cloning method
-
నకిలీ వేలి ముద్రల తయారీ ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్ : క్లోనింగ్ పద్ధతిలో నకిలీ వేలి ముద్రలను తయారు చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సైదాబాద్‌లోని చంపాపేట్‌లో అక్రమంగా క్లోనింగ్ వేలి ముద్రలు తయారు చేస్తూ అమ్మకాలు సాగిస్తోంది. వివిధ కాలేజీల్లో పని చేస్తున్న ఫ్యాకల్టీ వేలి ముద్రలను తయారు చేస్తూ తప్పుడు విధానంతో ఆన్లైన్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఇప్పిస్తున్నారు. కెమికల్స్ ఉపయోగించి క్లోనింగ్ ద్వారా 29 మంది వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మసీకి చెందిన ఫ్యాకల్టీ వేలి ముద్రలు తయారు చేశారు. 15 మంది విద్యార్థులకు ఒక ప్రోపెసర్ ఉండాలన్న యూనివర్సిటీల నిబంధనను తప్పించుకునేందుకు క్లోనింగ్ వేలి ముద్రలు తయారు చేశారు. నిందితులను బొమ్మ రామకృష్ణ, పోరెడ్డి సుదర్శన్ రెడ్డి, గోపాల్ రెడ్డిలుగా పోలీసుల గుర్తించారు. బొమ్మ రామకృష్ణ అసోషియేట్ ప్రోపెసర్ కాగా, పోరెడ్డి సుదర్శన్ రెడ్డి వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ బాటసింగారంలో వైఎస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. గోపాల్ రెడ్డి కూడా వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో సెక్రెటరీగా పని చేస్తున్నాడు. వీరు ఫీజు రిఎంబర్స్మెంట్ కోసం విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా క్లోనింగ్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా తీసుకున్నారని సిటీ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. -
ఆ ఒక్కచెట్టు.. తోట పెట్టు
ఒక్క చెట్టుకే 14 రకాల మామిడికాయలు న్యూస్‌లైన్, గంగవరం, సాధారణంగా ఓ మామిడితోటలో ఎన్నిరకాల చెట్లుంటాయి? ‘బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, కలకటేరు, ఇమాం పసంద్, సువర్ణరేఖ, నీలం..’ ఇలా మహా అయితే ఓ పదిరకాలుంటాయి. కానీ.. ‘రాజు తలచుకుంటే కానిదేదీ లేదు’ అని నిరూపిస్తూ.. చోడరాజు రాజుబాబు ఒక చెట్టునే అరుదైన తోటగా అవతరింపజేశారు. ‘చెట్టేమిటి, తోట కావడమేమిటి?’ అంటారా.. రాజుబాబు కృషి 14 రకాలుగా ఫలించి, కళ్లెదుట సాక్షాత్కరిస్తోంది మరి! తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం మొల్లేరుకు చెందిన రాజుబాబు తన ఇంటి ఆవరణలోని ఓ కలకటేరు చెట్టుకు 2012 వర్షాకాలంలో క్లోనింగ్ పద్ధతిలో 13 రకాల మామిడిని అంట్లు కట్టారు. ఈ వసంత రుతువులో ఆ తరువు ‘14 జాతుల కొలువు’గా ఫలించింది. తన ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడా చెట్టుకు కలకటేరుతో పాటు చిన్నరసాలు, పెద్దరసాలు, బంగినపల్లి, సువర్ణరేఖ, పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి, హైదర్ సాహెబ్, నీలం, పంచదార కల్తీ, ఇమాం పసందు, చెరకురసం, పునాస, పాపారాయుడు గోవ జాతుల కాయలు కాశాయని రాజుబాబు చెప్పారు.