clashes between
-
తెలంగాణలో " కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ "
-
కొండపల్లి ‘పోడుభూమి’ రణరంగం
సాక్షి, పెంచికల్పేట్: కొండపల్లి ‘పోడుభూమి’రణరంగమైంది. గిరిజనులకు, పోలీసులకు మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. పోలీసులపైకి గిరిజన రైతులు, మహిళలు రాళ్ల దాడి చేశారు. పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం కొండపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. అటవీ భూముల్లో ప్లాంటేషన్ నిలిపివేయాలని, పోడు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత పాల్వాయి హరీశ్‌బాబు రెండురోజులుగా నిరవధిక దీక్ష చేపట్టారు. అర్ధరాత్రి దీక్షా శిబిరం వద్దకు జిల్లాస్థాయి అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.హరీశ్‌బాబుతోపాటు పార్టీ జిల్లా కార్యదర్శి కొంగ సత్యనారాయణను పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించడంతో మహిళలు, రైతులు తిరగబడి రాళ్ల దాడికి దిగారు. దీంతో కాగజ్‌నగర్ రూరల్ సీఐ, పెంచికల్పేట్ ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. పోలీసులను అడ్డుకున్న గ్రామస్తులు హరీశ్‌బాబును రెబ్బెన వైపు వాహనంలో తరలించగా.. మరో పోలీసు అధికారుల బృందం కొండపల్లి మీదుగా పెంచికల్పేట్ చేరుకోవటానికి బయలుదేరింది. దీంతో కొండపల్లి పొలిమేర్లలో పోలీసుల వాహనాలను మహిళలు అడ్డుకున్నారు. హరీశ్‌బాబును విడిచిపెట్టాలని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం వేకువజాము 4 గంటల వరకూ పోలీసులను ఘెరావ్ చేశారు. ఆసిఫాబాద్ ఏఎస్పీ అచ్చేశ్వర్రావు అదనపు పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన మహిళా కానిస్టేబుల్స్ తిరుపతిబాయి, కోమలి రెబ్బెనలో పోలీసు వాహనాల అడ్డగింపు బెజ్జూర్ మండలం రెబ్బెన గ్రామం మీదుగా పోలీసులు హరీశ్‌బాబును తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న గ్రామస్తులు అదే రాత్రి 12 గంటల సమయంలో పెద్దసంఖ్యలో రోడ్డుకు అడ్డుగా నిలిచారు. పోలీసు వాహనాలను ఆపేసి టైర్లలో గాలిని తీసేశారు. వాహనంలో ఉన్న హరీశ్‌బాబును తీసుకునివెళ్లారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారని, మహిళల కళ్లలో కారం చల్లి ఇష్టారీతిన వ్యవహరించారని హరీశ్‌బాబు విమర్శించారు. పలువురిపై కేసు నమోదు కొండపల్లిలో పోలీసులపై దాడికి పాల్పడి, పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పెంచికల్‌పేట ఎస్సై రమేశ్ తెలి పారు. బీజేపీ నేతలు పోలీసుల కళ్లలో కారంకొట్టి దాడి చేశారని, కాగజ్‌నగర్ రూరల్ సీఐ, ఎస్సై, ఇద్దరు మహిళాకానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఆరు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారని, దాడులకు పాల్పడిన వారిపై కేసు నమెదు చేశామని వివరించారు. -
ఒంగోలులో టీడీపీ అరాచకం
సాక్షి, ఒంగోలు సిటీ: ఒంగోలు అగ్జిలీయం పాఠశాలలోని పోలింగ్ బూత్‌ల్లో తెలుగుదేశం ఏజెంట్లు లేకపోవడంతో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ అక్కడికి వెళ్లి పోలింగ్ బూత్‌లో కూర్చుని పోలింగ్ ఆపించారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లు బాలినేని శ్రీనివాసరెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని పోలింగి తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. గోరంట్ల కాంప్లెక్సు వద్ద బాలినేని వాహనాలు, దామచర్ల వాహనాలు ఎదురయ్యాయి. అక్కడ వారి అభిమానులు, కార్యకర్తలు గుమిగూడారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ నాయకుడు ప్రసాద్‌పై దౌర్జన్యం చేయడంతో పాటు పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై గొడవ జరిగింది. డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దామచర్లను అక్కడి నుంచి పంపించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గొడవకు దిగకుండా బాలినేని వారిని నియంత్రించారు. స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఒంగోలు ఏబీఎం కళాశాల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను పోలీసుల సహకారంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు భయభ్రాంతులకు గురి చేశారు. డీఎస్పీ అక్కడికి చేరుకొని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తిట్ల పురాణం అందుకున్నారు. దీంతో అక్కడ ఇరుపార్టీల కార్యకర్తలు గుమిగూడారు. ముగ్గురు ఏజెంట్లను అరెస్టు చేశారు. బాలినేని డీఎస్పీతో మాట్లాడి వైఎస్సార్ సీపీ ఏజెంట్లను విడిపించారు. ఒంగోలులో దామచర్ల జనార్దన్ అనుచరులు కొన్ని ప్రాంతాల్లో దౌర్జన్యాలకు దిగారు. వారికి ఉన్న పోలీసు పలుకుబడిని ఉపయోగించి కార్యకర్తలపై కేసులు పెట్టించారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దౌర్జన్యానికి దిగారు. బాలినేని, కాకుమాని రాజశేఖర్ వంటి నాయకులు టీడీపీ అరాచకాలను దీటుగా ఎదుర్కొన్నారు. అగ్జిలియం, ఏబీఎం వద్ద జరిగిన సంఘటనలు కొద్దిపాటి ఉద్రిక్తలకు దారి తీశాయి. టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగారు. ఓపీఎస్ పోలింగ్ బూత్ వద్ద కొందరు టీడీపీ మహిళలు వారికి అనుకూలంగా ఓట్లు వేయించుకొనే పనిలో పడ్డారు. దీన్ని అక్కడున్న నాయకులు భాస్కర్‌రెడ్డి, నాగిరెడ్డి తదితరులు టీడీపీ మహిళా కార్యకర్తలను అడ్డుకున్నారు. పోలీసుకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఓపీఎస్ వద్దకు చేరుకున్నారు. -
జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాస
-
ఎస్వీయూలో విద్యార్ధుల ఘర్షణ
-
పరిటాల సునీత,సూరి వర్గాల మధ్య ఘర్షణ
-
వైఎస్ఆర్ సీపీ,టీడీపీ మధ్య బాహాబాహీ
-
ఆయన... ఈయన... మధ్యలో పొరపొచ్చాలు
కొనసా...గుతున్న తాత్కాలిక ఈవో పాత ఈవో, కొత్త ఈవో మధ్య పొరపొచ్చాలు నేడు కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష విజయవాడ : రాజధాని ప్రాంతంలో అతి పెద్ద దేవాలయం దుర్గగుడి ప్రస్తుతం తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ అధికారి పాలనలో ఉంది. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఈవో సీహెచ్ నర్సింగరావు మార్చి రెండో వారంలో పక్షం రోజులు సెలవు పెట్టి వెళ్లారు. ఆ పక్షం రోజులకు తాత్కాలిక ఈవోగా చంద్రశేఖర్ ఆజాద్‌ను నియమించారు. నర్సింగరావు తిరిగి విధుల్లోకి చేరినా ఆయన్ను ఈవోగా నియమించలేదు. కనీసం చంద్రశేఖర్ ఆజాద్‌ను పర్మినెంట్ ఈవోగా ప్రకటించలేదు. ఈ ఇద్దరు కాకుండా మరొకరిని నియమించాలని ప్రభుత్వం భావించినా ఆ నిర్ణయం వేగవంతంగా తీసుకోవడం లేదు. దుర్గగుడి ఈవో నియామకంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో మూడు ప్రధాన ఉత్సవాలు ఆగస్టులో కృష్ణానది పుష్కరాలు, ఆ తరువాత అక్టోబర్‌లో దసరా ఉత్సవాలు, డిసెంబర్లో భవానీ దీక్షలు జరుగనున్నాయి. ఉత్సవాలకు కొద్ది రోజులు ముందుగా పర్మినెంట్ ఈవోను నియమిస్తే ఆయనకు దేవస్థానంపై అవగాహన ఏర్పడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సులభమవుతుంది. గురువారం కృష్ణా పుష్కరాలపై చర్చించేందుకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఈవో, ఇతర ఉన్నతాధికారులు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో పర్మినెంట్ ఈవో నియామకంపై నిర్ణయం తీసుకుంటే మేలని పలువురు సూచిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో ఇన్చార్జీదే నిర్ణయం కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇన్చార్జి ఈవో చంద్రశేఖర్ ఆజాద్ నిర్ణయాలు తీసుకుంటున్నా రు. ఇందులో కొన్ని వివాదాస్పదమవుతున్నాయి. ము ఖ్యంగా దేవస్థానం ఎదురుగా ఓ భక్తుడు లక్షలు వెచ్చిం చి నిర్మించిన షెడ్‌ను ఆ భక్తుడి చేతే తొలగించాలని తీసుకున్న నిర్ణయంపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. అలాగే అమ్మవారి కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూం కొండ దిగువకు మార్చాలనే తాత్కాలిక ఈవో ఆజాద్ నిర్ణయాన్ని గత ఈవో సీహెచ్ నర్సింగరావు తిరస్కరించారు. అమ్మవారి విలువైన ఆభరణాలు భద్రత లేని చోట పెట్టేందుకు తాను సుముఖంగా లేనని తిరస్కరించారు. మల్లికార్జున మహామండంలో పనులు పూర్తి కాలేదు. నాణ్యత సరిగా లేదని గత ఈవో బిల్లులు నిలిపివేశారు. అన్నదాన భవ నం, ప్రసాదాల తయారీ భవనాలను తరలించాలనే నిర్ణయాలపై భక్తుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. పర్మినెంట్ ఈవో ఉంటే బాగుంటుందనే భావన అందరిలోనూ నెలకొంది. దీనిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.