'అరెస్ట్‌లతో ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు'
హైదరాబాద్: వరంగల్ ఎన్‌కౌంటర్‌పై నిరసనగా బుధవారం చలో అసెంబ్లీకి ప్రజాసంఘాల నేతలు, వామపక్షాల నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థులను, పలువురు నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్యను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. గృహనిర్బంధంలో ఉన్న చుక్కారామయ్య తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడారు.
ఈ రోజు ఉదయం సీఐ తన ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తున్నానని చెప్పినట్టు ఆయన అన్నారు. ప్రజల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని కోరారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ప్రజల ఆకాంక్షలను అణిచివేయలేరని చుక్కా రామయ్య స్పష్టం చేశారు.