Closing ceremonies
-
అట్టహాసంగా ఏషియాడ్ ముగింపు వేడుకలు
-
జకార్తా జిగేల్...
ఒక దీవి... 2 వేదికలు...45 దేశాలు... 40 క్రీడాంశాలు 11000 అథ్లెట్లు... లక్షల్లో వీక్షకులు...15 రోజుల ఏషియాడ్ ‘షో’కు తెరపడింది. ఆరంభానికి తీసిపోని విధంగా ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ చిత్రగీతాలు వేదికపై హైలైట్ అయ్యాయి. వేడుకకే శోభ తెచ్చాయి. ఇండోనేసియాలో రెండోసారీ ఆసియా క్రీడలు సూపర్ హిట్టయ్యాయి. జకార్తా: ఆటలు ఆగాయి. పాటలు సాగాయి. మిరుమిట్లు మిన్నంటాయి. వెలుగులు వెన్నెలనే పరిచాయి. ఆరంభం అదిరినట్లే... ముగింపు శోభ కనువిందు చేసింది. మొత్తానికి వేడుక ముగిసింది. వేదిక మురిసింది. అథ్లెట్లకు, అధికారులకు ఆతిథ్య ఇండోనేసియా బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలికింది. పతకాలు గెలిచిన అథ్లెట్లంతా గర్వంగా జకార్తాను వీడితే... పోరాడిన అథ్లెట్లు మళ్లీ లక్ష్యంపై స్ఫూర్తితో ముందుకు సాగారు. ఈ క్రీడల చివరిరోజు ఆదివారం మిక్స్డ్ ట్రయాథ్లాన్ ఈవెంట్ జరిగింది. జపాన్ బృందం ఈ గేమ్స్ చివరి స్వర్ణాన్ని సాధించింది. ఆటలేమో చూడలేదు కానీ! ఇండోనేసియా వాసులు ఇక్కడి ‘గెలోరా బంగ్ కర్నో’ స్టేడియంలో జరిగిన ఆటల్ని పట్టించుకోలేదు. ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాంశాలు ఇక్కడే జరిగినా... ఎందుకనో అంతగా ఆసక్తి కనబరచలేదు. అయితే వినోదాన్ని పంచే ముగింపు ఉత్సవానికి మాత్రం ఎగబడ్డారు. దీంతో 76 వేల సీట్ల సామర్థ్యం ఉన్న గెలోరా వేదిక ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. రెండు గంటల పాటు సాగిన ఈ ముగింపు వేడుకల్ని వారంతా తనివితీరా ఆస్వాదించారు. ముఖ్యంగా ఇండోనేసియా వారికి బాలీవుడ్ చిత్రాలన్నా, స్టార్లన్నా ఎక్కడలేని క్రేజ్. అందుకేనేమో సిద్ధార్థ్ స్లాథియా, డెనద పాడిన ‘కోయి మిల్ గయా’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘జై హో’ పాటలకు జేజేలు పలికారు. స్టేడియంపై ఆకాశ వీధిలో బాణసంచా వెలుగులు మిరుమిట్లు గొలిపాయి. ఆసియా స్ఫూర్తిని చాటేలా భారత్, చైనా, ఉభయ కొరియాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మార్చ్‌పాస్ట్‌లో హాకీ ప్లేయర్ రాణి రాంపాల్ త్రివర్ణ పతా కంతో భారత జట్టును నడిపించింది. రెండువారాల క్రితం ఆరంభోత్సవంలో ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడోడో బైక్ స్టంట్తో వేదికకు విచ్చేయగా... ఈసారి వీడియో సందేశంతో వచ్చారు. క్రీడాప్రపం చాన్ని ఉర్రూతలూగించిన ఈ గేమ్స్‌ను ఆస్వా దించిన వారికి ఆయన అభినందనలు తెలి పారు. ఈ వేడుకల్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్, ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ చీఫ్ అహ్మద్ అల్ ఫహాద్ స్టేడియంలోని వీఐపీ గ్యాలరీ నుంచి ప్రత్య క్షంగా వీక్షించారు. 2022 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతాయి. ఈ ఆసియా క్రీడల్లో 45 దేశాలు పాల్గొనగా... 37 దేశాలు కనీసం కాంస్య పతకాన్ని సాధించాయి. శ్రీలంక, పాలస్తీనా, ఈస్ట్ తిమోర్, బంగ్లాదేశ్, మాల్దీవులు, భూటాన్, బ్రూనై దేశాలు రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. -
...క్షమించండి ముగింపు వేడుకలపై
గోల్డ్‌కోస్ట్: ఘనంగా ప్రారంభమై సజావుగా సాగిన ప్రతిష్ఠాత్మక 21వ కామన్వెల్త్ క్రీడల ముగింపు వేడుకలు మాత్రం ఆ స్థాయిలో జరగలేదు. ప్రసారకర్తలు కనీసం అథ్లెట్ల మార్చ్‌పాస్ట్‌ను కూడా పూర్తి స్థాయిలో చూపించలేకపోయారు. సుదీర్ఘ ప్రసంగాల కవరేజీపైనే ఎక్కువ దృష్టిపెట్టడంతో విసుగెత్తిన ప్రేక్షకులు ముందుగానే వెళ్లిపోయారు. దీనిపై విమర్శలు రావడంతో క్రీడల చీఫ్ పీటర్ బీటీ సోమవారం క్షమాపణ చెప్పారు. అథ్లెట్లను కార్యక్రమంలో భాగం చేయాలనుకుని ముందుగానే స్టేడియంలోకి తీసుకురావడంతో వారి మార్చ్‌పాస్ట్‌ను చూసే అవకాశం టీవీ ప్రేక్షకులను దక్కలేదు. దీంతో అంతా తారుమారై కార్యక్రమ ప్రాధాన్యత మారిపోయింది. -
రియోత్సవం ముగిసింది
ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి ముందు ఎన్నో సందేహాలు... ఆర్థికంగా చితికిపోయిన దేశం ఇంత పెద్ద క్రీడలను ఎలా నిర్వహిస్తుందనే అనుమానాలు... జికా వైరస్, దోపిడిలతో అవాంతరాలు... కానీ బ్రెజిల్ వీటన్నింటినీ అధిగమించింది. దక్షిణ అమెరికా ఖండంలో తొలిసారి ఒలింపిక్స్ క్రీడా సంబరాన్ని అత్యంత ఘనంగా నిర్వహించింది. ప్రారంభవేడుకలను మరిపించేలా ముగింపు వేడుకలు కూడా అదిరిపోయాయి. తమ దేశ చరిత్ర, భిన్నత్వంలో ఏకత్వాన్ని కళ్లకు కట్టినట్టుగా కళాకారులు తమ ప్రదర్శన ద్వారా చూపారు. రియో ఒలింపిక్ పతాకాన్ని 2020లో గేమ్స్ జరిగే టోక్యో గవర్నర్‌కు అందివ్వడంతో అధికారికంగా ఒలింపిక్స్ ముగిశాయి. ≈ అట్టహాసంగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ≈ 2020లో టోక్యోలో క్రీడలు రియో డి జనీరో: పదిహేడు రోజుల పాటు దిగ్గజ ఆటగాళ్ల విన్యాసాలతో పాటు కొత్తచాంపియన్లను అందించిన ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ముగిశాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ 31వ గేమ్స్ ముగింపు వేడుకలు విశ్వ క్రీడాభిమానులను మరోసారి ఆకట్టుకున్నాయి. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ షోలో కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులకు తోడు కళాకారుల అబ్బుర పరిచే విన్యాసాలతో ప్రఖ్యాత మరకానా స్టేడియంలో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా వేడుకలు కొనసాగాయి. అథ్లెట్లు కూడా రెయిన్‌కోట్స్, గొడుగులు పట్టుకుని స్టేడియంలో కనిపించారు. నృత్యాలు చేస్తూ సెల్ఫీస్ తీసుకుంటూ సందడి చేశారు. అయితే స్టేడియంలో ప్రేక్షకులు మాత్రం 70 శాతం మాత్రమే హాజరయ్యారు. 42 విభాగాల్లో 207 దేశాల నుంచి 11,544 మంది అథ్లెట్లు పాల్గొన్న రియో గేమ్స్ ముగిసినట్టుగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అధికారికంగా ప్రకటించారు. 2020లో 32వ క్రీడా సంబరాలు జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతాయి. ఈమేరకు ఒలింపిక్ పతాకాన్ని టోక్యో గవర్నర్ యురికో కొయికేకు అందించారు. ముగింపు ఉత్సవం హైలైట్స్ ♦ మకావు చిలుక తరహాలో కళాకారులు దుస్తులు ధరించి స్టేడియంలోకి ప్రవేశించారు. రియోలోని ప్రఖ్యాత దర్శనీయ స్థలాలను ఏరియల్ ద్వారా వీక్షిస్తే ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించారు. చివర్లో ఒలింపిక్ రింగ్స్‌గా మారి ఆకట్టుకున్నారు. ♦ రియో సాంబా పితామహుడు మార్టిన్హో డా సిల్వా తన ముగ్గుకు కుమార్తెలు, మనవరాళ్లతో కలిసి ఆల్‌టైమ్ పాపులర్ సాంగ్స్‌ను ఆలపించాడు. అనంతరం 26 రాష్ట్రాలకు చెందిన 27 మంది పిల్లలు బ్రెజిల్ జాతీయ గీతాన్ని ఆలపించారు ♦ భారత్ తరఫున రెజ్లర్ సాక్షి మలిక్ త్రివర్ణ పతాకాన్ని చేతబట్టుకుని ముందు నడవగా దాదాపు 50 మంది అథ్లెట్లు తనను అనుసరించారు. ఇందులో భారత హాకీ జట్లు, బాక్సర్లు, రెజ్లర్లు ఉన్నారు. ♦ ఆ తర్వాత 11 నిమిషాల పాటు టోక్యో 2020కి కేటాయించారు. రాబోయే ఒలింపిక్స్‌ను తాము ఏవిధంగా నిర్వహించబోతున్నామో చిత్రరూపకంగా తెలిపారు. సూపర్ మరియో వస్త్ర ధారణలో జపాన్ ప్రధాని షింజో అబే స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. ♦ అనంతరం అధికారికంగా గేమ్స్ ముగిసినట్టు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ ప్రకటించారు. 16 రోజులు మొత్తం ప్రపంచాన్ని బ్రెజిల్ ఆనందడోలికల్లో ముంచెత్తాయని, రాబోయే తరాలకు ఈ గేమ్స్ ఓ మధుర జ్ఞాపకంగా మిగులుతాయని ఆయన అన్నారు. ♦ రియో గేమ్స్ పతాకాన్ని కిందికి దించి టోక్యో మేయర్‌కు అప్పగించారు. ♦ చివర్లో కార్నివాల్ పరేడ్ అందరినీ ఉర్రూతలూగించింది. ప్రసిద్ధ సాంబా సాంగ్స్‌తో పాటు బ్రెజిల్ టాప్ మోడల్ ఇజబెల్ గౌలర్ట్ ప్రవేశంతో స్టేడియంలో జోష్ పెరిగింది. వందలాది సాంబా నృత్యకారులు రియో సిటీ థీమ్ సాంగ్ అయిన ‘సిడాడే మరివిల్హోసా’కు దుమ్మ రేపే రీతిలో చిందులు వేశారు. ♦ ఇక గేమ్స్ ముగింపు సూచకంగా మరకానా స్టేడియం పైకప్పు నుంచి భారీగా బాణసంచా కాల్చడంతో రియో ధగధగలాడింది. -
నేటితో ఆఖరు
యో డి జనీరో: పక్షం రోజుల్లో.. ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాళ్లు, అద్భుతమైన విన్యాసాలకు వేదికగా నిలిచి.. క్రీడాభిమానులకు కన్నుల పండగ చేసిన రియో ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. ఆగస్టు 5న ప్రారంభమైన ఈ క్రీడా పండగ ముగింపు వేడుకలను ఆదివారం రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుక సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ముగింపు వేడుకలు భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున గం.4.15 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం