మ్యాగీపై రూ.640 కోట్ల నష్టపరిహారానికి ప్రభుత్వం దావా
న్యూఢిల్లీ: నెస్లే ఇండియాపై రూ.640 కోట్ల నష్టపరిహారం కోసం కేంద్రప్రభుత్వం క్లాస్ యాక్షన్ సూట్ దాఖలు చేసింది. అనుచిత వ్యాపార విధానాలకు పాల్పడినందుకు, తప్పుడు లేబులింగ్ చేసినందుకు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు ఈ స్థాయిలో పరిహారం చెల్లించాలని ప్రభుత్వం తన పిటీషన్లో పేర్కొంది.