేరుగా వస్తే... తమ అలవాటు కారణంగా వాళ్ల వీర్యంలో శుక్రకణాల సంఖ్య, కదలిక, చురుకుదనం, వాటి ఆరోగ్యం తగ్గుతాయి. అది నేరుగా సంతాన సాఫల్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే సమయానికి గర్భధారణ, మంచి ఆరోగ్యకరమైన శిశువును కోరుకునేవారు ఈ దురలవాటును వదులుకోవడమే మేలు. అంతేకాదు... కేవలం సంతానం విషయంలోనే కాకుండా వారి ఆరోగ్యంతో పాటు, భవిష్యత్తులో వారి పిల్లల ఆరోగ్యానికీ ఇది మేలు చేస్తుంది. చదవండి: Overhydration: నీరు ఎక్కువ తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు మరి! -
ఆ దిగ్గజ ఆటగాడు గ్రౌండ్లోకి వచ్చే ముందు సిగరెట్ కాల్చేవాడు..
మెల్ బోర్న్: స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సంచలన విషయాలు వెల్లడించాడు. వార్న్‌కు మైదానంలోకి అడుగుపెట్టే ముందు సిగరెట్ కాల్చే అలవాటు ఉండేదని బహిర్గతం చేశాడు. కెరీర్ మొత్తంలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన స్పిన్ మాంత్రికుడు.. అఫ్ ద ఫీల్డ్ విషయాల గురించి ఉపశమనం పొందేందుకే ఆ విధంగా చేసేవాడని చెప్పుకొచ్చాడు. వార్న్‌కు మానసిక స్థైర్యం ఎక్కువని, అదే అతని బలమని పేర్కొన్నాడు. వార్న్.. ఆన్ ఫీల్డ్‌లో ఏరకంగా రెచ్చిపోయేవాడో, అఫ్ ద ఫీల్డ్ కూడా అదే రకంగా ప్రవర్తించి వివాదాలను కొని తెచ్చుకునేవాడని కుండ బద్దలు కొట్టాడు. దీంతో అతను మీడియా నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించేందుకు సిగరెట్ కాల్చేవాడని, తన వ్యక్తిగత విషయాలు ఆటపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే అతను అలా చేసే వాడని వివరించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అల్ టైమ్ గ్రేట్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వార్న్.. తన హయాంలో ఆస్ట్రేలియాను జగజ్జేతగా నిలిపాడని కొనియాడాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సందర్భాల్లో మీడియా వార్న్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేసేదని, దానికి అతడు గ్రౌండ్‌లోనే బదులిచ్చేవాడని చెప్పుకొచ్చాడు. మైదానం వెలుపల అతని ప్రవర్తన ఎలా ఉన్నా, దాని తాలూకా ప్రభావాన్ని మాత్రం ఆన్ ఫీల్డ్ ఎప్పుడూ చూపించేవాడు కాదని వార్న్‌ను వెనకేసుకొచ్చాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న వార్న్.. 145 మ్యాచ్‌ల్లో 708 వికెట్లు సాధించాడు. -
మా ముందే సిగరేట్ తాగుతారా..
సాక్షి, చిలమత్తూరు(అనంతపురం) : సీనియర్ విద్యార్థుల ముందే జూనియర్ విద్యార్థులు సిగరేట్ తాగడం వివాదానికి దారి తీసింది. మా ముందే సిగరేట్ తాగుతారా అంటూ జూనియర్ ఇంటర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థి పైశాచికంగా ప్రవర్తించాడు. కర్ర తీసుకుని విచక్షణారహితంగా బాదాడు. దీన్ని వీడియో తీసిన కొందరు విద్యార్థులు వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే... చిలమత్తూరులోని డీవీఅండ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జనరల్, ఒకేషనల్ గ్రూపుల్లో దాదాపు 350 మంది విద్యార్థులు చదువుతున్నారు. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని అధ్యాపకులు కళాశాలలో విద్యార్థులకు మూడు రోజులుగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో సిరికల్చర్ గ్రూప్‌కు సంబంధించిన ఇద్దరు జూనియర్ విద్యార్థులు సిగరెట్ తాగుతున్నారని కళాశాల ఎదుట బైరేకుంట సమీపంలో సీనియర్ విద్యార్థి ఒకరు గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా కర్ర తీసుకుని ఒక జూనియర్ విద్యార్థిని విచక్షణారహితంగా చితకబాదాడు. ఈ దృశ్యాన్ని వీడియో కూడా తీశారు. మూడు రోజుల తర్వాత ఈ వీడియోను సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో అప్లోడ్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధిత విద్యార్థులు కోడూరు, వీరాపురం గ్రామాలకు చెందిన వారని, కర్రతో బాదిన విద్యార్థి లాలేపల్లికి చెందినవాడని గుర్తించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు విషయం తెలిసిన వెంటనే సీనియర్ విద్యార్థి పరారయ్యాడు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. కర్రతో కొట్టిన విద్యార్థిని కళాశాల నుంచి బహిస్కరిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. -
దేశంలో పొగతాగుతున్న పిల్లలు 6.25 లక్షలు
న్యూఢిల్లీ: దేశంలో 6.25 లక్షల కన్నా ఎక్కువ మంది పిల్లలు రోజూ సిగరెట్ తాగుతున్నారట. భారత్‌లో ధూమపానం దురలవాటు వల్లే ప్రతివారం 17,887 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికన్ కేన్సర్ సొసైటీ, వైటల్ స్ట్రాటెజీస్ రూపొందించిన ‘గ్లోబల్ టొబాకో అట్లాస్’ నివేదికలో విస్మయకర అంశాలున్నాయి. స్మోకింగ్ వల్ల ఏటా భారత్‌కు వాటిల్లుతున్న నష్టం సుమారు రూ. 1,81,869 కోట్లుగా తేలింది. నివేదిక ప్రకారం, భారత్‌లో రోజూ సుమారు 4 లక్షల మంది బాలురు, 2 లక్షల మంది బాలికలు సిగరెట్ తాగుతున్నారు. వయోజనుల్లో పురుషులు 9 కోట్లు, మహిళలు సుమారు కోటిన్నర మంది పొగతాగుతున్నారు. -
సన్నబడాలని.. సిగరెట్లు ఊదేస్తున్నారు!!
లావుగా ఉన్నప్పుడు సన్నబడాలంటే ఏం చేయాలి? తగినంత వ్యాయామం చేస్తూ, ఆహారపు అలవాట్లను కొద్దిగా మార్చుకోవాలి. కానీ, తాము లావుగా ఉన్నామని.. అధిక బరువుతో ఉన్నామని అనుకునే టీనేజర్లు మాత్రం వ్యాయామం చేయడానికి బదులు సింపుల్‌గా సిగరెట్లు ఊదేస్తున్నారట. ఈ విషయం తాజా పరిశోధనలలో వెల్లడైంది. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ఈ అంశంపై పరిశోధనలు చేసింది. అమ్మాయిలలో 46 శాతం, అబ్బాయిలలో 30 శాతం మంది ఇలా సిగరెట్లు కాలుస్తున్నారట. అసలు తమ బరువు గురించి పెద్దగా పట్టించుకోని, లేదా సరైన బరువులోనే ఉన్నామని చెప్పేవాళ్లకంటే.. తాము చాలా ఎక్కువ లావుగా ఉన్నామని భావించే అమ్మాయిలు 225 శాతం ఎక్కువగా సిగరెట్లు కాలుస్తున్నారు. అబ్బాయిలు కూడా ఇలా చేస్తున్నా, వాళ్లకు సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడి అమ్మాయిల కంటే తక్కువగా ఉండటంతో వాళ్లు సిగరెట్లు కాల్చడం కూడా తక్కువగానే ఉంటోందని అంటున్నారు. అసలు యువతీ యువకులు ఇలా ఆరోగ్యానికి హాని కలిగించే పనులు ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోడానికి ఈ పరిశోధన బాగా ఉపయోగపడిందని కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ కాలీ తెలిపారు. వందేళ్ల క్రితం టీబీ, ఇన్‌ఫ్లూయెంజా లాంటి వ్యాధులతో ఎక్కువగా చనిపోయేవారని, కానీ ఇప్పుడు మనం కోరి తెచ్చుకునే జబ్బులతోనే త్వరగా చనిపోతున్నారని ఆయన అన్నారు. పిల్లల్లో పొగతాగే అలవాటు విషయం తేల్చడానికి2001-02 నుంచి 2005-06 వరకు 11, 13, 15 ఏళ్ల వయసున్న దాదాపు 10,500 మంది అమెరికన్ స్కూలు విద్యార్థులతో సర్వే చేశారు. -
మహిళలూ.. 'పొగ'రాణులూ..!