cleans air
-
గాలిని నిమిషాల్లో పరిశుభ్రం చేసే రోబో ఎయిర్ ప్యూరిఫైయర్!
‘కరోనా’ విజృంభణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ప్యూరిఫైయర్ల వినియోగం పెరిగింది. సాధారణ ఎయిర్ ప్యూరిఫైయర్లను గదిలో ఎక్కడో ఒకచోట ఫ్యాన్‌ను పెట్టుకున్నట్లే పెట్టుకోవాల్సి ఉంటుంది. అవి వాటి సామర్థ్యాన్ని బట్టి గదిలోని గాలిని శుభ్రపరుస్తాయి. కొరియన్ డిజైనర్ సాంగ్ ఇల్ సిన్ తాజాగా ‘ప్లాని’ పేరుతో రోబో ఎయిర్ ప్యూరిఫైయర్‌ను రూపొందించాడు. ఇది ఇల్లంతా కలియదిరుగుతూ గాలిలోని తేడాలను గుర్తించి, దానికి అనుగుణంగా పనిచేస్తుంది. ఇందులో ప్రత్యేకమైన సెన్సార్లు ఏర్పాటు చేయడం వల్ల దీని దారికి మనుషులు, పెంపుడు జంతువులు అడ్డు వచ్చినా, తప్పుకుని ముందుకు సాగుతుంది. పొగ, దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు నిలిచి ఉండి, అక్కడి గాలిని నిమిషాల్లోనే పరిశుభ్రం చేస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది. -
కాలుష్యాన్నే ఆభరణంగా మార్చే యంత్రం
చైనా రాజధాని బీజింగ్‌లో కాలుష్య మేఘాలు దట్టంగా కమ్ముకొని ప్రజలను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసిన సంఘటన చూసి డచ్‌కు చెందిన డాన్ రూసర్ గార్డె కాలుష్యానికి విరుగుడుగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్యూరిఫయర్ కనుగొన్నాడు. ఆకాశాన్ని కమ్ముకున్న కాలుష్య మేఘాల నుంచి కణాలను తన వైపు ఆకర్షించి స్వచ్ఛమైన గాలిలా మార్చే స్మాగ్ ఫ్రీ టవర్‌కు రూసర్ రూపకల్పన చేశాడు. అంతే కాకుండా కాలుష్య కణాలను ఈ టవర్ కంప్రెస్ చేసి డైమండ్ రూపంలో ఉన్న రాళ్లను ఉత్పత్తి చేస్తుంది. చూడడనికి అందంగా ఉండే ఈ రాళ్ల రూపంలో ఉన్న వస్తువు ఆభరణంగా వాడడానికి పనికొస్తుంది. ఇది ఇయాన్(ఐఓఎన్) టెక్నాలజీతో పనిచేస్తుందని గార్డె తెలిపాడు. ఈ టవర్ చుట్టు పక్కల పరిసరాలను 75 శాతం వరకు క్లీన్ గా ఉంచగులుగుతుందని గార్డె తెలిపాడు. ఈ టవర్‌ను తొలిసారిగా సెప్టెంబర్‌లో బీజింగ్‌లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్మాగ్ ఫ్రీ టవర్ వాతావరణ కాలుష్య సమస్యల పై ప్రజల్లో అవగాహ కల్పించడానికి కూడా ఉపయోగపడుతుందని తెలిపాడు. హాలాండ్‌లో నిర్వహించిన ముందస్తు పరీక్షల్లో స్మాగ్ ఫ్రీ టవర్ మంచి ఫలితాలను ఇచ్చింది. బీజింగ్‌లో అమర్చిన తర్వాత ప్రపంచంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని వాడనున్నారు. బీజింగ్‌లో కాలుష్య మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో గతంలో 'రెడ్ అలర్ట్' ప్రకటించిన విషయం తెలసిందే. ఈ కాలుష్య మేఘాల దాటికి ఏకంగా పాఠశాలలకు సెలవులిచ్చారు. భవన నిర్మాణాలను నిలిపివేశారు. రోడ్డు పక్కన తినుబండారాలను తయారుచేసే షాపులను మూసివేశారు. ప్రజలు వీధుల్లోకి వస్తే తప్పనిసరి మాస్కులు ధరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కొన్ని విదేశీ, కొన్ని దేశీయ విమాన సర్వీసులను రద్దుచేశారు. రోడ్లపై సగానికి సగం కార్ల రాకపోకలను నియంత్రించారు. భారీ వాహనాలను, చెత్తను తీసుకెళ్లే మున్సిపల్ వాహనాలను కొన్ని రోజులపాటు పూర్తిగా నిలిపివేశారు. చలికాచుకునేందుకు ఏర్పాటు చేసుకొనే కుంపట్లలో బొగ్గు వినియోగాన్ని తగ్గించాలని హెచ్చరికలు జారీ చేశారు. కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్న ప్రపంచ నగరాల్లో బీజింగ్ నగరమే మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.