
న్యూఢిల్లీ: దేశంలో 6.25 లక్షల కన్నా ఎక్కువ మంది పిల్లలు రోజూ సిగరెట్ తాగుతున్నారట. భారత్‌లో ధూమపానం దురలవాటు వల్లే ప్రతివారం 17,887 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికన్ కేన్సర్ సొసైటీ, వైటల్ స్ట్రాటెజీస్ రూపొందించిన ‘గ్లోబల్ టొబాకో అట్లాస్’ నివేదికలో విస్మయకర అంశాలున్నాయి. స్మోకింగ్ వల్ల ఏటా భారత్‌కు వాటిల్లుతున్న నష్టం సుమారు రూ. 1,81,869 కోట్లుగా తేలింది. నివేదిక ప్రకారం, భారత్‌లో రోజూ సుమారు 4 లక్షల మంది బాలురు, 2 లక్షల మంది బాలికలు సిగరెట్ తాగుతున్నారు. వయోజనుల్లో పురుషులు 9 కోట్లు, మహిళలు సుమారు కోటిన్నర మంది పొగతాగుతున్నారు.