ఓపెన్ యూనివర్సిటీ తరగతులు రద్దు
అనంతపురం ఎడ్యుకేషన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం ఆర్ట్స్ కళాశాల అధ్యయన కేంద్రంలో ఈనెల 6న తరగతులు రద్దు చేసినట్లు కోఆర్డినేటర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రంగస్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరోజు కానిస్టేబుల్ నియామక పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఓపెన్ యూనివర్సిటీ తరగతులు రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి తరగతులు షెడ్యూలు ప్రకారం జరుగుతాయన్నారు.