Cleaning program
-
టీటీడీ ఈవో ధర్మరెడ్డి సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్న భక్తులు
-
ఏపీలో స్వచ్ఛత భేష్.. ఎన్జీటీ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న స్వచ్ఛతా కార్యక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఘన, ద్రవ వ్యర్థాలు, మురుగు నీటి నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నట్టు పేర్కొంది. రెండు రోజులుగా రాష్ట్రంలోని స్వచ్ఛతా పనులపై విచారణ చేపట్టిన ఎన్జీటీ న్యాయమూర్తులు శుక్రవారం సాయంత్రం తీర్పునిచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని పలు పట్టణాల్లో అమలు చేస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రణాళిక, అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛతా పనుల ప్రణాళికను ఇలాగే అమలు చేయాలని, ఈ పనులకు కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నాయకత్వంలోని ఎన్జీటీ సూచించింది. పర్యావరణానికి హానికరంగా పరిణమించిన వ్యర్థాలను సమర్థంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం 2016లో వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత ఫిర్యాదులు అందిన రాష్ట్రాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ తీరుతెన్నులు తమ ముందుంచాలని ఆయా రాష్ట్రాలకు ఎన్జీటీ నోటీసులు ఇచ్చింది. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ద్రవ వ్యర్థాల నిర్వహణలో రోజుకు మిలియన్ లీటర్లకు రూ.2 కోట్ల చొప్పున, మెట్రిక్ టన్నుకు రూ.300 వంతున జరిమానా విధించింది. ఈ మేరకు రాజస్థాన్‌కు రూ.3,000 కోట్లు, మహారాష్ట్రకు రూ.12,000 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.3,000 కోట్లు, తెలంగాణకు రూ.3,800 కోట్లు, కర్ణాటకకు రూ.2,900 కోట్ల మేర జరిమానా విధించింది. రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఎన్జీటీ నోటీసులు జారీ చేసినప్పటికీ.. ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తూ నోటీసులను ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో సమర్థంగా స్వచ్ఛతా పనులు.. - ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం– క్లీన్ ఆంధ్రప్రదేశ్’ (క్లాప్)ని అమలు చేస్తోంది. - రాష్ట్రంలోని అన్ని గ్రామాలను, నగరాలను పరిశుభ్రంగా మార్చేందుకు బిన్ ఫ్రీ, లిట్టర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీగా మార్చేందుకు ప్రణాళికా బద్ధంగా ప్రభుత్వం పని చేస్తోంది. తడి, పొడి, ప్రమాదకరమైన వ్యర్థాలను వేరు చేసి, ఇంటి వద్దనే సేకరించేందుకు వీలుగా ప్రతి ఇంటికి మూడు చొప్పున 1.21 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీ చేసింది. - పొడి చెత్తను ప్రాసెస్ చేసి, దాన్నుంచి తిరిగి ఉపయోగించదగిన వస్తువులను వినియోగంలోకి తీసుకువచ్చే ప్రక్రియలను కూడా చేపట్టింది. చెత్త తరలింపునకు వీలుగా జీపీఎస్ ట్రాకింగ్‌తో కూడిన 2,737 గార్బేజ్ ఆటో టిప్పర్లు, 287 ఈ–ఆటోలు, 880 ట్రక్కులు, 480 కంపాక్టర్లను యూఎల్బీల్లో వినియోగిస్తున్నారు. - సేకరించిన చెత్తను ప్రాసెసింగ్ ప్లాంట్లకు చేర్చే ప్రక్రియలో భాగంగా 123 మున్సిపాలిటీల్లో 138 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల (జీటీఎస్)ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో రోజుకు 6,890 టన్నుల ఘన వ్యర్థాలను, 86 లక్షల మెట్రిక్ టన్నుల ప్రమాదకర వ్యర్థాలు, 1503 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలను శుద్ధి చేస్తున్నారు. - లక్ష కంటే తక్కువ జనాభా గల పట్టణాల్లో 91 స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను ఏర్పాటు చేస్తున్నారు. మరో 71 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. లక్ష మించి జనాభా ఉన్న పురపాలక సంఘాల్లో రూ.1,436 కోట్లతో, లక్ష లోపు జనాభా గల వాటిలో రూ.1,445 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం చేపట్టింది. -
కాలుష్య కోరల్లో మూసీ
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక మూసీ కాలుష్య కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. ఈ నదిలో కాలుష్య మోతాదు అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదికలో వెల్లడైంది. మహానగరం పరిధిలోని గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నిత్యం విడుదలవుతున్న 1,600 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో జలమండలి కేవలం 800 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలను మాత్రమే ఆరు ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మరో 800 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తుండడంతోనే ఇది రోజురోజుకూ కాలుష్య కాసారమవుతోంది. పరిశ్రమల కారణంగానే.. కొందరు పరిశ్రమల నిర్వాహకుల కాసుల కక్కుర్తి మూసీ ఉసురు తీస్తోంది. బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీల నుంచి వెలువడుతున్న ప్రమాదకర పారిశ్రామిక, రసాయన వ్యర్థాలను నిబంధనల ప్రకారం సమీపంలోని శుద్ధి కేంద్రాలకు పంపించాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో ట్యాంకర్‌కు రూ.10వేలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట సెప్టిక్ ట్యాంకర్లు, నీళ్ల ట్యాంకర్లు, డీసీఎంల్లో నగర శివారుల్లోకి తరలించి మూసీలో డంప్ చేస్తుండటంతో మూసీ కాలుష్య కాసారమవుతోంది. పరిమితులివీ.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం లీటర్ నీటిలో డీఓ పరిమాణం కనీసం 4 ఎంజీలుండాలి. అంతకంటే తక్కువగా ఉంటే ఆ చెరువు లేదా కుంటలో జలచరాలు బతకవు. బీఓడీ విషయానికొస్తే లీటర్ నీటి లో 3 ఎంజీలను మించకూడదు. డీఓ తగ్గుతున్న కొద్దీ బీఓడీ పెరుగుతుంది. ఇలా జరుగుతుంటే ఆ జల వనరుల్లో కాలుష్యం పెరుగుతుందని అర్థం. మూసీ ప్రస్థానం ఇలా.. ఈ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్‌లో పుట్టి.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మీదుగా ప్రవహించి మిర్యాలగూడకు సమీపంలోని వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తోంది. మొత్తం 250 కి.మీ. ప్రవహిస్తోంది. దేశంలోని అత్యంత కలుషితమైన నదుల్లో ఇదీ చేరిందంటే.. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ ప్రాంతాల్లో నది నీటి నాణ్యతను పీసీబీ ఎప్పటికప్పుడు పరీక్షిస్తోంది. తాజాగా.. 2017లో కాలుష్య తీవ్రతపై ప్రత్యేక నివేదికను రూపొందించింది. ప్రక్షాళనకు ప్రణాళిక ఇదే.. ♦ మూసీ నదిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండో దశ ప్రక్షాళన పథకాన్ని తక్షణం పూర్తి చేస్తే కొంత మేర ఉపశమనం ఉంటుంది. ఇందుకు రూ.2000 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. ♦ మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున నూతనంగా మొత్తం.. పది సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేయాల్సి ఉంది. ♦ ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలు: అంబర్పేట్ (142ఎంఎల్డీ), నాగోల్(140ఎంఎల్డీ), నల్లచెరువు (80ఎంఎల్డీ), హైదర్షాకోట్ (30), అత్తాపూర్ (70ఎంఎల్డీ), మీరాలం(6ఎంఎల్డీ), ఫతేనగర్ (30ఎంఎల్డీ), ఐడీపీఎల్ టౌన్షిప్ (59ఎంఎల్డీ), నాగారం(29ఎంఎల్డీ), కుంట్లూర్, హయత్‌నగర్ (24 ఎంఎల్డీ) రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్, ఐడీపీఎల్ టౌన్షిప్, నాగారం కాప్రా కాలుష్యమిలా.. ♦ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) బాపూ ఘాట్ వద్ద 28 మిల్లీ గ్రాములు, నాగోల్ వద్ద 26, ప్రతాపసింగారం వద్ద 26 మిల్లీగ్రాముల మేర నమోదవడం గమనార్హం. ఇది నిర్దేశిత పరిమితుల కంటే చాలా అధికం. ♦ నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ (డీఓ) బాపూఘాట్ వద్ద 1.6 ఎంజీ, నాగోల్ వద్ద 0.06 ఎంజీ, ప్రతాపసింగారం వద్ద 1.0 ఎంజీగా నమోదైంది. అంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో జలచరాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. -
స్కైవే..సందిగ్ధం
కాలుష్య కారక నదుల్లో జాతీయ స్థాయిలో నాలుగోదిగా నిలిచిన ‘మూసీ’ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుందరీకరణ ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. ఇందులో భాగంగా చేపట్టనున్న ఈస్ట్– వెస్ట్ కారిడార్(స్కైవే)కు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు జారీచేసే అంశంపై ఎటూ తేల్చడం లేదు. సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక మూసీ నది సుందరీకరణ ప్రక్రియలో భాగంగా చేపట్టనున్న ఈస్ట్– వెస్ట్ కారిడార్(స్కైవే) ప్రాజెక్టుకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ పర్యావరణ అనుమతులు జారీచేసే అంశంపై సందిగ్ధత వీడడం లేదు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టేట్‌లెవల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఈఐఏఏ)లు రూపొందించిన పర్యావరణ ప్రభావ నివేదిక ఏకపక్షంగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ వేత్తలు, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే హడావుడిగా నివేదిక రూపొందించారని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు పర్యావరణ అనుమతి కోసం (ఈసీ) నివేదించారని పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రాజెక్టు స్వరూపం.. రీచ్1: ఉస్మాన్‌సాగర్ హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ల నుంచి బాపూ ఘాట్‌వరకు(19 కి.మీ) చూడముచ్చటైన రహదారిని తీర్చిదిద్దడం. అంచనా వ్యయం రూ.647.98 కోట్లు రీచ్2: బాపూఘాట్ నుంచి నాగోల్ బ్రిడ్జి(21.50)కి.మీ మార్గంలో రహదారి ఏర్పాటుకు రూ.2162.01కోట్లు రీచ్3: నాగోల్‌బ్రిడ్జి నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డు (గౌరెల్లి) వరకు (15 కి.మీ) మార్గంలో అప్రోచ్ రోడ్ ఏర్పాటు రూ.155.52 కోట్లు. ప్రస్తుత దుస్థితి ఇదీ.. వికారాబాద్ జిల్లా అనంతగిరి మూసీ జన్మస్థానం. అక్కడినుంచి సుమారు 90 కి.మీ మేర ప్రవహించి ఈ నది బాపూఘాట్ వద్ద హైదరాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడి నుంచి నగర శివార్లలోని ప్రతాపసింగారం వరకు సుమారు 44 కి.మీ మార్గంలో ప్రవేశిస్తోంది. నిత్యం గృహ, వాణిజ్య,పారిశ్రామిక వాడల నుంచి 1400 మిలియన్ లీటర్ల మురుగునీరు నిత్యం ఈ నదిలోకి ప్రవేశిస్తోంది. ప్రధానంగా జీడిమెట్ల, బాలానగర్, సనత్‌నగర్ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న పారిశ్రామిక వ్యర్థజలాలతో నదిలో రసాయన కాలుష్యం పెరుగుతోంది. కాగా మూసీలోకి చేరుతున్న వ్యర్థజలాల్లో జలమండలి నాగోల్, నల్లచెరువు, అత్తాపూర్, అంబర్పేట్ మురుగు శుద్ధి కేంద్రాల్లో 700 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసి ఈ నదిలోకి వదిలిపెడుతోంది. మిగతా 700మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసేందుకు పదిచోట్ల నూతనంగా మురుగుశుద్ధి కేంద్రాలు, రెండుచోట్ల రీసైక్లింగ్ యూనిట్లు నిర్మించాలని జలమండలి రూ.1200 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రక్షాళన పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నది జాతీయ స్థాయిలో కాలుష్యకారక నదుల్లో మూసీ నది నాలుగోస్థానంలో నిలవడం ఈ నది దుస్థితికి అద్దం పడుతోంది. మూసీ ప్రక్షాళన రెండోదశకు రూ.1200 కోట్లు అవసరం.. . మూసీ నదిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండోదశ ప్రక్షాళన పథకాన్ని తక్షణం పూర్తిచేయాల్సి ఉంది. ఇందుకు రూ.1200 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున మొత్తం..పది సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేయాల్సి ఉంది. ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలు: అంబర్పేట్(142ఎంఎల్డి),నాగోల్(140ఎంఎల్డి), నల్లచెరువు (80ఎంఎల్డి), హైదర్షాకోట్ (30), అత్తాపూర్ (70ఎంఎల్డి), మీరాలం(6ఎంఎల్డి), ఫతేనగర్ (30ఎంఎల్డి), ఐడీపీఎల్ టౌన్షిప్ (59ఎంఎల్డి), నాగారం(29ఎంఎల్డి), కుంట్లూర్‌హయత్‌నగర్ (24 ఎంఎల్డి) రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్, ఐడీపీఎల్ టౌన్షిప్, నాగారం కాప్రా పర్యావరణ ప్రభావనివేదిక లోపభూయిష్టం మూసీరివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన పర్యావరణ ప్రభావ నివేదిక లోపభూయిష్టంగా ఉంది. మూసీ ప్రవాహమార్గంలో ఏర్పాటుచేసిన పలు వాణిజ్య, నివాస సముదాయాలతో మూసీ రోజురోజుకూ మూసుకుపోతోంది. చాదర్‌ఘాట్ వద్ద మూసీ ప్రవాహమార్గంపైనే మెట్రో స్టేషన్,దాని పక్కనే ఎంజీబీఎస్ బస్‌స్టేషన్ ఏర్పాటుచేశారు. భారీ వర్షాలు,వరదలు వచ్చినపుడు వీటి మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. మూసీఅభివృద్ధి ప్రాజెక్టుపై పర్యావరణ వేత్తలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తరవాతే పనులు మొదలుపెట్టాలి. మూసీ రివర్ మేనేజర్మెంట్ కమిటీ ఏర్పాటుచేసి చారిత్రక నదిని పరిరక్షించాలి.– ప్రొఫెసర్ నరసింహారెడ్డి,పర్యావరణవేత్త -
రాజాధానిలో టీడీపీ రాక్షస క్రీడ
-
రాజధానిలో పోటాపోటీగా శుద్ధి కార్యక్రమం
-
రాజధానిలో పచ్చనేతల రాక్షసానందం
-
రాజధానిలో పోటాపోటీగా శుద్ధి కార్యక్రమం
అమరావతి : రాజధానికి సీఎం చంద్రబాబుతో పట్టిన అరిష్టం పోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం వినూత్న నిరసన చేపట్టారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు తిరిగిన రోడ్లపై గో పంచకంతో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, రైతులు పాల్గొన్నారు. అంతకుముందు సచివాలయం ఎదుట టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు తొలగించి శుద్ధి కార్యక్రమం చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు వచ్చిన తర్వాతనే అరిష్టం పట్టుకుందన్నారు. అరిష్టం పోవాలనే శుద్ధి కార్యక్రమం చేపట్టమని చెప్పారు. మూడు పంటలు పండించే రైతులు ఇప్పుడు వలసపోతున్నారని ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంత గ్రామాల్లో రైతులు, రైతు కూలీల పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో టీడీపీ నేతలు బినామీలుగా మారారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడంతో జీర్ణించుకోలేక టీడీపీ నేతలు తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని చెప్పారు. శుద్ధి నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.అనుమతి లేకుండా నిర్వహించిన టీడీపీ నేతల ర్యాలీని ఎందుకు అడ్డుకోలేదని పోలీసులను నేతలు ప్రశ్నించారు.