సివిల్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం అర్బన్: సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఆహ్వానిస్తున్నామని సాంఘిక సంక్షేమ డీడీ విశ్వమోహనరెడ్డి తెలిపారు. అభ్యర్థులు 2016 ఆగస్టు ఒకటి నాటికి 21 సంవత్సరాలు నిండి, 37 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు అర్హులన్నారు.
శారీరంగా వికలాంగ అభ్యర్థులు 42 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఏ సబ్జెక్టులోనైనా డిగ్రీ పొంది, కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 6 లక్షలకు మించకూడదని తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్ర స్థాయిలో 700 మంది ఎస్సీలను, 300 మంది ఎస్టీలను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 31 తేదీలోగా దరఖాస్తులను ‘ఎన్టీఆర్విద్యోన్నతి.ఓఆర్జీ’ వెబ్సైలో లాగిన్ అయి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించుకోవాలని సూచించారు. వచ్చేనెల 21వ తేదీన జరిగే ఈ ప్రవేశ పరీక్షకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపూర్ పట్టణాల్లో పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశారని వివరించారు.